🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భక్తిసాధనా రహస్యములు - 1 🌻
భక్తునకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే. భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తులు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు గావలెను. వానికి రస స్పర్శకలుగును.
శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను. ఎంతమంచిదయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
25 Feb 2022
No comments:
Post a Comment