25 - FEBRUARY - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, గురువారం, ఫిబ్రవరి 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 25-3 - 327 - పరమ పదము🌹
3) 🌹. శివ మహా పురాణము - 525 / Siva Maha Purana - 525 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -155🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 143 / Osho Daily Meditations - 143 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 25, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 11 🍀*

*21. త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి |*
*త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యాత్త్రాహి వేగతః*
*22. నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః |*
*ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయినీ*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీరు ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రం నుంచే ముందుకు కదలాలి. అప్పుడు మీరుచేసే ప్రతి పని ధర్మమవుతుంది.🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
మాఘ మాసం
తిథి: కృష్ణ నవమి 12:58:29 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: జ్యేష్ఠ 12:08:07 వరకు
తదుపరి మూల
యోగం: వజ్ర 23:59:20 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: గార 12:56:29 వరకు
సూర్యోదయం: 06:37:07
సూర్యాస్తమయం: 18:21:17
వైదిక సూర్యోదయం: 06:40:43
వైదిక సూర్యాస్తమయం: 18:17:42
చంద్రోదయం: 01:38:07
చంద్రాస్తమయం: 12:56:19
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
వర్జ్యం: 19:36:20 - 21:06:00
దుర్ముహూర్తం: 08:57:57 - 09:44:53
మరియు 12:52:40 - 13:39:37
రాహు కాలం: 11:01:10 - 12:29:12
గుళిక కాలం: 08:05:08 - 09:33:09
యమ గండం: 15:25:14 - 16:53:15
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 03:50:48 - 05:21:12
మరియు 28:34:20 - 30:04:00
చర యోగం - దుర్వార్త శ్రవణం 12:08:07
వరకు తదుపరి స్థిర యోగం - 
శుభాశుభ మిశ్రమ ఫలం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -327 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-3 📚*
 
*🍀 25-3. పరమపదము - భోగభాగ్యములకై దైవము నారాధించువారు భోగలోకములు చేరుదురు. ధర్మము నాచరించు వారు ధర్మముతో కూడిన క్షేత్రములను చేరుదురు. ఆరాధనకు ఏ గుణదోష మేర్పడిన అట్టి దోషము గల లోకములలో పడుదురు. ఆరాధకుల భ్రమలను బట్టి, సంస్కారమును బట్టి, ఆరాధింప బడు వస్తువు పరిమితిని బట్టి, పరిమితము సంకుచితము అగు లోకముల యందు జీవులు తిరుగాడుచు నుందురు. “యద్భావం తద్భవతి" అను వాక్యము సృష్టి యందలి శాశ్వత సత్యము. 🍀*

*26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |*
*భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||*

*తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.*

*వివరణము : తమో గుణము ప్రధానముగ ఆరాధనము చేయువారు చీకటి లోకములలో పడుదురు. అట్లే రజోగుణము నాశ్రయించి ఆరాధనములు చేయువారు అవిశ్రాంత లోకములు చేరుదురు. ఆరాధనకు ఏ గుణదోష మేర్పడిన అట్టి దోషము గల లోకములలో పడుదురు. కనుకనే మోసము చేయువారి చుట్టును మోసగించు వారుందురు. అహంకారుల చుట్టును అహంకారులే చేరుదురు. సదాచారము గలవారు సత్పురుష సమాశ్రయమున నుందురు. ఉగ్రరూపముల నారాధించువారు ఉగ్రులై వ్యధ చెందుదురు. ప్రసన్న రూపములను ఆరాధించువారు ప్రసన్న లోకములను చేరుదురు.*

*ఆరాధకుల భ్రమలను బట్టి, సంస్కారమును బట్టి, ఆరాధింప బడు వస్తువు పరిమితిని బట్టి, పరిమితము సంకుచితము అగు లోకములయందు జీవులు తిరుగాడుచు నుందురు. “యద్భావం తద్భవతి" అను వాక్యము సృష్టి యందలి శాశ్వత సత్యము. “ఏగూటి పక్షి ఆ గూటికే చేరును” అను శృతి వాక్యము తెలియని వారెవరు? అపరిమితము, శాశ్వతము, లోకాతీతము అగు నన్ను స్మరించి నా పరమ పదమును చేరుమని భగవానుడు సూచించు చున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 525 / Sri Siva Maha Purana - 525 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 45

*🌻. శివుని సుందర రూపము - 2 🌻*

గంగా యమునలు అందమగు వింజారమలను పట్టిరి. అష్టసిద్ధులు ఆయన యెదట అందముగా నాట్యమాడినవి (13). నేను, విష్ణువు మరియు దేవతలు తమ తమ వేషములను చక్కగా అలంకరించుకొని కైలాస పతితో కలిసి నడచితిమి (14). అపుడు అనేక రూపములు గలవారు, చక్కగా అలంకరించు కున్నవారు, మహానందముతో గూడిన వారు అగు గణములు జయధ్వానములను చేయుచూ శివుని యెదుట నడిచిరి (15).

సిద్ధులు, ఉపదేవతలు, మునులు మరియు ఇతరులు అందరు మహానందముతో శివునితో బాటు నడిచిరి (16). ఈ విధముగా దేవతలందరు కుతూహలముతో కూడిన వారై అలంకరించుకొని తమ భార్యలతో గూడి పరబ్రహ్మ యగు శివుని సేవించిరి (17). అచట విశ్వావసువు మొదలగువారు అప్సరసలతో గూడి శంకరుని ఎదుట ఆయనయెక్క ఉత్తమ కీర్తిని గానము చేయుచున్నవారై నడచిరి (18). ఓ మహర్షీ ! ఇట్లు అచట మహేశ్వరుడు హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుచుండగా నానా విధములుగా మహోత్సవము సంపన్నమాయెను (19).

ఓ మహర్షీ! ఆ సమయమునందలి పరమాత్మ యొక్క మహాసౌందర్యమును ప్రత్యేకించి ఎవడు వర్ణించ గల్గును? (20) ఓ మహర్షీ! అట్టి ఆ శివుని చూచి మేన క్షణ కాలము చిత్తరువు నందలి మనిషి వలె బిత్తరపోయెను. తరువాత ఆమె ఆనందముతో నిట్లనెను (21).

మేన ఇట్లు పలికెను -

నా కుమార్తె ధన్యురాలు. ఆమె గొప్ప తపస్సును చేసినది. ఓ మహాశ్వరా! ఆమె తపస్సు యొక్క ప్రభావము వలననే నీవీనాడు నా ఇంటికి వచ్చితివి (22). ఓ పార్వతీ పతీ! నేనింతకు ముందు తప్పించుకొన శక్యము గాని శివనిందను చేసియుంటిని. ఇపుడు నాపై ప్రసన్నుడవు కమ్ము (23).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 525 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴*

*🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 2 🌻*

13. The Gaṅgā and the Yamunā were waving the Chowries. The eight Siddhis[1] danced in front of Him.

14. Viṣṇu, I, Indra and the other gods bedecked their bodies and dress and accompanied Śiva.

15. The Gaṇas of various forms and features shouted cries of “Victory” “Victory” and walked in front of Śiva.

16. The Siddhas, the secondary gods, the extremely delighted sages went in company of Śiva. The others too were equally delighted.

17. Thus the fully decorated gods, were very jubilant and in the company of their wives they eulogised Śiva, the Supreme Brahman.

18. Viśvāvasu[2] and others along with the celestial damsels sang songs of Śiva’s glory.

19. O excellent sage, when Śiva was nearing the threshold of the palace of Himavat, there was much jubilation there.

20. O excellent sage, who can describe the exquisite splendour of the supreme lord at that time.

21. On seeing Him in that form Menā stood stunned as though drawn in a picture for a moment, O sage, and spoke these words.

Menā said:—

22. O great lord, my daughter is indeed blessed, she by whom the great penance was performed. It is by virtue of that penance that you have come to my threshold.

23. O lord of Pārvatī, be pleased now. Pardon me for the heap of repulsive words I showered on Śiva.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. భక్తిసాధనా రహస్యములు - 1 🌻*

*భక్తునకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే. భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తులు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు గావలెను. వానికి రస స్పర్శ‌కలుగును.*

*శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను. ఎంతమంచిదయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 144 / Osho Daily Meditations - 144🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 144. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం 🍀*

*🕉. వేరొకరిని ప్రేమిస్తే మనం ఎల్లప్పుడూ పరంగా ఆలోచిస్తాము. తల్లి బిడ్డను ప్రేమించాలని భావిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమించాలని భావిస్తుంది; స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అనుకుంటారు. కానీ నిన్ను నువ్వు ప్రేమించుకుంటే తప్ప మరెవరినీ ప్రేమించడం అసాధ్యం. 🕉*
 
*మీలో ప్రేమ ఉన్నప్పుడే మీరు మరొకరిని ప్రేమించగలరు, మీరు ఏదైనా కలిగి ఉన్నప్పుడే మీరు దానిని పంచుకోగలరు. కానీ మొత్తం మానవాళి ఈ తప్పుడు భావజాలం క్రింద జీవించింది, కాబట్టి మనం దానిని తేలికగా తీసుకుంటాము - మనం ఇప్పటికే మనల్ని మనం ప్రేమిస్తున్నట్లుగా మరియు ఇప్పుడు మొత్తం ప్రశ్న మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలనేది. అది అసాధ్యం! అందుకే ప్రేమ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మరియు ప్రపంచం అసహ్యంగా మరియు ద్వేషం, యుద్ధం మరియు హింస మరియు కోపంతో నిండి ఉంది. ఇది గొప్ప అంతర్దృష్టి--నీవు నిన్ను ప్రేమించడం లేదు.*

*మనల్ని మనం ప్రేమించుకోవడం నిజంగా చాలా కష్టం, ఎందుకంటే మనల్ని మనం ఖండించుకోవడం మరియు ప్రేమించడం కాదు. మనం పాపులమని బోధించబడింది. మనకు ఏ మాత్రం విలువ లేదని బోధించారు. అందుకే ప్రేమించడం కష్టంగా మారింది. విలువ లేని వ్యక్తిని ఎలా ప్రేమించగలవు? ఇప్పటికే ఖండించబడిన వ్యక్తిని మీరు ఎలా ప్రేమించగలరు? కానీ అది వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించడం లేదనే అంతర్దృష్టి వచ్చినట్లయితే, చింతించాల్సిన పని లేదు. ఒక కిటికి తెరుచుకుంది. మీరు ఎక్కువసేపు గది లోపల ఉండరు - మీరు బయటకు దూకుతారు. మీరు బహిరంగ ఆకాశాన్ని తెలుసుకున్న తర్వాత, మీరు పాత ప్రపంచానికి పరిమితమై ఉండలేరు. మీరు దాని నుండి బయటపడతారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 144 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 144. LOVINGYOURSELF 🍀*

*🕉 We always think in terms if loving somebody else. The man thinks to love the woman, the woman thinks to love the man; the mother thinks to love the child, the child thinks to love the mother; friends think to love each other. But unless you love yourself it is impossible to love anybody else. 🕉*
 
*You can love somebody else only when you have love within you, You can share something only when you have it. But the whole humanity has lived under this wrong ideology, so we take it for granted-as if we already love ourselves and now the whole question is of how to love our neighbor. It is impossible! That's why there is so much talk about love, and the world remains ugly and full of hatred, war and violence and anger. It is a great insight to come to--that you don't love yourself.*

*It is really hard to love oneself, because we have been taught to condemn ourselves and not to love. We have been taught that we are sinners. We have been taught that we are not of any worth. Because of that it has become difficult to love. How can you love a worthless person? How can you love somebody who is already condemned? But it will come. If the insight that you do not love yourself has come, there is nothing to be worried about. One window has opened. You will not be inside the room for long-you will jump out. Once you know the open sky, you cannot remain confined in a stale world. You will come out of it.* 
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*

*🌻 352-1. 'వహ్నిమండలవాసినీ' 🌻* 

*వహ్నిమండల మందు వసించునది శ్రీమాత అని అర్థము. వహ్నిమండల మనగా సోమ, సూర్య, అగ్ని మండలములు. వహ్ని శబ్దము మూడను అంకెచే సంకేతించబడును. మూడు అగ్ని మండలములతోనే సృష్టి కార్యము నిర్వహింపబడుచున్నది. వీటిని త్రేతాగ్ను లని తెలుపుదురు. ఈ మూడగ్నులును ఆధారముగ త్రిలోకము లేర్పడుచున్నవి. ప్రజ్ఞామయ లోకము, శక్తిమయలోకము, పదార్థమయ లోకము అను మూడు లోకములనే సువర్లోకము, భువర్లోకము, భూలోకము అని అందురు. ఇవి మనయందు నేను అను ప్రజ్ఞగను, దైవాసుర శక్తులుగను, దేహముగను వర్తించు చుండును.*

*పదార్థమందలి అగ్నిని పావకాగ్ని అందురు. జ్వాలవలె ప్రకాశించు అగ్నిని జ్వాలాగ్ని అందురు. ఆకాశమున ప్రకాశించు అగ్నిని విద్యుతాగ్ని అందురు. అవరోహణ మార్గమున ఈ అగ్నులే ఏడు లోకములను సృష్టించు చున్నవి. ఈ త్రేతాగ్నులను ఏడు అగ్నులుగను, 49 అగ్నులు గను కూడ పెద్దలు వివరింతురు. 20వ శతాబ్దమున పై తెలిపిన మూడగ్నులను పరమగురువు జ్వాలాకూలుడు సంపూర్ణముగ ఆంగ్లమున వివరించినాడు. 'Treatise on Cosmic Fire' అని నామకరణము చేసిన ఈ గ్రంథము నందు బ్రహ్మాండము నుండి పిండాండము వరకు అగ్ని ఏ విధముగ సృష్టి కార్య మొనర్చినదో వివరించుట జరిగినది. ఈ వివరణము అత్యద్భుతముగ ఆస్తికులకు, శాస్త్రజ్ఞులకు ప్రేరణ ఇచ్చుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 352-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*

*🌻 352-1. Vahni-maṇḍala-vāsinī वह्नि-मण्डल-वासिनी 🌻*

*She lives in the sphere of fire. Vahni means fire. The sphere of fire is said to be in mūlādhāra cakra and in ākāś or ether. Already nāma 99 mūlādhārika nilaya explained that She resides in the base cakra. The other interpretation that She resides in ākāś is based on the saying that agni prevails in ether as well. Vahni also means numeric three. This numeric three could mean the moon, the sun and the fire one below the other in the spine.*

*The moon is in sahasrāra, the sun in anāhata and the fire in mūlādhāra. She is in the form all these three. The Pañcadaśī mantra consists of three kūṭa-s and this nāma could mean that She resides in this mantra. Possibly this could be the reason why Pañcadaśī mantra is considered as the supreme mantra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment