శ్రీ శివ మహా పురాణము - 525 / Sri Siva Maha Purana - 525
🌹 . శ్రీ శివ మహా పురాణము - 525 / Sri Siva Maha Purana - 525 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 45
🌻. శివుని సుందర రూపము - 2 🌻
గంగా యమునలు అందమగు వింజారమలను పట్టిరి. అష్టసిద్ధులు ఆయన యెదట అందముగా నాట్యమాడినవి (13). నేను, విష్ణువు మరియు దేవతలు తమ తమ వేషములను చక్కగా అలంకరించుకొని కైలాస పతితో కలిసి నడచితిమి (14). అపుడు అనేక రూపములు గలవారు, చక్కగా అలంకరించు కున్నవారు, మహానందముతో గూడిన వారు అగు గణములు జయధ్వానములను చేయుచూ శివుని యెదుట నడిచిరి (15).
సిద్ధులు, ఉపదేవతలు, మునులు మరియు ఇతరులు అందరు మహానందముతో శివునితో బాటు నడిచిరి (16). ఈ విధముగా దేవతలందరు కుతూహలముతో కూడిన వారై అలంకరించుకొని తమ భార్యలతో గూడి పరబ్రహ్మ యగు శివుని సేవించిరి (17). అచట విశ్వావసువు మొదలగువారు అప్సరసలతో గూడి శంకరుని ఎదుట ఆయనయెక్క ఉత్తమ కీర్తిని గానము చేయుచున్నవారై నడచిరి (18). ఓ మహర్షీ ! ఇట్లు అచట మహేశ్వరుడు హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుచుండగా నానా విధములుగా మహోత్సవము సంపన్నమాయెను (19).
ఓ మహర్షీ! ఆ సమయమునందలి పరమాత్మ యొక్క మహాసౌందర్యమును ప్రత్యేకించి ఎవడు వర్ణించ గల్గును? (20) ఓ మహర్షీ! అట్టి ఆ శివుని చూచి మేన క్షణ కాలము చిత్తరువు నందలి మనిషి వలె బిత్తరపోయెను. తరువాత ఆమె ఆనందముతో నిట్లనెను (21).
మేన ఇట్లు పలికెను -
నా కుమార్తె ధన్యురాలు. ఆమె గొప్ప తపస్సును చేసినది. ఓ మహాశ్వరా! ఆమె తపస్సు యొక్క ప్రభావము వలననే నీవీనాడు నా ఇంటికి వచ్చితివి (22). ఓ పార్వతీ పతీ! నేనింతకు ముందు తప్పించుకొన శక్యము గాని శివనిందను చేసియుంటిని. ఇపుడు నాపై ప్రసన్నుడవు కమ్ము (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 525 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴
🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 2 🌻
13. The Gaṅgā and the Yamunā were waving the Chowries. The eight Siddhis[1] danced in front of Him.
14. Viṣṇu, I, Indra and the other gods bedecked their bodies and dress and accompanied Śiva.
15. The Gaṇas of various forms and features shouted cries of “Victory” “Victory” and walked in front of Śiva.
16. The Siddhas, the secondary gods, the extremely delighted sages went in company of Śiva. The others too were equally delighted.
17. Thus the fully decorated gods, were very jubilant and in the company of their wives they eulogised Śiva, the Supreme Brahman.
18. Viśvāvasu[2] and others along with the celestial damsels sang songs of Śiva’s glory.
19. O excellent sage, when Śiva was nearing the threshold of the palace of Himavat, there was much jubilation there.
20. O excellent sage, who can describe the exquisite splendour of the supreme lord at that time.
21. On seeing Him in that form Menā stood stunned as though drawn in a picture for a moment, O sage, and spoke these words.
Menā said:—
22. O great lord, my daughter is indeed blessed, she by whom the great penance was performed. It is by virtue of that penance that you have come to my threshold.
23. O lord of Pārvatī, be pleased now. Pardon me for the heap of repulsive words I showered on Śiva.
Continues....
🌹🌹🌹🌹🌹
25 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment