శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 352-1. 'వహ్నిమండలవాసినీ' 🌻


వహ్నిమండల మందు వసించునది శ్రీమాత అని అర్థము. వహ్నిమండల మనగా సోమ, సూర్య, అగ్ని మండలములు. వహ్ని శబ్దము మూడను అంకెచే సంకేతించబడును. మూడు అగ్ని మండలములతోనే సృష్టి కార్యము నిర్వహింపబడుచున్నది. వీటిని త్రేతాగ్ను లని తెలుపుదురు. ఈ మూడగ్నులును ఆధారముగ త్రిలోకము లేర్పడుచున్నవి. ప్రజ్ఞామయ లోకము, శక్తిమయలోకము, పదార్థమయ లోకము అను మూడు లోకములనే సువర్లోకము, భువర్లోకము, భూలోకము అని అందురు. ఇవి మనయందు నేను అను ప్రజ్ఞగను, దైవాసుర శక్తులుగను, దేహముగను వర్తించు చుండును.

పదార్థమందలి అగ్నిని పావకాగ్ని అందురు. జ్వాలవలె ప్రకాశించు అగ్నిని జ్వాలాగ్ని అందురు. ఆకాశమున ప్రకాశించు అగ్నిని విద్యుతాగ్ని అందురు. అవరోహణ మార్గమున ఈ అగ్నులే ఏడు లోకములను సృష్టించు చున్నవి. ఈ త్రేతాగ్నులను ఏడు అగ్నులుగను, 49 అగ్నులు గను కూడ పెద్దలు వివరింతురు. 20వ శతాబ్దమున పై తెలిపిన మూడగ్నులను పరమగురువు జ్వాలాకూలుడు సంపూర్ణముగ ఆంగ్లమున వివరించినాడు. 'Treatise on Cosmic Fire' అని నామకరణము చేసిన ఈ గ్రంథము నందు బ్రహ్మాండము నుండి పిండాండము వరకు అగ్ని ఏ విధముగ సృష్టి కార్య మొనర్చినదో వివరించుట జరిగినది. ఈ వివరణము అత్యద్భుతముగ ఆస్తికులకు, శాస్త్రజ్ఞులకు ప్రేరణ ఇచ్చుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 352-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 352-1. Vahni-maṇḍala-vāsinī वह्नि-मण्डल-वासिनी 🌻


She lives in the sphere of fire. Vahni means fire. The sphere of fire is said to be in mūlādhāra cakra and in ākāś or ether. Already nāma 99 mūlādhārika nilaya explained that She resides in the base cakra. The other interpretation that She resides in ākāś is based on the saying that agni prevails in ether as well. Vahni also means numeric three. This numeric three could mean the moon, the sun and the fire one below the other in the spine.

The moon is in sahasrāra, the sun in anāhata and the fire in mūlādhāra. She is in the form all these three. The Pañcadaśī mantra consists of three kūṭa-s and this nāma could mean that She resides in this mantra. Possibly this could be the reason why Pañcadaśī mantra is considered as the supreme mantra.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Feb 2022

No comments:

Post a Comment