🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 365-2. 'స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః' 🌻
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీమాత సంతతి. వారిచే సృష్టి కార్యములను నిర్వర్తింప చేయునది శ్రీమాత. వారునూ శ్రీమాత భక్తులే అగుటచే కర్తృత్వ అహంకారమున గాక ఈశ్వరునియందే అధిక చింతన కలిగిన వారై యుందురు. కర్తృత్వము నిర్వర్తింపబడు చుండును. కాని వీరి ఆనందము శ్రీమాత ఆనందముతో పోల్చదగినది కాదు. శ్రీమాత సంతతి పొందు ఆనందము కన్న తాను పొందు ఆనందము మిక్కుటము. సంతతి కలుగుచుండగ వారికి కర్తృత్వ భావము పెరుగుచున్న కొలది బ్రహ్మనందము తగ్గుచుండును. త్రిమూర్తుల ఆనందముకన్న ఆదిత్యుల ఆనందము, రుద్రుల ఆనందము, వసువుల ఆనందము మరికొంత తక్కువగ నుండును. ఆదిత్యులలో పూషుడు, రుద్రులలో శంకరుడు, పూర్ణానందము కలిగి యుందురు.
భగవద్గీత యందలి విభూతి యోగములో శ్రీకృష్ణుడు పేర్కొనిన వారందరునూ ఇతరులతో పోల్చినపుడు అధికులు. అనగా ఆనందమున అధికులు. ఆనందము లవలేశము కూడ లేనివారి నుండి ఆనందము పరిపూర్ణమై యున్నవారి వరకు అందరునూ శ్రీమాత సంతతియే. అహంకార భావము హెచ్చుతగ్గులను బట్టి, ఆనందము హెచ్చుతగ్గులుగ నుండును. అహంకారము దాదాపుగ లేనటువంటి సనక సనందనాదులు, సప్తఋషులు, మనువులు, నారదుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు, పూర్ణానంద స్వరూపులుగ తెలుపబడుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 365-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 365-2. Svātmānanda-lavī-bhūta-brahmādyānanda-santatiḥ स्वात्मानन्द-लवी-भूत-ब्रह्माद्यानन्द-सन्ततिः 🌻
Taittirīya Upaniṣhad (II.8) beautifully describes bliss. “To give the idea of bliss that Brahman represents, take a young and honest man with a commanding personality, well versed in the scriptures, well built and strong. Suppose he owns the wealth of the entire world, then take his maximum stage of happiness as one unit and multiply it with infinity, is the bliss of the Brahman”. In the next verse, the Upaniṣhad says “…being free from desires, he first attains the self represented by the vital breath, then the self represented by the mind, then the self represented by the intellect and the self represented by bliss and finally merges into the cosmic self or the Brahman”.
The bliss is the penultimate stage of the final salvation. Such a sort of bliss can be experienced only during the last stages of merger into the Brahman, the final stages of liberation, the state of kaivalya.
This nāma is in confirmation of nāma 363 which says that she is in fact the Supreme Brahman or the Brahman without attributes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Apr 2022
No comments:
Post a Comment