2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 34-2 - 356 - జీవేశ్వర సంబంధం🌹
3) 🌹. శివ మహా పురాణము - 554 / Siva Maha Purana - 554 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 / Agni Maha Purana - 38 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 173 / Osho Daily Meditations - 173 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 24, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం -2 🍀*
*ఓం శిఖాయాం భాస్కరాయ నమః ।*
*లలాటే సూర్యాయ నమః ।*
*భ్రూమధ్యే భానవే నమః ।*
*కర్ణయోః దివాకరాయ నమః ।*
*నాసికాయాం భానవే నమః ।*
*నేత్రయోః సవిత్రే నమః ।*
*ముఖే భాస్కరాయ నమః ।*
*ఓష్ఠయోః పర్జన్యాయ నమః ।*
*పాదయోః ప్రభాకరాయ నమః ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నేనే స్వయం ఆత్మను అని తెలిసి, స్థిమితంగా ఉన్నవాడు సిద్దుడు. అది పరమైనదిగా భావించి తెలుసుకోవాలి అని ప్రయత్నించేవాడు సాధకుడు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ నవమి 26:54:22 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: శ్రవణ 17:53:06 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: శుభ 23:03:32 వరకు
తదుపరి శుక్ల
కరణం: తైతిల 15:41:48 వరకు
వర్జ్యం: 21:46:20 - 23:19:40
దుర్ముహూర్తం: 16:53:00 - 17:43:40
గుళిక కాలం: 15:24:20 - 16:59:20
యమ గండం: 12:14:20 - 13:49:20
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:39
అమృత కాలం: 07:55:26 - 09:27:22
సూర్యోదయం: 05:54:21
సూర్యాస్తమయం: 18:34:20
చంద్రోదయం: 01:27:28
చంద్రాస్తమయం: 12:52:50
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మకరం
గద యోగం - కార్య హాని , చెడు 17:53:06
వరకు తదుపరి మతంగ యోగం
- అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -356 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 34 📚*
*🍀 34-2. జీవేశ్వర సంబంధము - సమస్తమగు ప్రవర్తనముల యందు ఈశ్వరునే దర్శించుట సేవించుట దిన చర్యగ సాగినపుడు క్రమముగ సమస్తమందలి ఈశ్వరునితో తనకనుబంధము పెరుగును. ఈశ్వరునికి కూడ తాను చేరువగును. గురువు శిష్యుడై, శిష్యుని గురువును చేయుట, తండ్రి కుమారుడై, కుమారుని తండ్రిగ చేయుటవలె జీవేశ్వర సంబంధమున ఈశ్వరుడే జీవుని నుండి ప్రకటించు కొనుచు, జీవుని ఈశ్వరునంత వానిగ మలచును. 'రాజవిద్యా రాజగుహ్య యోగ' వివరణము సంపూర్ణము. 🍀*
*34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।*
*మా మేవైష్యసి యుక్త్యేవ మాత్మానం మత్పరాయణః ||*
*తాత్పర్యము : మనసున నన్నే భావింపుము. అందరి యందు నన్నే దర్శించి సేవింపుము. నన్ను దర్శించుచునే ఎదుటి వానికి నమస్కరింపుము. అన్ని అవస్థల యందు నన్నే కూడి
యుండుము. అపుడు నీవు నేనుగ, నేను నీవుగ ఏకమై యుందుము.*
*వివరణము : ఎవరికైనను తను నమస్కరించు చున్నపుడు వాని యందలి ఈశ్వరునికే నమస్కరింపవలెను. అట్లే ఎవరైనను తనకు నమస్కరించు చున్నపుడు తనలోని ఈశ్వరునికే నమస్కరించు చున్నాడని పూజ్యభావము కలిగి యుండవలెను. తనకు నమస్కరించు చున్నారని మోహపడరాదు, గర్వపడరాదు. ఇట్లు సమస్తమగు ప్రవర్తనముల యందు ఈశ్వరునే దర్శించుట సేవించుట దిన చర్యగ సాగినపుడు క్రమముగ సమస్తమందలి ఈశ్వరునితో తనకనుబంధము పెరుగును. ఈశ్వరునికి కూడ తాను చేరువగును.*
*ఇట్లొకరియందొకరికి అవినాభావ సంబంధము పెరుగుచుండగ ఈశ్వరుడు అనుగ్రహించి జీవుని యందు అవతరించును. జీవుడీశ్వరుడై వెలుగును. గురువు శిష్యుడై, శిష్యుని గురువును చేయుట, తండ్రి కుమారుడై, కుమారుని తండ్రిగ చేయుటవలె జీవేశ్వర సంబంధమున ఈశ్వరుడే జీవుని నుండి ప్రకటించు కొనుచు, జీవుని ఈశ్వరునంత వానిగ మలచును. “నాకు నమస్కరించిన వానిని నా అంత వానిగ చేయుదును” - ప్రణత నిజజనాన్ స్వాత్మ తుల్యాన్ కరోతి అనునది రాజగుహ్య మగు రాజవిద్య. ఇదియే రాజయోగము.*
*శ్రీమద్భగవద్గీత యందలి 9వ అధ్యాయము 'రాజవిద్యా రాజగుహ్య యోగ' వివరణము సంపూర్ణము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 554 / Sri Siva Maha Purana - 554 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴*
*🌻. కామ సంజీవనము - 4 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ మునీ | వేద ధ్వని విస్తరిల్లెను. జనులు నాల్గు విధముల (తత, ఆనద్ధ, సుషిర, ఘనములు) వాద్యములను మ్రోగించిరి (32). శంభుడు తన స్థానమునకు వచ్చి అపుడు మునులను, హరిని, నన్ను లోకారాచము ననుసరించి నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (33). అపుడు జయశబ్దము, నమశ్శబద్దము, మరియు విఘ్నముల నన్నిటినీ పారద్రోలి శుభములనిచ్చే వేద ధ్వని విస్తరిల్లెను (34). అపుడు విష్ణువు, నేను, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, సిద్ధులు, ఉపదేవతలు, నాగులు వేర్వేరుగా స్తుతించిరి (35).
దేవతలిట్లు పలికిరి -
హే శంభో! సర్వాధారా! జయము. ఓ మహేశ్వరా! నీ నామమునకు జయము. ఓరుద్రా! మహాదేవా! జయము. జగత్తును పోషించే ఓ ప్రభూ! జయము (36).కాళీపతీ! స్వామీ! జయము. ఆనందమును పెంపొందించు వాడా! జయము. ముక్కంటీ! సర్వేశ్వరా! జయము. మాయాధీశా! ప్రభూ! జయము (37). గుణరహితా! కామ రహితా! కారణముగు ప్రకృతికి అతీతమైన వాడా! సర్వవ్యాపీ! జయము. లీలచే సర్వముకు ఆధారమై రూపమును ధరించిన వాడా! జయము. నీకు నమస్కారమగు గాక! (38) నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వరా! దయానిధీ! జయము. సచ్చిదానంద రూపా! జయము. మాయచే గుణములను, రూపమును స్వీకరించినవాడా! జయము (39). భయంకరాకారా! రక్షకుడా! సర్వాత్మా! దీనబంధూ! దయాసముద్రా! జయము. వికారహీనుడా! మాయాధీశా! వాక్కులకు, మనస్సునకు అతీతమైన విగ్రహము గలవాడా! జయము (40).
బ్రహ్మ ఇట్లు పలికెను-
విష్ణువు మొదలగు ఆ దేవతలు గిరిజాపతి యగు మహేశ్వర ప్రభుని ఇట్లు స్తుతించి మహానందముతో యథాయోగ్యముగా సేవించిరి (41). ఓ నారదా! అపుడు మహేశ్వరుడు, లీలచే స్వీకరింపబడిన దేహము గలవాడు అగు శివుడు అచట వారందరినీ సన్మానించి వరముల నిచ్చెను (42). వత్సా! విష్ణువు మొదలగు ఆ దేవతలందరు పరమేశ్వరుని అనుమతిని పొంది మహానందముతో ప్రసన్నమగు ముఖములు గలవారై సాదరముగా తమ తమ స్థానములకు వెళ్లిరి (43).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కామ సంజీవనమనే ఏబది యొకటవ అధ్యాయము ముగిసినది (51).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 554 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴*
*🌻 The resuscitation of Kāma - 4 🌻*
Brahmā said:—
32. O sage, there was great jubilation then. Sounds of Vedic chants rose up. People played on the four kinds of musical instruments.
33. Coming back to His apartment, Śiva saluted the sages, Viṣṇu and me according to the worldly convention. He was duly saluted by the gods and others.
34. Shouts of “Victory” and “Obeisance” rose up along with the sound of Vedic mantras which were auspicious and which removed all obstacles.
35. Then Viṣṇu, I (Indra), gods, sages, Siddhas, secondary gods and the Nāgas eulogised Him severally.
The gods said:—
36. O śiva, be victorious. O lord Śiva, the support of all, be victorious. O Rudra, O great lord, the supporter of the world, be victorious.
37. O Pārvatī’s lord, O lord, accentuator of pleasure, O three-eyed one, O lord of all, the lord of illusion, be victorious, be victorious.
38. O lord, devoid of attributes, bereft of desires, O lord beyond all causes, O omnipresent, O playful support of all, O assumer of forms, Obeisance to you, be victorious.
39-40. O lord, bestower of good desires to your devotees, O merciful one, O bliss-formed, assuming forms through magic illusions, be victorious. Be victorious, O kind, O All-souled one, friend of the distressed, storehouse of mercy, O lord of illusion, free from aberrations, whose body is beyond the reach of speech and mind.
Brahmā said:—
41. Eulogising thus, Viṣṇu and others joyously served lord Śiva, the husband of Pārvatī duly, and with great love.
42. O Nārada, Śiva, the lord who had assumed body sportively, granted boons and honour to all present there.
43. O dear one, Viṣṇu and others taking leave of the great lord delightedly returned to their respective places. They were duly honoured and their faces beamed with pleasure.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 / Agni Maha Purana - 38 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. మహాభారత వాఖ్యానము - 1 🌻*
అగ్ని పలికెను : యధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. "నేనే పరబ్రహ్మను" అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.
ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవలకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడన కౌరవులు యుధ్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దైవాసుర యుద్ధము వలె జరిగెను.
భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురింపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను.
స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తారాయణమునకై వేచి యుండెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -38 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 14*
*🌻 Story of the Mahābhārata - 1 🌻*
Agni said:
1-3. The armies of Yudhiṣṭhira and Duryodhana went to Kurukṣetra. Having seen Bhīṣma, Droṇa and others, (Arjuna said) that he would not fight with his preceptors. The Lord (Kṛṣṇa) said to Pārtha (Arjuna), “You need not worry about Bhīṣma and prominent men. The bodies are perishable. But the soul does not perish. This soul is the supreme Brahman. You know that (by realizing that), ‘I am Brahman’ Being neutral towards success and defeat and as a yogin you protect the duties of a king.”
4-6. Being told thus by Kṛṣṇa, Arjuna fought (the battle). He sounded drums remaining in the chariot. Bhīṣma was the first commander for the army of Duryodhana. And Śikhaṇḍi (was the commander) for the Pāṇḍavas. There was a fight between these two armies. (The armies) of the son of Dhṛta-rāṣṭra along with Bhīṣma killed the armies of Pāṇḍavas. The Pāṇḍavas in the company of Śikhaṇḍī[1] and others killed (the army) of the sons of Dhṛtarāṣṭra. The battle between the armies of Kurus and Pāṇḍavas was similar (to the battle) between devas and asuras.
7-10. It was (a cause) for the growth of delight of the devas in the heavens who were watching it. For ten days Bhīṣma destroyed the army of Pāṇḍavas with astras. On the tenth day Arjuna showered arrows on the valiant Bhīṣma. On the words of Drupada, Śikhaṇḍī[2] showered astras just as a cloud would do. The elephants, horses, chariots and infantry were brought down by the astras (of the two armies) mutually. Bhīṣma, able to die at his own will, after having shown the mode of war and being told by the Vasus (a class of deities), was remaining in the bed of arrows awaiting to reach Vasuloka, and for the (commencement of the) summer solstice all the while remaining contemplating on Viṣṇu and praising Him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 173 / Osho Daily Meditations - 173 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 173. జీవితం ఒక ఆట 🍀*
*🕉. జీవితం అనే ఆటలో మీ పాత్రను పోషించండి. పాత్ర పోషణను ఆనందించండి; అయితే తేలిగ్గా తీసుకోండి. దాని గురించి చింతించడం విలువైనది కాదు. 🕉*
*ఒక నిర్దిష్ట పరిస్థితిలో మీరు ఏ పాత్ర పోషించవలసి వచ్చినా, దానిని మీ అత్యంత సామర్థ్యంతో పోషించండి, పూర్తిగా ఆడండి. కానీ అది పూర్తయిన తర్వాత, మీరు విజయం సాధించారా లేదా విఫలమయ్యారా అనేది అప్రస్తుతం. వెనక్కి తిరిగి చూడవద్దు; ముందుకు వెళ్ళండి. మీరు పోషించాల్సిన ఇతర పాత్రలు ఉన్నాయి. వైఫల్యం మరియు విజయం ముఖ్యం కాదు. ప్రతిదీ ఒక ఆట అనే అవగాహన ముఖ్యం. మీ జీవితమంతా ఈ అవగాహనతో నిండినప్పుడు, మీరు విముక్తి పొందుతారు, ఏదీ మిమ్మల్ని బంధించదు, మీరు ఇకపై దేనితోనూ ముడిపడి ఉండరు.*
*అప్పుడు మీరు ఇకపై దేని చేత బంధించబడరు. మీరు ముసుగులు వాడతారు, కానీ అవి మీ అసలు ముఖం కాదని మీకు తెలుసు. మరియు మీరు ముసుగుని తీసివేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది ఏమిటో మీకు తెలుసు. ఇది తొలగించదగినది. అప్పుడు మీరు మీ అసలు ముఖాన్ని కూడా తెలుసుకోవచ్చు. జీవితం అంటే ఆట అని తెలిసిన వాడికి అసలు ముఖం తెలుస్తుంది. ఒకరు తన అసలు ముఖాన్ని తెలుసుకోవడం అంటే తెలుసుకోవలసినది తెలుసుకోవడం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 173 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 173. A GAME 🍀*
*🕉 Play your role, enjoy it; it is fun. But take it lightly. It is not worth worrying about. 🕉*
*Whatever role you have to play in a certain circumstance, play it to your utmost ability, play it totally. But once it is finished, whether you have succeeded or failed is irrelevant. Don't look back; move ahead. There are other roles you have to play. Failure and success are unimportant. What is important is the awareness that everything is a game. When your whole life becomes full of this awareness, you are freed, nothing binds you, you are no longer tethered to anything.*
*Then you are no longer imprisoned by anything. You use masks, but you know that they are not your original face. And you can remove the mask, because now you know it for what it is. It is removable. And now you can know your original face too. The one who is aware that life is a game comes to know the original face. And to know one's original face is to know all that is worth knowing.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 365-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 365-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*
*🌻 365-2. 'స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః' 🌻*
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీమాత సంతతి. వారిచే సృష్టి కార్యములను నిర్వర్తింప చేయునది శ్రీమాత. వారునూ శ్రీమాత భక్తులే అగుటచే కర్తృత్వ అహంకారమున గాక ఈశ్వరునియందే అధిక చింతన కలిగిన వారై యుందురు. కర్తృత్వము నిర్వర్తింపబడు చుండును. కాని వీరి ఆనందము శ్రీమాత ఆనందముతో పోల్చదగినది కాదు. శ్రీమాత సంతతి పొందు ఆనందము కన్న తాను పొందు ఆనందము మిక్కుటము. సంతతి కలుగుచుండగ వారికి కర్తృత్వ భావము పెరుగుచున్న కొలది బ్రహ్మనందము తగ్గుచుండును. త్రిమూర్తుల ఆనందముకన్న ఆదిత్యుల ఆనందము, రుద్రుల ఆనందము, వసువుల ఆనందము మరికొంత తక్కువగ నుండును. ఆదిత్యులలో పూషుడు, రుద్రులలో శంకరుడు, పూర్ణానందము కలిగి యుందురు.
భగవద్గీత యందలి విభూతి యోగములో శ్రీకృష్ణుడు పేర్కొనిన వారందరునూ ఇతరులతో పోల్చినపుడు అధికులు. అనగా ఆనందమున అధికులు. ఆనందము లవలేశము కూడ లేనివారి నుండి ఆనందము పరిపూర్ణమై యున్నవారి వరకు అందరునూ శ్రీమాత సంతతియే. అహంకార భావము హెచ్చుతగ్గులను బట్టి, ఆనందము హెచ్చుతగ్గులుగ నుండును. అహంకారము దాదాపుగ లేనటువంటి సనక సనందనాదులు, సప్తఋషులు, మనువులు, నారదుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు, పూర్ణానంద స్వరూపులుగ తెలుపబడుదురు.
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 365-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini*
*Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻*
*🌻 365-2. Svātmānanda-lavī-bhūta-brahmādyānanda-santatiḥ स्वात्मानन्द-लवी-भूत-ब्रह्माद्यानन्द-सन्ततिः 🌻*
Taittirīya Upaniṣhad (II.8) beautifully describes bliss. “To give the idea of bliss that Brahman represents, take a young and honest man with a commanding personality, well versed in the scriptures, well built and strong. Suppose he owns the wealth of the entire world, then take his maximum stage of happiness as one unit and multiply it with infinity, is the bliss of the Brahman”. In the next verse, the Upaniṣhad says “…being free from desires, he first attains the self represented by the vital breath, then the self represented by the mind, then the self represented by the intellect and the self represented by bliss and finally merges into the cosmic self or the Brahman”.
The bliss is the penultimate stage of the final salvation. Such a sort of bliss can be experienced only during the last stages of merger into the Brahman, the final stages of liberation, the state of kaivalya.
This nāma is in confirmation of nāma 363 which says that she is in fact the Supreme Brahman or the Brahman without attributes.
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment