శ్రీ మదగ్ని మహాపురాణము - 38 / Agni Maha Purana - 38


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 / Agni Maha Purana - 38 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 14

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. మహాభారత వాఖ్యానము - 1 🌻


అగ్ని పలికెను : యధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. "నేనే పరబ్రహ్మను" అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.

ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవలకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడన కౌరవులు యుధ్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దైవాసుర యుద్ధము వలె జరిగెను.

భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురింపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను.

స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తారాయణమునకై వేచి యుండెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -38 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 14

🌻 Story of the Mahābhārata - 1 🌻


Agni said:

1-3. The armies of Yudhiṣṭhira and Duryodhana went to Kurukṣetra. Having seen Bhīṣma, Droṇa and others, (Arjuna said) that he would not fight with his preceptors. The Lord (Kṛṣṇa) said to Pārtha (Arjuna), “You need not worry about Bhīṣma and prominent men. The bodies are perishable. But the soul does not perish. This soul is the supreme Brahman. You know that (by realizing that), ‘I am Brahman’ Being neutral towards success and defeat and as a yogin you protect the duties of a king.”

4-6. Being told thus by Kṛṣṇa, Arjuna fought (the battle). He sounded drums remaining in the chariot. Bhīṣma was the first commander for the army of Duryodhana. And Śikhaṇḍi (was the commander) for the Pāṇḍavas. There was a fight between these two armies. (The armies) of the son of Dhṛta-rāṣṭra along with Bhīṣma killed the armies of Pāṇḍavas. The Pāṇḍavas in the company of Śikhaṇḍī[1] and others killed (the army) of the sons of Dhṛtarāṣṭra. The battle between the armies of Kurus and Pāṇḍavas was similar (to the battle) between devas and asuras.

7-10. It was (a cause) for the growth of delight of the devas in the heavens who were watching it. For ten days Bhīṣma destroyed the army of Pāṇḍavas with astras. On the tenth day Arjuna showered arrows on the valiant Bhīṣma. On the words of Drupada, Śikhaṇḍī[2] showered astras just as a cloud would do. The elephants, horses, chariots and infantry were brought down by the astras (of the two armies) mutually. Bhīṣma, able to die at his own will, after having shown the mode of war and being told by the Vasus (a class of deities), was remaining in the bed of arrows awaiting to reach Vasuloka, and for the (commencement of the) summer solstice all the while remaining contemplating on Viṣṇu and praising Him.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


24 Apr 2022

No comments:

Post a Comment