శ్రీ శివ మహా పురాణము - 554 / Sri Siva Maha Purana - 554


🌹 . శ్రీ శివ మహా పురాణము - 554 / Sri Siva Maha Purana - 554 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴

🌻. కామ సంజీవనము - 4 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ మునీ | వేద ధ్వని విస్తరిల్లెను. జనులు నాల్గు విధముల (తత, ఆనద్ధ, సుషిర, ఘనములు) వాద్యములను మ్రోగించిరి (32). శంభుడు తన స్థానమునకు వచ్చి అపుడు మునులను, హరిని, నన్ను లోకారాచము ననుసరించి నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (33). అపుడు జయశబ్దము, నమశ్శబద్దము, మరియు విఘ్నముల నన్నిటినీ పారద్రోలి శుభములనిచ్చే వేద ధ్వని విస్తరిల్లెను (34). అపుడు విష్ణువు, నేను, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, సిద్ధులు, ఉపదేవతలు, నాగులు వేర్వేరుగా స్తుతించిరి (35).

దేవతలిట్లు పలికిరి -

హే శంభో! సర్వాధారా! జయము. ఓ మహేశ్వరా! నీ నామమునకు జయము. ఓరుద్రా! మహాదేవా! జయము. జగత్తును పోషించే ఓ ప్రభూ! జయము (36).కాళీపతీ! స్వామీ! జయము. ఆనందమును పెంపొందించు వాడా! జయము. ముక్కంటీ! సర్వేశ్వరా! జయము. మాయాధీశా! ప్రభూ! జయము (37). గుణరహితా! కామ రహితా! కారణముగు ప్రకృతికి అతీతమైన వాడా! సర్వవ్యాపీ! జయము. లీలచే సర్వముకు ఆధారమై రూపమును ధరించిన వాడా! జయము. నీకు నమస్కారమగు గాక! (38) నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వరా! దయానిధీ! జయము. సచ్చిదానంద రూపా! జయము. మాయచే గుణములను, రూపమును స్వీకరించినవాడా! జయము (39). భయంకరాకారా! రక్షకుడా! సర్వాత్మా! దీనబంధూ! దయాసముద్రా! జయము. వికారహీనుడా! మాయాధీశా! వాక్కులకు, మనస్సునకు అతీతమైన విగ్రహము గలవాడా! జయము (40).


బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు మొదలగు ఆ దేవతలు గిరిజాపతి యగు మహేశ్వర ప్రభుని ఇట్లు స్తుతించి మహానందముతో యథాయోగ్యముగా సేవించిరి (41). ఓ నారదా! అపుడు మహేశ్వరుడు, లీలచే స్వీకరింపబడిన దేహము గలవాడు అగు శివుడు అచట వారందరినీ సన్మానించి వరముల నిచ్చెను (42). వత్సా! విష్ణువు మొదలగు ఆ దేవతలందరు పరమేశ్వరుని అనుమతిని పొంది మహానందముతో ప్రసన్నమగు ముఖములు గలవారై సాదరముగా తమ తమ స్థానములకు వెళ్లిరి (43).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కామ సంజీవనమనే ఏబది యొకటవ అధ్యాయము ముగిసినది (51).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 554 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴

🌻 The resuscitation of Kāma - 4 🌻


Brahmā said:—

32. O sage, there was great jubilation then. Sounds of Vedic chants rose up. People played on the four kinds of musical instruments.

33. Coming back to His apartment, Śiva saluted the sages, Viṣṇu and me according to the worldly convention. He was duly saluted by the gods and others.

34. Shouts of “Victory” and “Obeisance” rose up along with the sound of Vedic mantras which were auspicious and which removed all obstacles.

35. Then Viṣṇu, I (Indra), gods, sages, Siddhas, secondary gods and the Nāgas eulogised Him severally.


The gods said:—

36. O śiva, be victorious. O lord Śiva, the support of all, be victorious. O Rudra, O great lord, the supporter of the world, be victorious.

37. O Pārvatī’s lord, O lord, accentuator of pleasure, O three-eyed one, O lord of all, the lord of illusion, be victorious, be victorious.

38. O lord, devoid of attributes, bereft of desires, O lord beyond all causes, O omnipresent, O playful support of all, O assumer of forms, Obeisance to you, be victorious.

39-40. O lord, bestower of good desires to your devotees, O merciful one, O bliss-formed, assuming forms through magic illusions, be victorious. Be victorious, O kind, O All-souled one, friend of the distressed, storehouse of mercy, O lord of illusion, free from aberrations, whose body is beyond the reach of speech and mind.


Brahmā said:—

41. Eulogising thus, Viṣṇu and others joyously served lord Śiva, the husband of Pārvatī duly, and with great love.

42. O Nārada, Śiva, the lord who had assumed body sportively, granted boons and honour to all present there.

43. O dear one, Viṣṇu and others taking leave of the great lord delightedly returned to their respective places. They were duly honoured and their faces beamed with pleasure.


Continues....

🌹🌹🌹🌹🌹


24 Apr 2022

No comments:

Post a Comment