🌹🍀 29 - OCTOBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹🌹 29 - OCTOBER అక్టోబరు - 2022 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌹.నాగుల చవితి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Nagula Chaviti to All - నాగుల చవితి విశిష్టత🌹*
ప్రసాద్ భరధ్వాజ
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 277 / Bhagavad-Gita -277 - 6వ అధ్యాయము 44 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 676 / Vishnu Sahasranama Contemplation - 676 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 638 / Sri Siva Maha Purana - 638 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 355 / DAILY WISDOM - 355 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 254 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹29, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*🌻. నాగుల చవితి శుభాకాంక్షలు, Happy Nagula Chavithi 🌻*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగుల చవితి, జ్ఞాన పంచమి, Nagula Chavithi, Jnana Panchami 🌻*
*🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 1 🍀*
*శ్రీ భద్ర | భద్రాంబికాప్రాణనాథా | సురారాతిభంగా | ప్రభో |*
*రుద్ర | రౌద్రావతారా | సునాసీర ముఖ్యామరానేక సంభావితానల్ప*
*సుశ్లోకచారిత్ర | కోట్యర్కసంకాశ దేదీప్యమానప్రభా | దివ్యగాత్రా శివా | పాలితాశేషబ్రహ్మాండభాండోదరా | మేరుధీరా |*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. సర్ప స్తోత్రం 🍀*
*🌼. పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా! సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా ! అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం! 🌼*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చంపుట కెవరు అధికారి? కొందరు కేవలం పచ్చి స్వార్థం కొరకు చంపడం జరుగుతూ వుంటుంది. మానవులు తోటి మానవులను చంపవలసి వచ్చే పక్షంలో చావనేది విశ్రాంతియని తమ ఆత్మలో గుర్తించి, చంపబడే వానిలో, చంపే వానిలో, చంపే క్రియలో ఈశ్వరుని దర్శించ గలిగి వుండడం అవసరం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: శుక్ల చవితి 08:14:39 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ 09:06:24 వరకు
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 22:23:05 వరకు
తదుపరి సుకర్మ
కరణం: విష్టి 08:13:40 వరకు
వర్జ్యం: 16:32:40 - 18:02:00
దుర్ముహూర్తం: 07:45:37 - 08:31:49
రాహు కాలం: 09:06:27 - 10:33:04
గుళిక కాలం: 06:13:14 - 07:39:51
యమ గండం: 13:26:16 - 14:52:53
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 00:53:56 - 02:23:24
మరియు 25:28:40 - 26:58:00
సూర్యోదయం: 06:13:14
సూర్యాస్తమయం: 17:46:05
చంద్రోదయం: 09:59:31
చంద్రాస్తమయం: 21:12:33
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ముసల యోగం - దుఃఖం 09:06:24
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.నాగుల చవితి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Nagula Chaviti to All 🌹*
*🍀🪱.నాగుల చవితి విశిష్టత 🪱🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌿. సర్ప స్తోత్రం 🌿*
*🌼. పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా! సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా ! అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం! 🌼*
*🌻. సర్ప గాయత్రి మంత్రం🌻*
*భుజంగేషాయ విద్మహే, క్షక్షు శివాయ ధీమహి*
*తన్నో సర్ప ప్రచోదయాత్ !*
*🍀🪱.నాగుల చవితి విశిష్టత 🪱🍀*
*దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని,పామును - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.*
*మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.*
*ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారము వలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.*
*నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.*
*🌼. నవ నాగ స్తోత్రం 🌼*
*అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలం*
*శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తథా*
*ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం*
*సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః*
*తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 277 / Bhagavad-Gita - 277 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 44 🌴*
*44. పూర్వభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి స: |*
*జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే*
🌷. తాత్పర్యం :
*పూర్వజన్మపు దివ్యచైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మనియమములకు సదా అతీతుడై యుండును.*
🌷. భాష్యము :
ఉన్నతులైన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల యెడ అంతగా ఆకర్షితులు కాక, ఉన్నతయోగ పూర్ణత్వమైన పూర్ణ కృష్ణభక్తిభావనకు తమను ఉద్దరింపచేసెడి యోగనియమముల వైపునకే అప్రయత్నముగా ఆకర్షితులగుదురు. ఉన్నతమైన యోగులు అట్లు వేదకర్మల యెడ చూపు ఉపేక్షను గూర్చి శ్రీమద్భాగవతము (శ్రీమద్భాగవతము 3.33.7) నందు ఈ విధముగా వివరింపబడినది.
అహో బత శ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్ |
తేపు స్తపస్తే జుహువు: సస్నురార్యా బ్రహ్మానూచుర్నామ గృణన్తి యే తే
“హే ప్రభూ! శునకమాంసమును భుజించు చండాలుర వంశమున జన్మించినను నీ పవిత్రనామములను కీర్తించువారు ఆధ్యాత్మికజీవనమున పురోగతి సాధించునట్టివారే. అట్టి భక్తులు అన్నిరకములైన తపస్సులను, యజ్ఞములను ఆచరించినట్టివారే. అన్ని తీర్థ స్థానములలో స్నానమాడినట్టివారే, సకల శాస్త్రాధ్యయనమును గావించినట్టివారే.”
శ్రీహరిదాసటాకూరును ముఖ్యశిష్యులలో ఒకనిగా స్వీకరించుట ద్వారా శ్రీచైతన్యమాహాప్రభువు ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణమును నెలకొల్పిరి. హరిదాసటాకురు మహ్మదీయవంశమున జన్మించినను శ్రీచైతన్యమహాప్రభువు ఆయనను “నామాచార్యుని” స్థానమనకు ఉద్ధరించిరి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము ద్వారా మూడులక్షల హరినామమును విడువక పట్టుదలతో ఆయన నిత్యము జపించుటయే అందులకు కారణము.
హరినామమును నిరంతరము జపించుటను బట్టి శబ్దబ్రహ్మమని పిలువబడు వేదకర్మవిధానముల నన్నింటిని పూర్వజన్మమందే ఆయన పూర్తిచేసినట్లుగా అవగతమగుచున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవ్వరును కృష్ణభక్తిరసభావనను స్వీకరించుట గాని, శ్రీకృష్ణుని పవిత్రనామమైన హరేకృష్ణ మాహామంత్రం జపకీర్తనములందు నియుక్తులగుట గాని సంభవించును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 277 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 44 🌴*
*44. pūrvābhyāsena tenaiva hriyate hy avaśo ’pi saḥ*
*jijñāsur api yogasya śabda-brahmātivartate*
🌷 Translation :
*By virtue of the divine consciousness of his previous life, he automatically becomes attracted to the yogic principles – even without seeking them. Such an inquisitive transcendentalist stands always above the ritualistic principles of the scriptures.*
🌹 Purport :
Advanced yogīs are not very much attracted to the rituals of the scriptures, but they automatically become attracted to the yoga principles, which can elevate them to complete Kṛṣṇa consciousness, the highest yoga perfection. In the Śrīmad-Bhāgavatam (3.33.7), such disregard of Vedic rituals by the advanced transcendentalists is explained as follows:
aho bata śva-paco ’to garīyān yaj-jihvāgre vartate nāma tubhyam
tepus tapas te juhuvuḥ sasnur āryā brahmānūcur nāma gṛṇanti ye te
“O my Lord! Persons who chant the holy names of Your Lordship are far, far advanced in spiritual life, even if born in families of dog-eaters. Such chanters have undoubtedly performed all kinds of austerities and sacrifices, bathed in all sacred places and finished all scriptural studies.”
The famous example of this was presented by Lord Caitanya, who accepted Ṭhākura Haridāsa as one of His most important disciples. Although Ṭhākura Haridāsa happened to take his birth in a Muslim family, he was elevated to the post of nāmācārya by Lord Caitanya due to his rigidly attended principle of chanting three hundred thousand holy names of the Lord daily: Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. And because he chanted the holy name of the Lord constantly, it is understood that in his previous life he must have passed through all the ritualistic methods of the Vedas, known as śabda-brahma. Unless, therefore, one is purified, one cannot take to the principles of Kṛṣṇa consciousness or become engaged in chanting the holy name of the Lord, Hare Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 676/ Vishnu Sahasranama Contemplation - 676🌹*
*🌻676. మహాయజ్వా, महायज्वा, Mahāyajvā🌻*
*ఓం మహాయజ్వనే నమః | ॐ महायज्वने नमः | OM Mahāyajvane namaḥ*
*మహంశ్చాసౌ హరిర్యజ్వా యజ్ఞాన్ నిర్వర్తయన్ ప్రభుః ।*
*లోకస్య సఙ్గ్రహార్థం స మహాయజ్వేతి కీర్త్యతే ॥*
*ఈతడు గొప్ప యజ్వ అనగా యజ్ఞ నిర్వర్తకుడు లేదా యజమానుడు కావున మహాయజ్వా. లోక సంగ్రహార్థము యజ్ఞములను నిర్వర్తించుచుండు శ్రీ రామ, కృష్ణ అవతార రూపుడగు విష్ణువు మహాయజ్వా.*
*లోకమందలి జనము ఒకానొక ఉత్తమ వ్యక్తి ఆచరించు ఆచరణము నందలి ఉచితత్వమును గ్రహించి అట్లే తామును ఆచరించ దగిన దానినిగా ఆ ఆచరణమును స్వీకరించుటను 'లోక సంగ్రహము' అందురు.*
*బహువ్రీహి సమాస రూపముగ చూచిన - ఎవనిని ఉద్దేశించి యజ్ఞములను ఆచరించు గొప్ప యజమానులుగలరో అట్టివాడు మహాయజ్వా అని కూడా చెప్పదగును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 676🌹*
*🌻676. Mahāyajvā🌻*
*OM Mahāyajvane namaḥ*
महंश्चासौ हरिर्यज्वा यज्ञान् निर्वर्तयन् प्रभुः ।
लोकस्य सङ्ग्रहार्थं स महायज्वेति कीर्त्यते ॥
*Mahaṃścāsau hariryajvā yajñān nirvartayan prabhuḥ,*
*Lokasya saṅgrahārthaṃ sa mahāyajveti kīrtyate.*
*Since He is a great yajvā i.e., the One who performs sacrifices in accordance to vedic rules, Lord Viṣṇu is called Mahāyajvā. Lord Viṣṇu in His incarnations like Śrī Rāma and Krṣṇa performed great Yajñas setting an example and hence He is Mahāyajvā.*
*When a great person performs a good deed, the world follows in his foot steps and this is called loka saṅgraha. To achieve loka saṅgraha i.e., to set a righteous path for the world to follow.*
*The name Mahāyajvā can also be interpreted as the One in whose honor great yajamānas perform vedic sacrifices.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 638 / Sri Siva Maha Purana - 638 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. గణశుని పుట్టుక - 3 🌻*
ఇట్లు జరుగగా ఒకప్పుడు శివపత్నియగు పార్వతీ దేవి మనస్సులో ఆలోచించెను. సర్వోత్కృష్టురాలగు ఆ పరమేశ్వరి మనస్సులో ఇట్లు తలపోసెను (18). సమర్థుడగు నా వ్యక్తి ఒకడు సేవకుడుగా నున్నచో చాల బాగుండును. అట్టి వ్యక్తి నా ఆజ్ఞను ఇసుమంతైననూ జవదాటకుండగా పాలించగలడు (19). ఆ దేవి ఇట్లు విచారించి తన శరీరమునుండి రాలిన నలుగుడు పిండితో లక్షణములన్నింటితో కూడిన పురుషుని నిర్మించెను (20). ఆతని అవయవములలో దోషమేమియూ లేకుండెను. అవయవములన్నయూ సుందరముగా నుండెను. సమర్థుడు, సర్వశోభలతో నిండియున్నవాడు అగు ఆ పురుషుడు మహాబలమును. పరాక్రమమును కలిగియుండెను (21).
ఆమె అపుడు ఆ పురుషునకు అనేక వస్త్రములు, అలంకారములను ఇచ్చి సర్వోత్తమమగు అనేక ఆశీర్వచనములను పలికెను (22). నీవు నా పుత్రుడవు. నీవు తక్క నావాడు మరియొకడిచట లేడు. పార్వతీదేవి ఇట్లు పలుకగా ఆ పురుషుడు నమస్కరించి ఇట్లు పలికెను (23).
గణశుడిట్లు పలికెను -
ఇపుడు నీకు చేయదగిన పనియేమి? నీ మాటను నేను నెరవేర్చెదను. ఆ పురుషుని ఈ మాటను విని పార్వతి తన ఆ పుత్రునికి ఇట్లు బదులిడెను (24).
పార్వతి ఇట్లు పలికెను -
ఓ పుత్రా! నా మాటను వినుము. ఇపుడు నీవు నా ద్వారమును రక్షించుము. నీవు నా పుత్రుడవు గనుక నా వాడవు. నీవు తక్క మరియొకడు నా వాడు లేడు (25). పుత్రా! ఎవ్వరైననూ ఎప్పుడైననూ నా ఆజ్ఞ లేనిదే హఠాత్తుగా నా గృహములోపలికి రారాదు. నేను నీకు సత్యమును చెప్పు చున్నాను (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 638🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴*
*🌻 The birth of Gaṇeśa - 3 🌻*
18. At the time when the incident occurred, Pārvatī, the great Māyā, the great goddess, thought as follows.
19. “There must be a servant of my own who will be expert in his duties. He must not stray from my behest even a speck.”
20. Thinking thus the goddess created a person with all the characteristics, out of the dirt[3] from her body.
21. He was spotless and handsome in every part of his body. He was huge in size and had all brilliance, strength and valour.
22-23. She gave him various clothes and ornaments. She blessed him with benediction and said—“You are my son. You are my own. I have none else to call my own”. Thus addressed the person bowed to her and said:—
Gaṇeśa said:—
24. “What is your order? I shall accomplish what you command.” Thus addressed, Pārvatī replied to her son.
Pārvatī said:—
25. “O dear, listen to my words. Work as my gatekeeper from today. You are my son. You are my own. It is not otherwise. There is none-else who belongs to me.
26. O good son, without my permission, no one, by any means, shall intrude my apartment. I tell you the fact.”
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 355 / DAILY WISDOM - 355 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻20. ప్రాణం యొక్క ఐదు విధులు🌻*
*మనిషిలోని మొత్తం సామర్థ్యానికి, వ్యక్తిత్వం యొక్క శక్తిని కలిపి ప్రాణశక్తి అంటారు. కానీ అది వివిధ విధులను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి అందరికీ న్యాయం జరిగేలా చూసినప్పుడు, అతన్ని న్యాయమూర్తి అంటారు; అతను జిల్లాకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు, అతన్ని కలెక్టర్ అని పిలుస్తారు; అతను రుగ్మతలకు ఔషధం ఇచ్చినప్పుడు, అతన్ని వైద్యుడు అని పిలుస్తారు మొదలైనవి. ఒకే వ్యక్తిని అతను చేసే విధులను బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ప్రాణశక్తి కూడా అలా ఐదు విధులను నిర్వర్తిస్తుంది. ఒకరు ఊపిరి బయటకు వదిలినపుడు నిశ్వాసము రూపంలో ప్రాణం పనిచేస్తోంది. ప్రాణం అనే పదం ద్వంద్వ అర్థంలో ఉపయోగించబడింది. ఇది నిశ్వాసను సూచిస్తుంది మరియు వ్యవస్థ యొక్క మొత్తం శక్తిని కూడా సూచిస్తుంది. కాబట్టి, ప్రాణం అంటే రెండు విషయాలు - నిశ్వాసలో శ్వాసను బయటకు పంపే శక్తి మరియు మొత్తం శక్తి కూడా.*
*శ్వాస పీల్చుకునే ఉచ్ఛ్వాస శక్తిని అపానశక్తి అంటారు. ప్రతి ధమని, సిర మరియు శరీరంలోని ప్రతి భాగం ద్వారా రక్తాన్ని సమానంగా ప్రసరించే శక్తిని వ్యానశక్తి అంటారు. శరీరంలోని ఏదైనా భాగాన్ని తాకినట్లయితే, ప్రతి ఇతర భాగంలో కూడా ఆ అనుభూతి చెందే విధంగా శరీరం ఇతర భాగాలకు అనుసంధానించ బడిందని తెలుసు. వ్యక్తిత్వం లోని ఒక ఏకత్వం కారణంగా వచ్చే ఈ అనుభూతికి శరీరమంతా వ్యాపించి ఉండే వ్యాన శక్తే కారణం. ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని సమాన శక్తి అంటారు. ఆహారాన్ని మింగాటానికి కారణమయ్యే మరొక శక్తి ఉంది. నోటిలోకి ఆహారాన్ని ఉంచినప్పుడు, అది ఆహారాన్ని మింగే గొంతు భాగం ద్వారా అన్నవాహికలోకి లోపలికి నెడుతుంది. ఇక్కడ ప్రాణశక్తి పనిచేస్తుంది. శరీరాన్ని నిలబెట్టి, నిటారుగా నిలబెట్టి, పడిపోకుండా చేసే శక్తిని ఉదానము అంటారు. నిద్రావస్థలో విశ్రాంతి దీని పనే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 355 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻20. The Five Functions of Prana🌻*
*The prana is a common name that is applied to the total capacity in man, the energy of the personality, but it performs different functions. When a man does the work of dispensing justice, he is called a judge; when he is a chief executive of a district, he is called a collector; when he dispenses medicine, he is called a physician, and so on. The same person is known by different names on account of the functions he performs. So is this prana, which performs five functions. When one breathes out there is exhalation, and prana is operating. Prana is a term that is used in a double sense. It indicates the exhaling force, and also the total energy of the system. So, prana means two things—the force that expels the breath out in exhalation, and also the total energy.*
*The force by which one breathes in is called apana. The force that circulates the blood through every artery, vein and every part of the body equally, is vyana. It is known that the body is connected to other parts in such a harmonious manner that if any part of the body is touched, the sensation is felt in every other part also. This sensation that is felt in every part, as a wholeness of one's personality, is due to the vyana operating, a particular aspect of the function of the energy which moves throughout the body equally. The energy that digests the food is called samana. There is another force which causes the deglutition of food. When food is put into the mouth, it is pushed inside to the oesophagus, through the part of the throat by which food is swallowed. Prana energy operates here. Udana is the power that keeps the body upright without fall. Its function is sleep.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 254 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. అస్తిత్వాన్ని సమీపించడానికి ప్రాథమిక విధానమేమిటంటే ప్రతి మనిషి తన చైతన్యాన్ని పూల చెట్టులా ఎదిగేలా చేయాలి. మన సమస్త జీవితాన్ని పండుగగా మార్చాలి.🍀*
*మనం అస్తిత్వానికి ఏమీ యివ్వలేం. మనం ఆడవచ్చు. పాడవచ్చు. అద్భుత సంగీత వాద్యాన్ని ఆలపించవచ్చు. మన సమస్త జీవితాన్ని పాటగా మార్చవచ్చు. పండుగగా మార్చవచ్చు. అస్తిత్వానికి మనమివ్వగలిగిన నిజమైనది అదే. చెట్లనించీ పూలు తెంపి యివ్వడం బుద్ధిమాలిన పని. కారణం పూలు చెట్లవి. నీవి కావు. అవి అప్పటికే చెట్టు అస్తిత్వానికి అర్పించినవి. అవి చెట్లపై సజీవంగా వుంటే నువ్వు తెంపి చంపావు. నువ్వు వాటి అందాన్ని నాశనం చేశావు. నువ్వు అస్తిత్వానికి శవాల్ని అర్పిస్తున్నావు. నువ్వు ఏ మహాత్ముని మాటల్ని దేవుడికి అర్పించలేవు. అవి ఆయన మాటలు, ఆయన పాటలు. అవి అందమైనవి.*
*కానీ నువ్వు వాటిని అరువు తెచ్చుకున్నావు. అవి నీ హృదయం నించీ వచ్చినవి కావు. వాటిల్లో నీ హృదయం స్పందన లేదు. వాటిల్లో నీ చేవ్రాలు లేవు. బుద్ధుని, కృష్ణుని మాటలైనా, పాటలయినా అవన్నీ అరువు తెచ్చుకున్నవే. అస్తిత్వాన్ని సమీపించడానికి ప్రాథమిక విధానమేమిటంటే ప్రతి మనిషి తన చైతన్యాన్ని పూల చెట్టులా ఎదిగేలా చేయాలి. మనిషిలో పూలు ప్రేమ పూలు, స్వాతంత్య్ర సుమాలు, ఆనంద సుమాలు. వాటిని నేను పాటలంటాను. నువ్వు నీ సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేమని అస్తిత్వానికి సమర్పిస్తే వందరెట్లుగా అవి నీ మీద వర్షించడం చూసి ఆశ్చర్యపోతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹