శ్రీ మదగ్ని మహాపురాణము - 121 / Agni Maha Purana - 121
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 121 / Agni Maha Purana - 121 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 38
🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 4🌻
భక్తిమంతు డగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతా ప్రతిష్ఠ చేసినా డనగా, అతడు చరాచరరూపములగు ముల్లోకములగు ముల్లోకములను భవనమునిర్మించినాడని యర్థము భూతవర్తమాన భవిష్యత్కాలములకు చెందిన, స్థూల-సూక్ష్మరూపము.
తద్భిన్నము అయిన బ్రహ్మాదిస్తంబాంత మగు ప్రపంచ మంతయు మహావిష్ణువునుండియే జనించినది. దేవాధిదేవుడును, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ-బ్రహ్మ-సూర్య-గణశ-దుర్గా-లక్ష్మాదిదేవతలకు ఆలయమును నిర్మింపచేసి వారికి ఆలయ నిర్మాణము చేయించిన వారి కంటె గూడ అధికఫలము లబించును.
దేవతాప్రతిమా స్థాపనరూప మగు యజ్ఞమువలన లభించు ఫలము అనంతము, మట్టితో చేసిన ప్రతిమకంటె కఱ్ఱతో చేసిన ప్రతిమ ఉత్తమ మైనది. దానికంటె ఇటుకలతో నిర్మించినది, దానికంటె ఱాయితో నిర్మించినది, దానికంటె సువర్ణాదిలోహముంతో నిర్మించినది శ్రేష్ఠమైనది, దేవాలయ ప్రారంభము చేసినంతమాత్రముననే ఏడు జన్మల పాపము నశించును.
నిర్మించువాడు స్వర్గలోకప్రాప్తికి అధికారి యగును. అతడు నరకమునకు వెళ్ళడు. అంతే కాదు-ఆతడు తన వంశములోని నూరు తరములవారిని విష్ణులోకమునకు పంపును యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 121 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 38
🌻 Benefits of constructing temples - 4 🌻
26-31. One may give to the foremost brahmins and also do (such acts) which would glorify him. More than the charities and more than the acts which would glorify him, one has to build the temples of Viṣṇu and other gods. The temple of Hari being set up by devoted great men, the three worlds, the movable and immovable things and the entire objects get established.
All the things beginning with Brahmā to the Pillar, that has already born, that is being born, that is to be born, the gross, the minute and the other things are born of Viṣṇu. Having set up an abode for that lord of lords, the omnipresent, the great Viṣṇu, one is not born again in this world. By building temples for the celestials, Śiva, Brahmā, Sun, Vighneśa (lord of impediments), Caṇḍī (Pārvatī), Lakṣmī and others (a man) reaps the same benefit as he would get for building an abode for Viṣṇu. Greater merit (is acquired) by installing images of gods.
32. In the rites (relating to) installation of an idol there is no limit for the fruits (gained). An image made of wood gives greater merit than that made of clay. One made of bricks yields greater merit than that made of wood.
33. One made of stones gives (greater merit) than that made -of bricks. (Images made) of gold and other metals yield more benefits. Sins committed in seven births get destroyed even at the very commencement of installation.
34. One who builds a temple goes to heaven and never goes to hell. Having elevated a hundred of his ancestors he conveys them to the world of Viṣṇu.
35. Yama (god of death) said to his emissaries:
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment