సంతోషం, దుఃఖం స్మృతిగా తప్ప సత్యంగా లేవు! Happiness and sadness are not true except as memories!


🌹. సంతోషం, దుఃఖం స్మృతిగా తప్ప సత్యంగా లేవు! 🌹


క్రిడా ప్రాంగణంలో ప్రతి ఆటగాడు ఆడే ఆట విడిగా కనిపించినా అది సామూహిక ఆటలో భాగమే అవుతుంది. మన జీవనంలో ఎదురయ్యే దృశ్యాలు, వచ్చే ఆలోచనలు, జరిగే క్రియలు, ఏర్పడే అనుభవాలు అన్నీ అలాంటివే. అన్నీ విశ్వ కార్యంలో అంతర్భాగమే. అన్నీ అలాంటివే. అనుభవం తెలుసుకున్న తర్వాతనే అనుభవపరుడు తయారౌతున్నాడు. అనుభవ పరుడు లేకపోతే అనుభవం లేదు.

జీవన కర్మలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుసరించకుండా మనకిష్టమైనవి ఎంచుకునే స్వతంత్రత మనని నీటిలో బుడగను చేసి నిలబెడుతుంది. సంతోషం, దుఃఖం స్మృతిగా తప్ప సత్యంగా లేవు. ఇది అర్థమైతే ఆనందమే సత్యమన్న విషయం అనుభవంలోకి వస్తుంది. ఆలోచన, స్థూలకార్యం కలిస్తే అది అనుభవం అవుతుంది. స్మృతిలేనప్పుడు కోరిక ఉండదు. ఆ స్థితిలో ఆనందమే ఉంటుంది. అదే జ్ఞానంగా ఆవిర్భవిస్తుంది.”

No comments:

Post a Comment