🌹 24 - OCTOBER అక్టోబరు - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🧨. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు మిత్రులందరకి, Happy Naraka Chaturdasi and Deepavali to All. 🧨*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 275 / Bhagavad-Gita -275 - 6వ అధ్యాయము 42 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 674 / Vishnu Sahasranama Contemplation - 674 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 353 / DAILY WISDOM - 353 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 252 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹24, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు మిత్రులందరకి, Happy Naraka Chaturdasi and Deepavali to All. 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్దశి , దీపావళి, లక్ష్మీ పూజ, యమ దీపం, Naraka Chaturdasi, Deepavali, Lakshmi Puja, Yama deepam 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 4 🍀*
*7. సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః |*
*సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః*
*8. చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |*
*అత్రిరత్ర్యానమస్కర్తా మృగబాణార్పణోఽనఘః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శరీర సంబంధమైన, హృదయ సంబంధమైన దుఃఖాలు —తమ పగిలి పోయిన బొమ్మలు వగైరాల కొరకు పిల్ల లేడ్చే ఏడ్పుల వంటివి. వాటికి నీలో నీవు నవ్వుకో. కాని, ఏడ్చేపిల్లల నోదార్చు. చేతనైతే వారి ఆటలో కూడా పాల్గొను. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 17:28:09 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: హస్త 14:42:01 వరకు
తదుపరి చిత్ర
యోగం: వైధృతి 14:29:23 వరకు
తదుపరి వషకుంభ
కరణం: శకుని 17:23:09 వరకు
వర్జ్యం: 22:33:40 - 24:08:00
దుర్ముహూర్తం: 12:23:24 - 13:09:52
మరియు 14:42:51 - 15:29:20
రాహు కాలం: 07:38:41 - 09:05:50
గుళిక కాలం: 13:27:18 - 14:54:28
యమ గండం: 10:33:00 - 12:00:09
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 08:40:30 - 10:16:54
సూర్యోదయం: 06:11:31
సూర్యాస్తమయం: 17:48:47
చంద్రోదయం: 04:58:43
చంద్రాస్తమయం: 17:10:24
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 14:42:01
వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🧨. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు మిత్రులందరకి, Happy Naraka Chaturdasi and Deepavali to All. 🧨*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 275 / Bhagavad-Gita - 275 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 42 🌴*
*42. అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |*
*ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||*
🌷. తాత్పర్యం :
*లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును.*
🌷. భాష్యము :
జీవితారంభము నుండియే శిశువునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అతిఘనముగా ఇచ్చట కీర్తించబడినది. ఇట్టిది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాములు వంశమునందు ప్రత్యేకమైనదియై యున్నది. అట్టి వంశములవారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను, భక్తులును అయియుందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మికాచార్యులు కాగలరు. భారతదేశమునందు అట్టి ఆచార్యుల వంశములు పెక్కుయున్నను విద్య మరియు శిక్షణ లోపించియున్నందున అవి ప్రస్తుతము పతనము నొందియున్నవి.
అయినను భగవత్కరుణచే అట్టి వంశములు కొన్ని ఇంకను తరతరములుగా భక్తులను వృద్ధిచేయుచున్నవి. అటువంటి వంశములందు జన్మించుట యనునది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకరవిషయము. భగవత్కృప చేతనే నా ఆధ్యాత్మిక గురువైన ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించుటకు అవకాశమును పొందితిమి. ఆ విధముగా జీవితారంభము నుండియు మేము శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగు భగవత్సంకల్పముచే ఒకరినొకరు కలిసికొంటివి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 275 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 42 🌴*
*42. atha vā yoginām eva kule bhavati dhīmatām*
*etad dhi durlabha-taraṁ loke janma yad īdṛśam*
🌷 Translation :
*Or [if unsuccessful after long practice of yoga] he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world.*
🌹 Purport :
Birth in a family of yogīs or transcendentalists – those with great wisdom – is praised herein because the child born in such a family receives a spiritual impetus from the very beginning of his life. It is especially the case in the ācārya or gosvāmī families. Such families are very learned and devoted by tradition and training, and thus they become spiritual masters. In India there are many such ācārya families, but they have now degenerated due to insufficient education and training.
By the grace of the Lord, there are still families that foster transcendentalists generation after generation. It is certainly very fortunate to take birth in such families. Fortunately, both our spiritual master, Oṁ Viṣṇupāda Śrī Śrīmad Bhaktisiddhānta Sarasvatī Gosvāmī Mahārāja, and our humble self had the opportunity to take birth in such families, by the grace of the Lord, and both of us were trained in the devotional service of the Lord from the very beginning of our lives. Later on we met by the order of the transcendental system.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 674 / Vishnu Sahasranama Contemplation - 674🌹*
*🌻674. మహోరగః, महोरगः, Mahoragaḥ🌻*
*ఓం మహోరగాయ నమః | ॐ महोरगाय नमः | OM Mahoragāya namaḥ*
*మహాంశ్చాసావురగశ్చ విష్ణురుక్తో మహోరగః ।*
*సర్పాణామస్మి వాసుకిరితి గీతా సమీరణాత్ ॥*
*ఈతడు గొప్పదియగు ఉరగము అనగా సర్పము గనుక మహోరగః. వాసుకి అను సర్పముగూడ ఆ విష్ణుదేవుని విభూతియే.*
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥
*నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడియావులలో కామధేనువును, ధర్మబద్ధమైన ప్రజోత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 674🌹*
*🌻674. Mahoragaḥ🌻*
*OM Mahoragāya namaḥ*
महांश्चासावुरगश्च विष्णुरुक्तो महोरगः ।
सर्पाणामस्मि वासुकिरिति गीता समीरणात् ॥
*Mahāṃścāsāvuragaśca viṣṇurukto mahoragaḥ,*
*Sarpāṇāmasmi vāsukiriti gītā samīraṇāt.*
*Since He is the great Uraga i.e., serpent, Lord Viṣṇu is known is Mahoragaḥ. The great serpent Vāsuki, that adorns the neck of Lord Śiva, is verily His effulgence only.*
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 12
Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmadhuk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28.
*Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa - the progenitor and among serpents I am Vāsuki.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. గణశుని పుట్టుక - 1 🌻*
సూతుడిట్లు పలికెను -
తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత, ఉత్తమ వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై బ్రహ్మాను ప్రేమతో ఇట్లు ప్రశ్నించెను (1).
నారదుడిట్లు పలికెను -
దేవదేవా! ప్రజానాతా! నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము కంటె గొప్పది, పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని (2). ఇపుడు గణేశుని ఉత్తమ చరిత్రను, దివ్యము మంగలములలోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ వృత్తాంతమును వినగోరు చున్నాను (3).
సూతుడిట్లు పలికెను -
మహాముని యగు ఆ నారదుని ఈ మాటను విని బ్రహ్మ ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (4).
బ్రహ్మ ఇట్లు పలికెను -
గణశుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా చెప్పయుంటిని. గణశుడు పుట్టుట, శని చూచుటచే ఆతని శిరస్సు భగ్నమగుట, ఏనుగు తలను అతికించుట అను గాథను చెప్పితిని. ఆ గాథ మరియొక కల్పమునకు సంబంధించినది (5). ఇపుడు శ్వేత వరాహకల్పమునకు సంబంధించిన గణశుని పుట్టుక చెప్పబడు చున్నది. ఈ గాథలో దయాళువు అగు శివుడు ఆతని శిరస్సును నరుకును (6).
ఓ మునీ! ఈ విషయములో నీవు సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలలను చేయును ఆ శంభుడు సర్వేశ్వరుడు. నిర్గుణుడే అయిననూ సగుణుడు కూడా (7). ఓ మహర్షీ! ఆయన లీలచేతనే జగత్తు సృజించబడి, పాలించబడి, సంహరింపబడు చున్నది. ప్రస్తుత గాథాను శ్రద్ధగా వినుము (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 636🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴*
*🌻 The birth of Gaṇeśa - 1 🌻*
Sūta said:—
1. On hearing the marvellously excellent story of the slayer of Tāraka thus, Nārada was highly delighted and he lovingly asked Brahmā.
2. O lord of gods and people, O storehouse of Śiva’s cult, the excellent story of Kārttikeya, far better than nectar, has been heard by me.
3. Now I wish to hear the excellent story of Gaṇeśa, the details of his divine nativity, auspicious of the auspicious.
Sūta said:—
4. On hearing the words of Nārada the great sage, Brahmā became delighted and replied to him remembering Śiva.
Brahmā said:—
5. Due to the difference of Kalpas, the story of the birth of Gaṇeśa is told in different ways. According to one account he is born of the great lord. His head looked at by Śani[1] was cut off and an elephant’s head was put on him.
6. Now we narrate the story of the birth of Gaṇeśa in Śvetakalpa[2] when his head was cut off by the merciful Śiva.
7. No suspicion need be entertained, O sage. Śiva is certainly the cause of enjoyment and protection. He is the lord of all. Śiva is possessed as well as devoid of attributes.
8. It is by His divine sport that the entire universe is created, sustained and annihilated. O excellent sage, listen to what is relevant to the context, with attention.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 353 / DAILY WISDOM - 353 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻18. పదార్ధం జీవితంతో సమానం అన్నది నిజం కాదు🌻*
*ప్రాణం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? జీవం అనేది స్థూలపదార్థంతో ముడిపడి లేనిది అని జీవశాస్త్రం చెప్తుంది. జీవం సైతం పదార్థం లో ఒక భాగమని నిపుణులు అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ ఆ విషయం అర్ధం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాలేదు. ఎవరైనా ఇటుక లోనూ, దేహం లోనూ ఉండే జీవం ఒకటే అంటే, ఆ దేహం లేకపోయినా జీవం మనుగడ సాగుతుంది అంటే ఎలా నమ్ముతారు? మనిషి ఆ దేహం యొక్క స్పృహ లేకుండా కూడా జీవించగలడు. దేహము ప్రాణముతో సమానమైతే, దేహము నుండి విడిపోయినప్పుడు జీవము నశించి పోయేది. కానీ మనిషి కలలలోను, నిద్రలోను, లోతైన ఏకాగ్రత సమయాల్లో సైతం దేహ స్పృహ లేకున్నా సరే జీవించే ఉన్నాడు.*
*శరీరం తన స్పృహకు సంబంధించిన వస్తువు కానటువంటి పరిస్థితుల్లో, పదార్థమే జీవం అన్నది నిజమైతే, మనిషి ఒక్కసారిగా చచ్చిపోతాడు. పదార్ధం అంటే ప్రాణం అన్నది నిజం కాదు. అవి రెండు వేర్వేరు విషయాలు. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం. జీవితం అంటే ఏమిటో ఎవరూ ఒక నిర్ధారణకు రాలేదు. ఈ జీవం యొక్క శక్తినే ప్రాణశక్తి అంటారు. ఈ ప్రాణ శక్తే, జీవం యొక్క శక్తి. ఈ ప్రణ శక్తినే తేజస్సు అని, జీవశక్తి అని అంటారు. ఇదే మనిషిలో ఉండే స్థూల, సూక్ష్మ మరియు తేజో శక్తులు. కొన్నిసార్లు ప్రాణం శ్వాసతో గుర్తించబడుతుంది. కానీ అది శ్వాస కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 353 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻18. It is not True that Matter is the Same as Life🌻*
*What is meant by prana? What is life? The biologists tell us that there is a thing called life which is incapable of identification with matter. Though, many times, mechanistic materialists have held the opinion that life is not different from matter, it has become very difficult to accept this doctrine. How can anyone say that life is the same as brick, or a body with which one is lumbering, and without which also one can exist? It is seen that man can exist even without being conscious of the body. If the body were the same as life, life would be extinct when it is dissociated from the body. But man is alive even in dream, sleep, and states of deep concentration. In deep meditation one is not aware of the body.*
*Man would be dead at one stroke, if it were true that matter is life, in conditions when the body is not an object of his consciousness. It is not true that matter is the same as life. They are two different things. But it is difficult to understand what the relationship is between these two. No one has ever come to a final conclusion as to what life means. It is this life-force that is called prana-sakti. There is the prana-sakti, the power of the prana. Prana is vitality, living force, organic energy. It is a living, protoplasmic, organismic, and energising vitality in man. Sometimes prana is identified with breath. But it is interior even to breath.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 252 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. 🍀*
*జీవితంలో ఆనందంగా వుండడమన్నది దేవుణ్ణి సమీపించడం లాంటిది. నీ మార్గంలో నాట్యం చేస్తూ దేవుణ్ణి చేరు. నీ మార్గంలో నవ్వుతూ, నీ మార్గంలో పాడుతూ దేవుణ్ణి చేరు. గంభీరంగా ముఖం వేళ్ళాడేసుకునే సన్యాసులతో దేవుడు అలసిపోయాడు. వందల ఏళ్ళ నించీ బుద్ధిహీనులుగా వున్నారు. వాళ్ళ చిత్రాలు కూడా నా గదిలో పెట్టను. వాటితో దేవుడికి పిచ్చెక్కుతుంది.*
*నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. దానికి జీవితం మినహా మరో వుదాహరణ లేదు. దాన్ని బట్టి దేవుడు గంభీరుడు కాదని రుజువవుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment