శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 410. 'శివపరా'- 1 🌻


శివుని కంటే పరమైనది శ్రీదేవి అని అర్ధము. లేక శివుడు పరుడుగా కలది, లేక భక్తులను శివపరము చేయునది, లేక సతతము శివుని గూర్చి బోధించునది అని అర్థము. శివునికి ఆమె పరము, ఆమెకు శివుడు పరము. దీనిని తెలియ వలెను. వారు ఒకే తత్త్వము నుండి దిగివచ్చిన వారు గనుక ఇరువురిలో ఎవ్వరునూ అధికము కాదు అని తెలిపెడి నామమిది. ఆమెను పూజించిన అతని కడకు చేర్చును. అతనిని పూజించిన ఆమె కడకు చేర్చును. అనగా ఎవరిని పూజించిననూ చేర్చునది పరమునకే. వారిరువురునూ ఒకరిని గూర్చి ఒకరు బోధింతురు. ఇది అభేద స్థితికి చిహ్నము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 410. 'Shivapara'- 1 🌻


It means that Sridevi is superior to Shiva. Or it means that the one who has Shiva as Her consort. Or the One who hands over the devotees to Lord Shiva. Or the One who relentlessly teaches about Lord Shiva. She is the One other than Shiva and Shiva is the one other than Her. This needs to be known. It is a name that tells us that neither of them is superior because they come from the same philosophy. Those who worship Her shall be taken to Him by Her. Those who worship Him shall be taken to Her by Him. Meaning irrespective of whom one worships, they shall reach them. They both teach about each other. It is a symbol of state of Oneness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment