నిర్మల ధ్యానాలు - ఓషో - 270


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 270 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. తెలియని దాన్ని ఆహ్వానించు. దాని గుండానే ఎదుగుతావు. పరిణితికి వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి అతుక్కోకు. చైతన్యముంటే ప్రేమ, ఆనందం దైవత్వం, సత్యం, స్వేచ్ఛ వస్తాయి.🍀


పాతదాన్ని నువ్వు ఎన్నుకుంటే బాధను ఎన్నుకుంటావు. కొత్తదాన్ని ఎన్నుకుంటే ఆనందంలో వుంటావు. అదే తాళం చెవిగా భావించు. తెలియని దాన్ని, ప్రమాదాన్ని ఆహ్వానించు. దాని గుండానే ఎదుగుతావు. పరిణితికి వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి అతుక్కోకు. పాతదేదయినా వదిలిపెట్టు. పని పూర్తయ్యాకా ముగింపు పలుకు. వెనక్కి చూడకు. ముందుకే వెళ్ళాలి.

ఎవరూ అడుగుపెట్టని శిఖరాన్ని అధిరోహించడం ప్రమాదమే. ఎందుకంటే ఆ దారిలో ఎవరూ అప్పటిదాకా వెళ్ళలేదు. అక్కడ ప్రమాదాలున్నాయి. ప్రమాదం, ఆటంకం, అభద్రత నిన్ను చైతన్యంగా వుంచుతాయి. చైతన్యముంటే అన్నీ వుంటాయి. అన్నీ వస్తాయి. ప్రేమ, ఆనందం దైవత్వం సత్యం స్వేచ్ఛ వస్తాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment