శ్రీ శివ మహా పురాణము - 654 / Sri Siva Maha Purana - 654

🌹 . శ్రీ శివ మహా పురాణము - 654 / Sri Siva Maha Purana - 654 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴

🌻. గణేశ శిరశ్ఛేదము - 2 🌻


వీనిని మోసముతో మాత్రమే సంహరింప వచ్చును. మరియొక విధముగా వీనిని సంహరించుట సంభవము కాదు. శివుడు ఈ విధముగా నిశ్చయించుకొని సైన్యమధ్యములో నిలబడెను (8). నిర్గుణుడే యైననూ సగుణడై రూపమును స్వీకరించి యున్న శివదేవుడు, మరియు విష్ణువు కూడ యుద్ధములోనికి రాగానే, సర్వదేవతలు (9) మరియు మహేశుని గణములు కూడ గొప్ప హర్షమును పొందిరి. వారందరు ఒకరితో నొకరు కలుసుకొని ఉత్సవమును చేసిరి(10). అపుడు శక్తి పుత్రుడు, వీరుడు అగు గణేశుడు వీరగతిని ప్రదర్శించి మున్ముందుగా సుఖములన్నింటికీ విష్ణువును తన కర్రతో పూజించెను (11).

ఓ విభూ! నేనీతనిని మోహింప జేసిన సమయములో నీవాతనిని వధించుము. ఈ తపశ్శాలిని సమీపంచుట సంభవము కాదు. ఈతనిని మోసము లేకుండగా వధింప జాలము (12). ఇట్లు నిశ్చయించి శంభునితో సంప్రదించి ఆయన అనుమతిని పొంది విష్ణువు గణేశుని మోహింపజేయు ప్రయత్నములో లీనమయ్యెను (13). ఓ మహర్షీ! ఆ విధముగా మోహింప జేయుటలో నిమగ్నమై యున్న విష్ణువును గాంచి శక్తి మాత లిద్దరు తమ శక్తి బలమును ఆ గణేశునకు ఇచ్చిరి (14). ఆ శక్తి మాతలిద్దరు అంతర్ధానము కాగానే ఇనుమడించిన బలము గల గణేశుడు విష్ణువు స్వయముగా నిలబడి యున్న స్థలమునకు పరిఘను విసిరి వేసెను (15).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 654🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴

🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 2 🌻


8. Thinking within himself “He has to be killed only by deception and not otherwise” he stayed in the midst of the army.

9-10. When lord Śiva who though devoid of attributes had assumed the attributive form was seen in the battle, when Viṣṇu too had come thither, the gods and Gaṇas of Śiva were highly delighted. They joined together and became jubilant.

11. Then Gaṇeśa the heroic son of Śakti following the course of heroes, at first worshipped (i.e struck) Viṣṇu with his staff, Viṣṇu who confers happiness to all.

12-13. “I shall cause him delusion. Then let him be killed by you, O lord. Without deception he cannot be killed. He is of Tāmasika nature and inaccessible.” Thinking thus and consulting Śiva, Viṣṇu secured Śiva’s permission and was engaged in the activities of delusion.

14. O sage, on seeing Viṣṇu in that manner, the two Śaktis handed over their power to Gaṇeśa and became submerged.

15. When the two Śaktis became submerged, Gaṇeśa with more strength infused in him hurled the iron club in the place where Viṣṇu stood.


Continues....

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment