సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 15

See the source image
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 15 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. తపస్సు 🍃

78. తపస్సు మనస్సుకు సంబంధించినది. మనస్సుతో చేయు సాధనయె తపస్సు దీని లక్షణములు:

1. మనస్సును ధ్యాన విషయమునందు లగ్నం చేయుట.
2. మనస్సు శుద్ధి కలిగి నిశ్చలంగా ఉండుట.
3. శారీరక, పరిసరముల పరిశుద్ధత.
4. కామ, క్రోధాదులు లేకుండుట.
5. సంకల్పరహితముగా ఉండుట.
6. మనోనిగ్రహము.

79. తపస్వులు ఆహారమును వర్జించి సాధన చేయగల శక్తి కల్గి ఉండవలెను. ఎపుడైతే సాధకుడు పైన తెల్పిన తపస్వి లక్షణములు కల్గి సాధన చేయునో, అప్పుడు అతనికి ఆహార ఆవశ్యకత లేక మానసిక శక్తితో తపస్సులో నిమగ్నమవగలడు. వారికి శ్వాస ద్వారానే విశ్వము నుండి శక్తి లభించును. శరీరము మనస్సు నిశ్చలమైనప్పుడు శక్తిని పొందే ఆవశ్యకత ఉండదు.

మామూలుగా శక్తి ఆహారం ద్వారా లభించును. కానీ తపస్సులకు అవసరమైన శక్తి కేవలం శ్వాస ద్వారానే లభించగలదు.

త్రివిధ తపస్సులు: 
1. ఆత్మానాత్మ వివేకముచే మనస్సును ప్రత్యగాత్మ యందు విలీనము చేయుట జ్ఞాన తపస్సు. ఇది ఉత్తమ తపస్సు.
2. ధ్యానధారణాదులచే మనస్సు నిలువరించి, సమాధిలోనుంచుట మధ్యమ తపస్సు.
3. కృచ్ఛంద్రాయణాదుల చేతను, ఉపవాసములచేతను, దేహేంద్రియములను కృశింపజేయుట కనిష్ఠ తపస్సు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment