భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 107


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 107  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 9 🌻

51. అంతర్యామిగా అమృతుడుగా, ఆత్మసాక్షిగా ఉండేదే పరమపురుషుడు. అవిద్యచే ఆవరించ్బడి అతడే జివుడౌతున్నాడు. అంటే ఇక్కడ సందేహంగానే ఉంది అందరికీ! పరమాత్మవస్తువు జీవుడైనాడా!

52. పరమాత్మ పరమాత్మ వస్తువుగా (వెనుక) లోపల ఉండగానే, జీవుడు వేరే ఉన్నాడా! ఆ విశిష్టాద్వైతానికి, వైష్ణవానికి, కొంతవరకు శైవానికి మూలాధారమైనటువంటి ఆధారమ్హూమికను “ద్వా సుపర్ణా…” మంత్రం కల్పిస్తుంది.

53. చెట్టుపై రెండు పక్షులున్నాయి. ఒక పక్షి సాక్షిగా ఉంది, మరొక పక్షేమో ఫల తింతున్నది అని చెప్పిన ఉననిషత్ మంత్రం, రెండూ(అంటే జివాత్మ, పరమాత్మ) ఉన్నాయని ప్రతిపాదిస్తోంది. ఇవి రెండులేవని, ఒకటి వస్తువు, మరొకటి దాని చాయ అని మరికొందరు అంటున్నారు.

54. ఒక విషయంమాత్రం మనందరికీ తెలుసు. “నేను ఒక్కడినే ఉన్నాను. నాకు దుఃఖం ఉన్నది” అన్నది. ఆ విషయం మనకు తెలుసు. పరమాత్మ లోపల ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అది వేరే విషయం.

55. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అంతర్యామిగా కానీ, బహిర్యామిగా కాని, సర్వాంతర్యామిగా కాని, సర్వమయుడుగా కాని ఎలా ఉన్నప్పటికీ కూడా; అతడు విష్ణువో, శివుడో, ఎవరో ఒక పరమాత్ముడిగానే ఉన్నాడు అక్కడ. నాకు దుఃఖం ఉంది, రక్షకుడైన విష్ణువో, శివుడో రక్షిస్తాడు అని ఆశించి ప్రార్థన చెయ్యాలి.

56. ఈ విషయంలో ఏ శాస్త్రానికీకూడా సందేహంలేదు. లోపలే ఉన్నాడా? ఇవతలే ఉన్నాడా? ఈ జీవుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఇట్లాంటి ప్రశ్నలకు భక్తుడివద్ద తావు లేదు.

57. వేదాంతి అంతా ఒక్కటే అంటాడు, ఈ జగత్తంతా ఒక్కటే అంటాడు. సర్వం ప్రహ్మమయం, బ్రహ్మ ఒకటే వస్తువు అంటాడు, ఇదేమో మిథ్య అంటాడు ఒకడు. ఇదంతా సత్యము అంటాడు యజ్ఞయాగాదిక్రతువులు చేసేవాడు. ఈ జగత్తు నిజంగా ఉందికాని ఈశ్వరుడు లేడంటాడు పూర్వ మీమాసకుడు.

58. ఎందుచేతనంటే యజ్ఞం అవిద్యలోంచి పుట్టింది. అవిద్యా మూలకమైనటు వంటి లక్షణములు, ఆ ప్రసాదములనే ఇస్తుంది, అంతకంటే మించి అది ఇంక ఏమీ ఇవ్వదు ఇట్లాంటి మాటలన్నీకూడా పూర్వమీమాస చెపుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

10.Sep.2020

No comments:

Post a Comment