శివగీత - 58 / 🆃🅷🅴 🆂🅸🆅🅰 - 🅶🅸🆃🅰 - 58



🌹.   శివగీత - 58 / The Siva-Gita - 58  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము -4 🌻

నపుంసకే చ తే మిశ్రా - భవంతి రఘునందన!
మాతృజం చాస్య హృదయం - విషయా నాభి కాంఓతి 21

తతో మాతుర్మనో భీష్టం - కుర్యా ద్గ ర్భ నివృద్ధయే
తాం చ ద్విహృదయాం - నారీ మాహు ర్దౌ హృది నీ తతః 22

అదానా ద్దో మదానాం స్యు - ర్గ ర్భ స్య వ్యంగ తాదయః
మాతుర్య ద్వి షయే లోభ - స్త దార్తో జాయతే సుతః 23

ప్రబుద్ధం పంచమే చిత్తం - మాంస శోణిత పుష్టతా
షష్టే స్థి స్నాయు నఖర - కేశలో మవివిక్త తా 24

నపుంసకునిలో మిశ్రమ గుణములుండును. ఓ రామా! తల్లి మనస్సునుండే మనస్సు కలుగును. కనుక తల్లి కోరికలనే కోరుచుండును. అందుచేత మాత్రుగర్భాభి వృద్ధికి మాత్రు అభిలాషితములను ( ఆకాంక్షలను) తప్పకుండా నెరవేర్చవలయును.

తల్లి ఆ సందర్భమున రెండు హృదయములు కలదగును. కావున ఆమెకు దౌహృదిని యను పేరు వచ్చినది. గర్భిణీ యువతి యొక్క కోరికలను దీర్చకున్న (దీర్చినచో)

ఆ పుట్టబోవు పిండమునకు శక్తిలేమితనము, మందబుద్ధి మొదలగునవి కలుగబోవు సంతానములో పొడసూపును.

ఇక ఐదవ మాసమున తెలియబడిన జ్ఞానము కలవాడు, మాంసరక్తములు పుష్టి కలవాడును, ఆరవ మాసమున ఎముకలు, నరములు, గోళ్ళు, వెండ్రుకలు మొదలగునవి

వానియోక్క అభివృద్ధి జరుగును. బలము రంగు కలిగి శరీరము ఎదవ మాసమున అంగము పరిపూర్ణముతో నుండును. చరణములతో మూయబడిన చేతులతో

చెవుల రంధ్రములను మూయబడిన వాడై యా ప్రాణి (ముందు శ్లోకముతో సంబంధము).

ఉద్విగ్నో గర్భ సంవాసా - దస్తి గర్భ భయాన్విత:,
అవిర్భూత ప్రబోదోసా - గర్భః దుఃఖాది సంయుతః 26

హాక ష్ట మితి నిర్విండ - స్స్వాత్మానం శో శుచీత్యథ
అనుభూతా మహాసహ్యా - పురో మర్మచ్చి దోస కృత్ 27

కరంభ వాలుకా స్తప్తా - పాశ్చాద హ్యంతా సుఖాశయా
జట రానల సంతప్త - పిత్తాఖ్యర సవిప్రుషః 28

గర్భాశయే నిమగ్నంతు - ద హం త్య తిభ్రుశం హిమా మ్
ఉదార్య కృమి నక్త్రాణి - కూటశాల్మ ల కంటకై: 29

తుల్యాని చ తుడం త్యార్తం - పార్శ్వాస్థి క్రక చార్దితమ్
గర్భే దుర్గంధ భూయిష్టే - జటరాగ్ని ప్రదీపితే 30

గర్భవాసము చేత పరాధీనుడ భవిష్య ద్గర్భ నివాస భయముతో కూడియున్నాడు. ఉత్పన్నమైన జ్ఞానము గలవాడై గర్భ జనిత దుఃఖాదులతో కూడి అక్కటా ! దుర్భరమైన దుఃఖముతో కూడినవాడై తన యాత్మను గురించి శోకించుచును ( ఇక్కడ విశే శాంషము సందర్భాను సారముగా వీర శైవ ధర్మ సిద్దాంతము సరిపడును) అయితే వీరశైవ సిద్దాంతము మేరకు తల్లి గర్భమున నున్న పిండమునకు ఎనిమిదవ మాసమున ఆ పిండమునకు జ్ఞానోదయ మేర్పడి సహింపరాని నరకభాదచేత పరమాత్ముని గురించి నాలు మళ్ళి ఇట్టి జన్మను ప్రసాదించవద్దని పరమాత్ముని ప్రార్ధించుకొనుచుండునని యున్నది. ఇట్లే శివగీత 7, 8 అయుక్తమై యున్నది.

పలుసార్లు మర్మచ్చేద కులగు, మరియు భరింపరానట్టియు పాపపూరిత దేహము లనుభవించబడెను. ముర్మురాలు (పేలాలు) వేచెడి ఇసుకతో తలపించబడిన

అత్యంత కష్టతరమైన నివాసములో నుంటివి. జటరాగ్నిచేత బహుగా తపించబడిన పిట్ట వాతాది శ్లేష్మ బిందువులు పెశీకోశమున నడిగియున్న నన్ను మిక్కిలి దహింప చేయుచున్నది,

కొండ బూరుగు ముండ్లతో సమానములైన గర్భస్థ క్రిముల నోర్లు తల్లి ప్రక్కటెముకలను రంపముతో పీడితుడనగు నన్ను మరింత వేధించుచున్నవి, జటరాగ్ని హొత్రముతో దహింపచేయునని దుర్వాసనతో భరింపరాని గర్భముననే కష్టము నాచేత ననుభవించబడెనో దానికంటెను కుంభీపాక నరకము నాకు తక్కువగా నున్నది.

సశేషం...
🌹🌹🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 58   🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 08 :
🌻   Pindotpatti Kathanam - 4
  🌻

Know that Napunsaka (eunuch) contains mixed qualities, O Rama! Well, the hrudayam(heart & feelings) gets inherited from the mother's heart itself. Hence it desires whatever the mother desires.

Therefore for the betterment of the fetus, one has to fulfill the mother's wishes, desires without fail. In that stage the mother virtually carries two hearts. Therefore she is called by a name "Dauhridini". If one doesn't fulfill the wishes of a pregnant woman, then her child has chances to be born handicapped, or deficient, or weak, or with poor intellect.

In the fifth month the foetus gains little knowledge, and the in the body flesh and blood get formed. In the sixth month bones, nerves, nails, hair, etc get generated and improved. In the seventh month the foetus gains full shape and remains in full strength and color. With the feet and with closed fists it remains closing the ears and other pores and due to the hellish experience of wombdwelling, it feels sad and remains scared of the future womb dwelling experience (which comes due to rebirths caused by nonattainment of Salvation).

The fetus remains filled with knowledge,and thinking of the self, thinking of the good & bad deeds done (in past) it remains sad and feels sorry. It reminisces its past and repents thinking how it remained inside the hellish place called womb, how it got baked under the Jatharagni (heat of the womb), how it slept in between the fluids, blood, flesh and other stinking materials, how it was bitten by the worms of the womb, how it got tortured by the presure of the bones of the mother. It thinks that the hellish womb is far worse than even the darkest of the hells viz. Kumbhipaka.

In this way it repents for the past deeds and feels bad about the womb dwelling experience.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

10.Sep.2020

No comments:

Post a Comment