శ్రీ విష్ణు సహస్ర నామములు - 9 / ŚŔĨ VĨŚĤŃÚ ŚĂĤĂŚŔĂ ŃĂМĂVĂĹĨ - 9


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 9 / Sri Vishnu Sahasra Namavali - 9 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మేషరాశి, కృత్తిక నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

9. ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖

74) ఈశ్వర: -
సర్వశక్తి సంపన్నుడైనవాడు.

75) విక్రమీ -
శౌర్యము గలవాడు.

76) ధన్వీ -
ధనస్సును ధరించినవాడు.

77) మేధావీ -
ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.

78) విక్రమ: -
గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.

79) క్రమ: -
నియమానుసారము చరించువాడు.

80) అనుత్తమ: -
తనకంటె ఉత్తములు లేనివాడు.

81) దురాధర్ష: -
రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.

82) కృతజ్ఞ: -
ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.

83) కృతి: -
కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.

84) ఆత్మవాన్ -
తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Vishnu Sahasra Namavali - 9  🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

9. īśvarō vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ |

anuttamō durādharṣaḥ kṛtajñaḥ kṛtirātmavān || 9 ||

74) Ishwara –
The Contoller

75) Vikrami –
The Lord Who has Valour

76) Dhanvi –
The Lord Who is the Supreme Archer

77) Medhavi –
The Lord Who is the Supreme Intelligence

78) Vikrama –
The Lord Who has Measured the Worlds

79) Krama –
The Lord Who has Spread Everywhere

80) Anuttama –
The Lord Who Does Not Have Anybody Better Than Him

81) Duradharsha –
The Lord Who Cannot be Attacked Successfully

82) Kritagya –
The Lord Who Knows Good and Bad of All Beings

83) Kriti –
The Lord Who Rewards All Our Actions

84) Atmavan –
The Self in All Beings

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

10.Sep.2020

No comments:

Post a Comment