నారద భక్తి సూత్రాలు - 90

🌹.   నారద భక్తి సూత్రాలు - 90  🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 61

🌻 61. లోక హానౌ చింతా నకార్యా, నివెదితాత్మ లోకవెద (శీల) త్వాత్‌ ॥ 🌻

లోకాన్ని గూర్చిన చింతన ఆ భక్తునికి ఉండదు. అతడికి దినుల దుఃఖం ఆకర్షణ కాదు. అది భగవంతుడి లీలగా తలుస్తాడు. అందులో తనకు సేవ చెసే అవకాశం వచ్చిందనే అభిప్రాయం మాత్రం ఉంటుంది. అంతటా భగవంతుడినే దర్శిస్తూ ఉన్నప్పుడు అతడికి ఏ విధమైన భేద భావం ఉండదు. అతడు సత్వ గుణం నుండి కూడా విడుదలై ఉంటాడు. సత్వగుణంలో ఉన్న వాడికైతే సేవ చేస్తున్నట్లు కర్తృత్వ భావముంటుంది. కాని త్రిగుణ రహితుడైన భక్తుడికి కర్షభావం ఉండదు. అందువలన అతడు చెసేది నారాయణసేవ అవుతుంది.

కర్తృత్వభావం లేకుండా అందరిలో భగవంతుడినే దర్శిస్తూ చెసే సేవను మెహెర్‌బాబా సేవలో పరిపూర్ణత” అంటారు.

అవతారులు లోకాన్ని ఉద్ధరించె సేవ కూడా సేవలో పరిపూర్ణత క్రిందికి వస్తుందంటారు. భక్తుడు అవసరమైన వారికి సేవ చేస్తూ పోతూ ఉంటాడు. ఎవరెవరికి చెస్తున్నాడనే గుర్తు ఏర్పడదు. అతడిలో నిరంతరం దైవిభావమె ఉంటుంది. చేస్తున్న పనికి దైవీ ప్రేరణ ఉంటుంది. చేయడంలో సహజమైన ప్రేమ, కరుణ ఉంటాయి. పూర్వ శత్రుత్వం జ్ఞప్తికి రాదు. తాను చేసే సేవలో “తృప్తొ” అనె అనుభూతి కూడా ఉండదు. అతడి ఆంతరంగిక శాంతి, పరమానందానికి సేవ చెయడం అవరోధం కాదు.

అతడిలో నిండి ఉన్న శాంతి, పరమానందాలు అవిచ్చిన్నం గనుక, ప్రాపంచిక విషయాల యెడల అతడు నిర్వికారి. నారాయణసేవ చేస్తూ కూడా అతడు నిర్వికారియె.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

10.Sep.2020

No comments:

Post a Comment