11-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 274🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 174🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Sri Lalita Sahasranamavali - Meaning - 90🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 92 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 62🌹
8) 🌹. శివగీత - 59 / The Shiva-Gita - 59🌹
9) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 49 / Gajanan Maharaj Life History - 49 🌹 
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 41 🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 400 / Bhagavad-Gita - 400 🌹

12) 🌹. శివ మహా పురాణము - 221🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 97 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 108 🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 51🌹
16 ) 🌹 Seeds Of Consciousness - 172🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 28 📚
18) 🌹. అద్భుత సృష్టి - 29 🌹
19 ) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 8 / Vishnu Sahasranama Contemplation - 8🌹
20 ) శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasranama - 10🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴*

31. యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||

🌷. తాత్పర్యం : 
బుద్ధిమంతుడైనవాడు భిన్నదేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.

🌷. భాష్యము :
జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు. 

ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతికభావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు. 

ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 486 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴*

31. yadā bhūta-pṛthag-bhāvam
eka-stham anupaśyati
tata eva ca vistāraṁ
brahma sampadyate tadā

🌷 Translation : 
When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.

🌹 Purport :
When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision. 

This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies. 

When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 274 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 34
*🌴. The story of Sarabheswara 🌴*

*🌻 Sri Datta puts His devotees in troubles, tests their devotion and then saves them - 2 🌻*

Meanwhile, some farmers also came to that Brahmin’s house. Word spread in the village that I gave guarantee to repay the Brahmin’s loan, that I was a disciple of a great ‘Mahapurusha’ and so I was prepared to repay the Brahmin’s debt with my Godly powers. 

 It was also rumoured that I was a great astrologer and without Godly powers, I would not have given such an assurance. In that village, the farmers were fond of betting.  

Some of them were betting that the Brahmin would clear the debt and some more people were betting that he would not be able to clear. Oh! What a bad fate! I put my happy life into trouble. 

 I was caught in this problem by giving an impossible promise. If I could not repay the Brahmin’s loan, they will drag me to court. Along with me, Dharma Gupta also would be in trouble.  

Moreover, based on my dry promise, some people were betting. Ultimately, my dry promise became the point of gambler’s betting. I believed that Sripada’s divine Sricharanas were the only refuse. 

 I remembered the words spoken by Narada Maharshi to Sri Mahavishnu ‘Satyam Vidhathum Nijabrutya Bhashitam’. Narayana will take notice of words spoken by His devotees and servants and will make them true. 

There was a pundit in that village by name Sarabheswara Shastri. He was a great scholar in Mantra shastram. He would tell the past, present and future correctly by the grace of a ‘prethaatma’. 

Some of the people who betted went to him and told everything. He asked ‘pretatma’. That ‘pretatma’ said that the Brahmin would not be able to clear his debt. With this, the intensity of betting increased.  

The farmers were betting in hundreds of ‘varahaas’. They were very enthusiastic in betting because in this episode, it would be known who was great -- Sharabheswara Sastry or Shankar Shastri. I prayed ‘Sripada Prabhu! you put me in between the gamblers. You also put me in the prospect of being dragged to the court. You wanted to push that poor Brahmin into tears with false hopes.  

You put Sri Dharma Gupta, also into troubles. I am not able to understand the inner meaning of this divine fun. My education is meager. I do not have any spiritual power, I do not know great vidyas like astrology.  

I do not do any japa, tapa or yogaabhyasa. I do not follow strict austerities also. Out of curiosity, I have decided to write Sripada’s divine story though I do not have any qualification for it. It is your wish how you will save me from this situation.’  

There was a saying that a determined person is stronger than King. Courage started growing in me as never before. Whatever was destined would happen. I believed strongly that Sripada would save me somehow.

 Sharabheswara Shastri had one sister. She was also living in the same village. She had a dream in the morning hours.  

She dreamt that she had high fever, her husband died and she became a widow. She questioned her brother Sharabheswara Shastri about the effect of her dream. Sharabheswara asked the ‘pretaatma’ whom he worshipped.  

The ‘pretaatma’ said that her husband was in a distant country, decoits attacked him on the way, took away the money and killed him.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. భావ బలము - 1 🌻* 

సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. 

దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి. 

మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింపజేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు..
..✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 The Masters of Wisdom - The Centres of the Solar System - 174 🌹*
*🌴 Sun and Consciousness - 3 🌴*
✍️ Master E. 
📚 . Prasad Bharadwaj

*🌻. Life and Consciousness - 1 🌻*

Every human being has got a Sun-centre in him, which is his own consciousness as “I am”. 

It is the centre of his point of view and horizon. We are Sunrays directly connected with the Sun, units of the solar energy. They are as much in the Sun as on earth and in us. Their movement is permeation and not relocation. 

This means that it exists through and through, from the source to the last gross plane. Permeation is the basic quality of the soul which gives us an awareness which fulfils and pervades everything in us. 

We can attune to the presence of the energies of the higher circles in us by meditating on them, saying a prayer or looking into a light and feeling the light in us. 

We receive the energies from the super-soul via the individual soul, via Buddhi up to the mind.

We are part of the great system and therefore the teachings say that each one of us is a Sun having the potential to become a solar system. 

As long as our consciousness is stuck in the mundane world, we are caught in it. 

The sentence “I am in the world, but not of the world” reminds us that in our being we are solar angels who have to awaken from their sleep in matter.

The Sun gives us life and consciousness. For the awakening of consciousness it helps us to take in solar Prana through deep, conscious breathing, for on the etheric plane oxygen is solar energy. By exhaling carbon dioxide we expel the limitations through Saturn. 

🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Hercules / Uranus / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Astrology.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 173.*
*విశ్వమాతా జద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ*
*ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ*

933. విశ్వమాతా : 
విశ్వమునకు తల్లి

934. జద్ధాత్రీ : 
జగత్తును రక్షించునది

935. విశాలాక్షీ : 
విశాలమైన కన్నులు కలది

936. విరాగిణీ : 
దేనిథోనూ అనుభందము లేనిది

937. ప్రగల్భా : 
సర్వసమర్ధురాలు

938. పరమోదారా : 
మిక్కిలి ఉదారస్వభావము కలిగినది

939. మరామోదా : 
పరమానందము కలిగినది

940. మనోమయీ : 
మనశ్శే రూపముగా కలిగినది

*🌻. శ్లోకం 174.*
 
*వ్యోమకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ*
*పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ*

941. వ్యోమకెశే : 
అంతరిక్షమే కేశముగా కలది

942. విమానస్థా : 
విమానము (సహస్రారము) నందు ఉండునది

943. వజ్రిణీ : 
వజ్రము ఆయుధముగా కలిగినది

944. వామకేశ్వరీ : 
వామకేశ్వరుని శక్తి

945. పంచయఙ్ఞప్రియా : 
నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది

946. పంచప్రేతమంచాధిశాయినీ :
 పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 90 🌻*

933 ) Viswa Matha -   
The mother of the universe

934 ) Jagat Dhathri -   
She who supports the world

935 ) Visalakshi -   
She who is broad eyed

936 ) Viragini -   
She who has renounced

937 ) Pragalbha -   
She who is courageous

938 ) Paramodhara -   
She who is great giver

939 ) Paramodha -   
She who has great happiness

940 ) Manomayi -   
She who is one with mind

941 ) Vyoma kesi -   
She who is the wife of Shiva who has sky as his hair

942 ) Vimanastha -   
She who is at the top

943 ) Vajrini -   
She who has indra’s wife as a part

944 ) Vamakeshwaree -   
She who is goddess of the people who follow the left path

945 ) Pancha yagna priya -   
She who likes the five sacrifices

946 ) Pancha pretha manchadhi sayini -   
She who sleeps on the cot made of five corpses

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 91 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
చతుర్ధాధ్యాయం - సూత్రము - 62

*🌻 62. న తల్సిద్దా లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగః తత్సాధనం చ (కార్యమేవ) || 🌻*

భక్తి సిద్ధించాలంటే లోక వ్యవహారం మానాలా ? మానేస్తే ఎలా కుదురుతుంది ? భక్తి సాధన దశలోగాని, భక్తి సిద్ధించిన తరువాత గాని భక్తుడు లోక వ్యవహారం మానవలసిన అవసరం లేదు. సమస్త శుభ కర్మలను చేసూ ఆ కర్మల ఫలితాన్ని భగవదర్పణ చెస్తూ జీవించవచ్చును.

అశుభ కర్మలు చేయడు. ఇతర అత్యవసర కర్మలు చేయక తప్పునప్పుడు భక్త ప్రహ్లాదునివలె, ఏ పని చెస్తున్నా శ్రీహరి స్మరణను వదలక ఉండును. చేసే పని తనకోసం కాదన్నట్లు, తన పనే అయినప్పటికీ, తానొక పని మనిషిగా ఎవరికో చెసి పెట్టినట్లు చేస్తాడు. యజమానిగా భావించడు. ధనం విషయంలో అది తన కోసమే అయినప్పటికీ, ఎవరి కోసమో అన్నట్లు బ్యాంకు క్యాషియరు వ్యవహరించినట్లు చేస్తారు. గుడి నిర్మాణానికి ట్రస్ట్‌ వలే, తన పనులకు యజమాని భావన లేకుండా చేస్తాడు. దేనికి స్వతంత్రించడు. “ఒక పని అయిపోయింది” అని అనుకుని ఆ పనిని తలచడు. చెయ్యబోయె పని, మీద పడినట్లుగా భావించి చేస్తాడు. అంత వరకు తలచనే తలచడు. అసంకల్పిత ప్రతీకార చర్యగా అన్ని పనులూ చేసుకుంటూ పోతాడు. ఎప్పుటి పనికి అప్పుడు క్షణంలో సిద్ధమవుతాడు గాని, ముందస్తు ఆలోచన ఉండదు. భగవచ్చింతనలో ఉంటూ చేసే పనుల్లో పొరపాట్లు కూడా చేయడు.

కర్మను భగవదర్పితంగా చేస్తాడు. కనుక కర్మ ఫలితం తనకు అంటదు. నేను, నాది అనే వాటిని జ్ఞాన మార్గ సాధనలో త్యాగం చేయడం కష్టమేమో గాని, భక్తి సాధకుని విషయంలో మాత్రం భగవదర్పణగా చెస్తాడు గనుక, అది సులభ సాధ్యమవుతుంది.

సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యా ద్విద్వాంస్తథాసక్తః చికిర్చుర్లోకసంగ్రహమ్‌ ॥
- (3:25) భగవద్దిత

అజ్ఞానులు కర్మలందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసులు (అనగా ముఖ్యభక్తులు, జీవన్ముక్తులు, భాగవతోత్తములు, సద్దురువులు, ఆచార్యులు మొదలగువారు) కూడా లోక హితార్థం ఆసక్తి రహితంగా కర్మలను ఆచరిస్తారు. వారి కోసమై వారేమి చేయరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 62 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

*🌻. Illusion and ignorance are the same. It’s the darkness that envelops the mind. The further we want to get away from it, the stronger and closer it gets. It is the nature of illusion. We may wonder why the darkness of illusion increases with our spiritual pursuit. 🌻*

There’s only one reason for this. You are not really starting your spiritual life. You are just thinking about it, biding time and putting it off to tomorrow. 
 
Your mind will not let you embark on your spiritual journey. Will your mind let you give up your big house, wealth, fame, wife, children etc and embark on your spiritual journey? No, it will not. 

Even at the time of death, the spirit is hankering after these possessions. This is what is called delusion. That’s the darkness. The only light that removes this darkness is the light of Guru. 
 
The sloka continues to explain the qualities of a Guru.  

Sloka: 
Yadanghri kamala dvandvam dvanda tapa nivarakam 
tarakam bhava sindhosca tam gurum pranamamyaham 

This verse offers obeisances to such a Guru whose pair of lotus feet can wipe out the passions caused by the dualities of joys and sorrows, cold and heat and which can ferry across the ocean of life. Through this sloka, they are providing a definition for Guru as one Whose lotus feet can wipe out the passions caused by dualities. 
 
Attachment and detachment manifest themselves in strange forms in life. Some people gain attachment from detachment. A person may renounce everything and build a big temple. 

But, he’s always immersed in thinking about the temple, about how he built the temple, how tall the temple tower is, how many storeys it has, how many little temples he built around the main temple, how big the temple periphery is, how beautiful the decorations are and so on.  

He’s only thinking about the temple and is absorbed in admiring it. It’s as if the temple takes precedence over the Guru. He considers himself an accomplished spiritual seeker. He brags to everyone about having built the temple.
 
Similarly, a distinguished person that made donations toward something is constantly  
bragging about being the donor. All these are attachments that come with detachment. They  
did some good deed, but they didn’t give up attachment. 

Your donations were done with  
attachment. Your good deeds were done with attachment, you have desire to brag about it.  
Some others are worried about not receiving all the ancestral rites after they die. Let’s see  
how to overcome such fears.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 59 / The Siva-Gita - 59 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము
*🌻. గర్భో త్పత్త్యాది కథనము - 5🌻*

దుఃఖ మయాప్తం యత్త స్మా - త్కనీయః కుంభ పాకజమ్,
పూయా సృక్ శ్లే ష్మ పాయిత్వం - వాంతాశిత్వం చ యద్భవేత్ 31
ఆశు చౌ క్రుమిభావశ్చ - త త్ప్రాప్తం గర్భ శాయినా,
గర్భశయ్యాం సమారుహ్య - దుఃఖ యాద్రు జ్మయాపి తత్ 32
నాటిశేతే మహాదుఃఖం - నిశ్శేష సరకే షు త త్,
ఏవం సమర న్పురా ప్రాప్తా - నానాజాతీ శ్చ యాతనాః 33
మోక్షో పాయమాభి ధ్యాయ - న్వర్త తే భ్యాస తత్పరః
అష్ట మే త్వ క్సృతీ స్యాతా - మోజస్తే జశ్చ హృద్భవ మ్ 34
శుభ్ర మాపీత రక్తం చ - నిమిత్తం జీవితే మతమ్,
మాతరం చ పునర్గ ర్భం - చంచలం తత్ప్రధావతి 35

గర్భములో నుండిన నేను రక్తమయముగా నున్న వస్తువును రక్తమును కఫము (శ్లేష్మము) ద్రావబడినది. ఉదరములో నున్న (తల్లిదినిన) అన్నమును తినబడినది. విణ్మూత్రములందు క్రిమిత్వము బోదింపబడినది. గర్భములో నున్నప్పుడే నేను బొందిన దుఃఖము సమస్త నరకములన్నియు యనుభవించిన దానికంటెను అధికమైనది. 

ఈ ప్రకారముగా మొదట దాను బొందిన అనేక సంకర జాతులను కటినమైన సంకష్టములను స్మరించి, నిఖిలమైన దుఃఖాభ్యాసములు కలవాడై మోక్షో పాయమును గురించి చింతించుచున్నాడు.  

 అష్టమ మాసమున చర్మమునకు చలన మేర్పడును, హృదయము నుండి ఓ జస్సును, తేజస్సును బుట్టును. ఓజస్సనగా శుభ్రమగు రంగు కలది, తేజస్సనగా, కొద్దిగా పచ్చ పచ్చగా రక్తవర్ణముతో కూడినది. ఈ రెండును జీవితమునకు ఆశ్రయములుగా నుండును. 
అదృష్టవశముచేత తల్లి గర్భమును వీడి ఆ ఎనిమిదవ మాసమున జన్మించినచో ఓజస్సుతో విడువబడి జీవించడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 59 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 08 :
*🌻 Pindotpatti Kathanam - 5 🌻*

Inside the womb I (the fetus feels) drank the blood and sleshma(pleghm) of the mother, I ate whatever
was present inside the mother's stomach. 

The suffering I felt inside the womb is far higher than the pain given in all the hells summed together. 

In this way the jeeva thinks about the past deeds, the undergoing torture, and cries for a pathway to salvation. In the eight month the skin (around fetus) gets moving and from the heart the fetus gains Ojas (pure hue) and Tejas (yellowish hue). 

These two remains as the basis for the life. If by fortune the child takes birth in that month, it remains with Ojas throughout life.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 49 / Sri Gajanan Maharaj Life History - 49 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 10వ అధ్యాయము - 3 🌻*

ఒకసారి బాలాభవోను అతని కోరికకు వ్యతిరేకంగా బయటకు పంపుతారు, కానీ అతను ఉద్యోగంనుండి రాజీనామాచేసి వెనక్కి వస్తాడు, అప్పుడు సిగ్గులేని ఎద్దు మాటిమాటికీ పచ్చికమైదానాలవైపు వెళ్ళినట్టు, ఎందుకు నువ్వు మాటిమాటికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావు. జీవితంలో అన్నీ త్యజించినవాళ్ళు మాత్రమే ఇక్కడకు రావాలి అని భాస్కరు అతనితో అన్నాడు. ఈవిధంగా భాస్కరు వెటకారంగా మాట్లాడడం శ్రీమహారాజుకు నచ్చలేదు. అందుకని అతని తెలివితక్కువ తనం తొలగించడానికి శ్రీమహారాజు ఇలాచేసారు: 

అక్కడ కూర్చున్న ఒక సత్పురుషుని చేతిలో ఒక పెద్ద గొడుగు ఉంది. శ్రీమహారాజు ఆగొడుగు తీసుకొని అదివిరిగే వరకు బాలభవను కొట్టడం మొదలు పెట్టారు. ఆతరువాత ఒకబెత్తం తీసుకొని కొట్టడం కొనసాగించారు. చుట్టు ప్రక్కలవాళ్ళు భయపడి పరిగెత్తడం మొదలు పెట్టారు, కానీ బాలాభవ్ స్థిరంగా శ్రీమహారాజు ముందు పడిఉన్నాడు. ఆదెబ్బలకి అతను చనిపోయి ఉంటాడని చాలామంది అనుకున్నారు. 

భాస్కరు కూడా జరుగుతున్న దానికి చింతించడం మొదలు పెట్టాడు కానీ శ్రీమహారాజుతో ఏమీ అనడానికి సాహసించలేక పోయాడు. ఆబెత్తం కూడా ఆదయాహీనమైన దెబ్బలకి విరిగిపోయింది. అప్పుడు శ్రీమహారాజు కుమ్మరి మట్టిని కుమ్మినట్టు కాళ్ళతో కుమ్మడం మొదలు పెట్టారు. 

ఇదిఇలా అవుతూ ఉండగా కొంతమంది శిష్యులు, శ్రీమహారాజు అధికంగా ప్రేమించే భక్తులను పిలవడానికి వెళ్ళారు. బనకటలాల్ మరియు కృష్ణాజి పరుగున అక్కడికి వచ్చారు కానీ శ్రీమహారాజు చేస్తున్నదానిని నిరోధించడానికి వాళ్ళుకూడా సాహసించ లేకపాయారు. చిట్టచివరికి, చాలాజంకుతూ బాలాభవోను కొట్టడం ఆపండి, అతనుకూడా మీ భక్తుడే అని శ్రీమహారాజుతో బనకటలాల్ అన్నాడు. 

దానికి శ్రీమహారాజు నవ్వి, నువ్వు అసందర్భంగా మాట్లాడుతున్నావు. నేను బాలాభవోను కొట్టనూలేదు, కుమ్మనూలేదు. స్వయంగా నీవే అతని శరీరం పరిశీలించు. ఓప్రియమైన బాలాభద్ లేచి నీశరీరం వీళ్ళకి చూపించు అని అన్నారు. దానికి బాలాభద్ లేచాడు. అక్కడి ప్రజలు అతని శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఒక్క దెబ్బగుర్తు కూడా కనబడలేదు. అతను ఎప్పటిలాగా హుషారుగా, సంతోషంగా ఉన్నాడు. ఈ సంఘటనతో భాస్కరుకు బాలాభవ్ యొక్క అధికారం, గొప్పతనం శ్రీమహారాజు చూపించారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 49 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 10 - part 3 🌻*

Once Balabhau was driven out against his wish, but he returned back to Maharaj having resigned from his service. At that time Bhaskar said to him in an agitated tone, “Why are you troubling us by frequently visiting this place like a shameless bullock who keeps returning to the green pastures? Only those who have renounced everything in life can rightly visit this place so frequently.” 

Shri Gajanan Maharaj did not like this egotistic talk of Bhaskar and so decided to remove his ignorance by doing the following: There was a big umbrella in the hands of a gentleman sitting nearby. 

Shri Gajanan Maharaj got a hold of that umbrella and beat Balabhau with it till it broke. He continued the beating by the means of a cane. The people who were around got scared and some of them even ran away, but Balabhau was lying still before Shri Gajanan Maharaj . 

Many thought that he must have died owing to such a beating and even Bhaskar now got worried about what was happening, but he did not dare to say anything to Shri Gajanan Maharaj . That cane also broke by the merciless beating. 

Then Maharaj started trampling Balabhau with both His feet like a potter trampling the mud. While this was going on, some of the disciples went to call the devotees whom Shri Gajanan Maharaj loved the most. Bankatlal and Krishnaji came running to the temple, but they too could not dare restrict Shri Gajanan Maharaj from what he was doing. 

At last Bankatlal, most hesitantly, requested Shri Gajanan Maharaj to stop beating Balabhau, saying that he too was His devotee. At that Shri Gajanan Maharaj laughed and said, “You are speaking something irrelevant; I have not beaten nor trampled Balabhau. 

You can see for yourself and examine his body. O My dear Balabhau, get up and show your body to these people!” Balabhau got up and people examined his body carefully. There was no trace of beating on it. He was as happy as ever. With this incident Shri Gajanan Maharaj proved the authority and greatness of Balabhau’s devotion.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 41 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 8 🌻*

157. ఆత్మ యొక్క చైతన్యము, స్వయముగా పూర్ణముగా పరిణామము చెందగలందులకుగాను వేరే మార్గము లేక ఈ సంస్కారముల సుడిగుండములో చిక్కుకుపోయినది.ఎంతవరకు?

ఆత్మ, తాను, అనంతమనియు, శాశ్వతమనియు, పరమాత్మలో శాశ్వతముగా ఉన్నననియు అనుభూతినొంది, తన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములను అనుభవించునంతవరకు. 

158.పరిణామములో, ఆత్మలు తక్కువ రూపములను విడిచిపెట్టుచు, హెచ్చు రూపములతో చేరుచున్నవి.


159. చైతన్య పరిణామము, రూప పరిణామమునకు సంబంధించినదేగాని ఆత్మలకు కాదు. 


160. పరిణామమొందుచున్న చైతన్యము, స్థూలరూపము చైతన్యమేగాని, సూక్ష్మ-మానసిక దేహము చైతన్యము మాత్రము కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 401 / Bhagavad-Gita - 401 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 🌴

08. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
    దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్ ||

🌷. తాత్పర్యం : 
కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్యనేత్రములను ఒసగుచున్నాను. నా యోగవైభావమును వీక్షింపుము!

🌷. భాష్యము : 
శుద్ధభక్తుడైనవాడు శ్రీకృష్ణుని అతని ద్విభుజరూపమున కన్నను అన్యమైన ఏ రూపమునందు గాంచగోరడు. విశ్వరూపమును అతడు మనస్సుతోగాక, ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవలెను. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సునుగాక, దృష్టిని మార్చుకొనమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాబోవు శ్లోకములందు స్పష్టపరుపబడినట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు కోరియున్నందున దాని దర్శనము కొరకై భగవానుడు అతనికి దివ్యదృష్టి నొసగినాడు.
శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమున చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమలక్షణములతోనే ఆకర్షితులగుదురు కాని విభూతిప్రదర్శచే కాదు. శ్రీకృష్ణునితో ఆటలాడుకొనువారు, మిత్రులు, అతని తల్లితండ్రులు ఎన్నడును అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించవలెనని కోరియుండలేదు. శుద్ధప్రేమలో వారెంత మునిగియుండిరనగా అతడు దేవదేవుడనియు వారెరుగకుండిరి. తమ ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును సైతము మరచిపోయిరి. శ్రీకృష్ణునితో ఆటలాడిన బాలురు కృతపుణ్యపుంజులనియు(ఘనపుణ్యాత్ములని) మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా కృష్ణునితో క్రీడింపగలిగిరనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుని దేవదేవునిగా నెరుగక, తమ సన్నిహిత మిత్రునిగా భావించిరి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 401 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴

08. na tu māṁ śakyase draṣṭum
anenaiva sva-cakṣuṣā
divyaṁ dadāmi te cakṣuḥ
paśya me yogam aiśvaram

🌷 Translation : 
But you cannot see Me with your present eyes. Therefore I give you divine eyes. Behold My mystic opulence!

🌹 Purport :
A pure devotee does not like to see Kṛṣṇa in any form except His form with two hands; a devotee must see His universal form by His grace, not with the mind but with spiritual eyes. To see the universal form of Kṛṣṇa, Arjuna is told not to change his mind but his vision. 

The universal form of Kṛṣṇa is not very important; that will be clear in subsequent verses. Yet because Arjuna wanted to see it, the Lord gives him the particular vision required to see that universal form.

Devotees who are correctly situated in a transcendental relationship with Kṛṣṇa are attracted by loving features, not by a godless display of opulences. 

The playmates of Kṛṣṇa, the friends of Kṛṣṇa and the parents of Kṛṣṇa never want Kṛṣṇa to show His opulences. They are so immersed in pure love that they do not even know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. 

In their loving exchange they forget that Kṛṣṇa is the Supreme Lord. In the Śrīmad-Bhāgavatam it is stated that the boys who play with Kṛṣṇa are all highly pious souls, and after many, many births they are able to play with Kṛṣṇa. Such boys do not know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. They take Him as a personal friend.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 221 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
48. అధ్యాయము - 3

*🌻. కామశాపానుగ్రహములు - 6 🌻*

బ్రహ్మాణం మాముహచేదం సదక్షాదిసుతం మునే | శృణ్వతాం పితృసంఘానాం సంధ్యాయాశ్చ విగర్వధీః || 67

ఓ మహర్షీ! దక్షుడు మొదలగు కుమారులతో కూడియున్న బ్రహ్మతో (నాతో) గర్వము తొలగిన బుద్ధిగల కాముడు, పితృదేవతలు, సంధ్య వింటూ ఉండగా, ఇట్లు పలికెను (67).

కామ ఉవాచ |

కిమర్ధం భవతా బ్రహ్మన్‌ శప్తోహమతి దారుణమ్‌ |అనాగస్తవ లోకేశ న్యాయ్యమార్గనుసారిణః || 68

త్వయా చోక్తం ను మత్కర్మ యత్తద్బ్రహ్మన్‌ కృతం మయా | తత్ర యోగ్యోన శాపో మే యతో నాన్యత్‌ కృతం మయా 69

అహం విష్ణుస్తథా శంభుస్సర్వే త్వచ్ఛరగోచరాః |ఇతి యద్భవతా ప్రోక్తం తన్మయాపి పరీక్షితమ్‌ || 70

నాపరాధో మమాప్యత్ర బ్రహ్మన్మయి నిరాగసి | దారుణస్సమయశ్చైవ శాపో దేవ జగత్పతే || 71

ఓ బ్రహ్మా! నీవు నన్ను మిక్కిలి దారుణముగా శపించుటకు కారణమేమి ? ఓ లోక ప్రభూ! నీవు చేయు పనులు పాపరహితములు, న్యాయ్యామార్గమును అనుసరించునవి అయి ఉండును (68). 

నేను చేయవలసిన పనిని నీవు నిర్దేశించితివి. ఏ బ్రహ్మా! నేను దానినే చేసితిని. ఆ విషయములో నాకు శాపము నీయదగదు. నేను నీవు చెప్పిన దానికంటె భిన్నమగు పనిని చేయలేదు (69). 

నేను, విష్ణువు, శంభుడు, అందరు నీ బాణములకు వశులగుదురు అని నీవు చెప్పిన మాటను మాత్రమే నేను పరీక్షించితిని (70). 

ఓ బ్రహ్మా! దీనిలో నా అపరాధము లేదు. ఓ దేవా! జగత్ర్పభూ! తప్పును చేయని నాకు దారుణమగు శాపమునిచ్చితివి (71).

బ్రహ్మో వాచ |

ఇతి తస్య వచశ్ర్శుత్వా బ్రహ్మాహం జగతాం పతిః| ప్రత్యవోచం యతాత్మనం మదనం దమయన్ముహుః || 72

ఆత్మజా మమ సంధ్యేయం యస్మాదేతత్స కామతః | లక్ష్మీకృతోSహం భవతా తతశ్శాపో మయా కృతః || 73

అధునా శాంతరోషోsహం త్వాం వదామి మనోభవ | శృణుష్వ గత సందేహస్సుఖీ భవ భయం త్య జ || 74

త్వం భస్మ భూత్వా మదన భర్గలోచన వహ్నినా | తథైవాశు సమం పశ్చా చ్ఛరీరం ప్రాపయిష్యతి || 75

యదా కరిష్యతి హరోంజసా దారపరిగ్రహమ్‌ | తదా స ఏవ భవతశ్శరీరం ప్రాపయిష్యతి || 76

బ్రహ్మ ఇట్లు పలికెను -

మన్మథుని ఈ మాటలను విని, జగత్ర్పభువు బ్రహ్మ అగు నేను ఆత్మ నియంత్రణము గల మన్మథుని అనేక పర్యాయములు నిగ్రహించి ఇట్లు బదులిడితిని (72). 

ఈ సంధ్య నాకు కుమార్తె. నేను ఈమె యందు కామవికారమును పొందునట్లు నీవు నన్ను నీ బాణములకు లక్ష్యము చేసితివి. అందువలననే , నేను శాపమునిచ్చితిని (73). 

ఇపుడు నా కోపము తగ్గినది. ఓ మన్మథా! నేను చెప్పు మాటలను వినుము. నీ సందేహములు తొలగును. నీవు సుఖివి కమ్ము. భయమును వీడుము (74). 

మన్మథా! శివుని నేత్రము నుండి వచ్చిన అగ్ని నిన్ను భస్మము చేయును. ఆ తరువాత నీవు శీఘ్రముగా మరల శరీరమును పొందగలవు (75). 

శివుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించి, ఆయనయే నీకు శరీరము కలుగునట్లు చేయగలడు (76).

ఏవ ముక్త్వాథ మదనమహం లోకపితామహః | అంతర్దధే మునీంద్రాణాం మానసానాం ప్రపశ్యతామ్‌ || 77

ఇత్యేవం మే వచశ్ర్శుత్వా మదనస్తేSపి మానసాః | సంబభూవుస్సుతాస్సర్వే సుఖినోsరం గృహం గతాః || 78

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామశాపానుగ్రహో నామ తృతీయోsధ్యాయః (3).

లోకపితామహుడనగు నేను మునీశ్వరులు, మానసపుత్రులు చూచుచుండగా, ఇట్లు పలికి అంతర్ధానమును చెందితిని (77). 

ఈ నామాటలను విని, మన్మథుడు, మరియు మానసపుత్రులు అందరు సుఖమును పొంది, శీఘ్రమే గృహములకు వెడలిరి (78).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో కామశాపానుగ్రహములనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 108 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పిప్పలాద మహర్షి - 10 🌻*

59. ఆర్యమతంలో ఈ విషయంలో అందరూ మహర్షులే, అందరూ జ్ఞానులే, అందరూ ముక్తులే కావచ్చుకాని వాళ్ళ బోధలుమాత్రం అనేక రకాలుగా ఉన్నాయి. 

60. అందుకనే చిట్టచివరకు హిందూమతంలోని హిందూ ధర్మం అంతాకూడా భాగవతమతం అనేటటువంటి ఒక పెద్దసముద్రంలో చేరింది. సముద్రం ఎటూ ప్రవహించదు. నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరతాయి. కానీ సముద్రం ఎక్కడికి ప్రవహిస్తుంది? అందులోనే అన్ని నదులూ లయిస్తాయి. 

61. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, యోగము, సాంఖ్యము అన్నీకూడా భాగవతమతంలో లయించక తప్పదు. చివరకు అదే మనకు గమ్యస్థానమైపోయింది. ఇక్కడినుంచి మళ్ళీ వెనక్కుపోవటం అనేది లేదు. 

62. మళ్ళీ సాంఖ్య మతంలోకి వెళ్ళిపోతాము, యోగంలోగి వెళ్ళిపోతాము, మళ్ళి పూర్వమీమాంసకులము అయిపోతాము అని కలలు కనకూడదు. అలా జరగదు. భాగవతమతమే చిట్టచివరి దశ. ఇదే తుదిమెట్టు. మనందరికీ కూడా అదే శరణ్యం. అందులోనే మనం అన్నిటినీ అన్వయించుకోవాలి. 

63. అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా, ద్వైతమైనా, ఏదైనాసరే భాగవతమతంలో అన్వయించుకోవచ్చు. నేడు అనేకమంది అదే చేస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 28. గీతోపనిషత్తు - స్థిర చిత్తము - మానవుడు లోక అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట తాబేలు వలే నేర్చు కొనవలెను. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 58 📚*

*యదా సంహరతే చాయం కూర్మో‌உంగానీవ సర్వశః |*
*ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 58* ||

తాబేలు ఆధ్యాత్మిక సాధకునకు చక్కని సందేశ మిచ్చుచున్నది. 

*పరిస్థితులను బట్టి తాబేలు తన సర్వాంగములను తనలోనికి ఉపసంహరించుకొని అనుకూల పరిస్థితులు ఏర్పడి నపుడు మరల అంగములను విస్తరించును. పురోగమనము, తిరోగమనము తెలిసిన ప్రజ్ఞ- తాబేలు ప్రజ్ఞ.*

 మానవుడు కూడ నట్లే పురోగమనము, తిరోగమనము తెలిసి యుండవలెను. కాలము, దేశము ననుసరించి అనుకూల సమయమున మనస్సు, ఇంద్రియములు, శరీరమును ఉపకరణములుగ బహిర్గతుడవ వలెను. కర్తవ్యము నిర్దేశింపబడని సమయములందు అంతర్గతుడవ వలెను. అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట నేర్చు కొనవలెను.

ఇంద్రియార్థముల వెంటబడు ఇంద్రియ ప్రజ్ఞను ఉపసంహరించుకొనుట వలననే చిత్తము స్థిరమగును. ఇచట దోషము ఇంద్రియముల యందు లేదు. సాధకుని యందే యున్నది.

సాధకుడు తిరోగమనమును సంకల్పించినంతనే ఇంద్రియముల నుండి, మనస్సు నుండి, బుద్ధిలోనికి ప్రజ్ఞ మరలగలదు. అట్లు మరల్చుకొనుటకు దైవచింతన చక్కని ఉపాయము. దైవస్మరణమున నిలచినచో ఇంద్రియార్థముల వెంట ఇంద్రియములు పరుగెత్తవు. 

అపుడు ప్రజ్ఞ చంచలము గాక నిలచును. కర్తవ్యమును బట్టి ప్రజ్ఞను బహిర్ముఖము చేయవచ్చును. ఈ కారణముగ తాబేలు బొమ్మను చూచుట- పై సందేశమును గుర్తు తెచ్చుకొనుట సాధకునకు ఉపకరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 173 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 20. The ‘I am’ concept is the last out post of the illusion, hold on to it, stabilize in the ‘I am’, then you are no more and individual. 🌻*

Moving out of a country, at the border, there are check-posts and then it is ‘no-man’s land’ till another country begins its check-post.  

Similarly to move out of this country or illusion the ‘I am’ is the last and only out post, there is no other way out. 

Stay at this out post, stabilize yourself over there in the ‘I am’, and when you do so you are no more an individual.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 51 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 15 🌻*

ఇది, జగత్తే శాశ్వతము. ఈ జగత్తు ఎప్పటికి వుంటుంది. నేను పుట్టక ముందు నుంచీ ఈ జగత్తు వుంది, నేను పోయినాక కూడా ఈ జగత్తు వుంటుంది. కాబట్టి జగత్తు శాశ్వతము - అని నీ జననమరణాల మధ్యలో కనుక నీవు చూచుకున్నట్లయితే జగత్తు శాశ్వత లక్షణంతోనే తోచినట్లుగా కనపడుతుంది. 

అంటే సాపేక్ష పద్ధతిగా చూసినప్పుడు, జగత్తు శాశ్వతముగా నీకంటే ముందు నుంచీ వున్నదిగా, నీ తరువాత కూడా వుంటున్నదిగా కనబడుతున్నప్పటికీ, జగత్తు పరిణామశీలమైనటువంటిది. నిరంతరాయం మార్పు చెందుతూ వున్నటువంటిది. అస్థిరమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మవస్తువును గ్రహించటానికి వస్తునిశ్చయజ్ఞానం అవసరం. 

ఇటువంటి వస్తునిశ్చయజ్ఞానం ఏదైతే వుందో, అట్టి వస్తునిశ్చయజ్ఞానం చేత జగత్తుయొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గుర్తించిన వాళ్ళు ఎవరైతే వున్నారో.... వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతారు.

    కాబట్టి ఇక్కడ నచికేతుడు, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా గుర్తించినటువంటి వాడుగా మనకి యమధర్మరాజు గారు మాట్లాడే సందర్భంలో కనబడుతున్నారు.

 ఇంకేమిటట? సాత్విక కర్మల ప్రభావం చేత కలిగేటటుంవంటి పుణ్యవశం చేత, కొన్ని భోగములు లభిస్తాయి సూక్ష్మశరీరానికి, స్థూలశరీరానికి కూడా! కాబట్టి, అవి ఎటువంటివి అట? క్రతువల వలన కలిగెడి ఫలము ఎంతటి విశాలమైనదైననూ అనేక రకాలైనటువంటి క్రతువులు చేస్తూవుంటాం మానవులం.

    ఆ యా క్రతువుల యొక్క ఫలితములన్నీ దానము, ధర్మము, యజ్ఞము, తీర్థయాత్ర, సాత్విక కర్మాచరణ.... ఇవన్నీ కూడా పుణ్యఫలములన్నమాట. 

ఈ పుణ్యఫలములు అనుభవించేటప్పడు, నీకు ఆ ఐశ్వర్యం సమకూరినట్లు, సుఖభోగాలను అనుభవించినట్లు స్థూలంలో నీకు కనబడుతూ వుంటుంది. ఇంకేమిటి అంటే... అప్పుడు ఆ పుణ్యం ఖర్చు అయిపోతూ వుంటుందన్నమాట. 

అట్లాగే, నీకు దుఃఖ కాలం, కష్టకాలం వచ్చినప్పుడు పాపం అనేటటువంటి కర్మ ఖర్చు అయిపోతూ వుంటుంది. కాబట్టి, తన సుఖమే పుణ్యము, తన దుఃఖమే పాపము. ఇంకా వేరే ఏమీ లేదు. పాపాయ పరపీడనం. వేరే ఏమీ లేదు. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం.

    ఇతరులకు ఉపకారమొనర్చడానికి నువ్వు చేసినటువంటి శ్రమ, శ్రద్ధ, ఇచ్ఛ ఏదైతే వుంటుందో అదంతా పుణ్యఫలంగా మారుతుంది. 

ఇతరులకు నిరసించినటువంటిది, నిందించినటువంటిది, ఆపత్కాలంలో సహాయం చేయనటువంటి ఇతరత్రా సమస్యలు ఏవైతే వుంటాయో, చేయగలిగి వుండి చేయలేనటువంటి ధర్మరీత్యా భంగం ఏదైతే వుంటుందో అదంతా కూడా, ఆ ధర్మలోపం అంతా కూడా అధర్మాచరణగా, పాపంగా పరిగణించబడుతుంది. దాని ఫలమేమిటి? అనంటే, ప్రకృతి దాని ఫలాన్ని నీకు ఏదో కష్టం రూపంలో అందించేస్తుంది. ఆరకంగా రెండూ ఖర్చు అయిపోతూనే వుంటాయి.

    కానీ సాధకుడు ఎలా వుండాలయ్యా? అనంటే ఈ పుణ్యపాపములను రెండింటినీ సాక్షిగా చూడగలిగేటటువంటి స్థితిలోకి ఎదగాలి. అలా ఎదిగినవాడు మాత్రమే, ద్వంద్వాతీతము... సుఖదుఃఖాలకు, పుణ్యపాపములకు, రాత్రి పగలుకు అనేక రకములైన ద్వంద్వాలున్నాయి. 

ఇట్లాగ... ఈ రెండు రెండు జ్ఞాన అజ్ఞానములు, వీటన్నిటికీ అతీతంగా వుండేటటువంటి సాక్షిత్వ చైతన్య స్థితిలోకి మానవుడు ఎదగాలి. అలా ఎదగాలి అంటే, క్రతువుల వలన కలిగేటటువంటి, ఇహమందు రాజ్యాధిపత్యము, పరమందు హిరణ్యగర్భ పదవి... ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 51 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 15 🌻*

ఇది, జగత్తే శాశ్వతము. ఈ జగత్తు ఎప్పటికి వుంటుంది. నేను పుట్టక ముందు నుంచీ ఈ జగత్తు వుంది, నేను పోయినాక కూడా ఈ జగత్తు వుంటుంది. కాబట్టి జగత్తు శాశ్వతము - అని నీ జననమరణాల మధ్యలో కనుక నీవు చూచుకున్నట్లయితే జగత్తు శాశ్వత లక్షణంతోనే తోచినట్లుగా కనపడుతుంది. 

అంటే సాపేక్ష పద్ధతిగా చూసినప్పుడు, జగత్తు శాశ్వతముగా నీకంటే ముందు నుంచీ వున్నదిగా, నీ తరువాత కూడా వుంటున్నదిగా కనబడుతున్నప్పటికీ, జగత్తు పరిణామశీలమైనటువంటిది. నిరంతరాయం మార్పు చెందుతూ వున్నటువంటిది. అస్థిరమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మవస్తువును గ్రహించటానికి వస్తునిశ్చయజ్ఞానం అవసరం. 

ఇటువంటి వస్తునిశ్చయజ్ఞానం ఏదైతే వుందో, అట్టి వస్తునిశ్చయజ్ఞానం చేత జగత్తుయొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గుర్తించిన వాళ్ళు ఎవరైతే వున్నారో.... వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతారు.

    కాబట్టి ఇక్కడ నచికేతుడు, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా గుర్తించినటువంటి వాడుగా మనకి యమధర్మరాజు గారు మాట్లాడే సందర్భంలో కనబడుతున్నారు.

 ఇంకేమిటట? సాత్విక కర్మల ప్రభావం చేత కలిగేటటుంవంటి పుణ్యవశం చేత, కొన్ని భోగములు లభిస్తాయి సూక్ష్మశరీరానికి, స్థూలశరీరానికి కూడా! కాబట్టి, అవి ఎటువంటివి అట? క్రతువల వలన కలిగెడి ఫలము ఎంతటి విశాలమైనదైననూ అనేక రకాలైనటువంటి క్రతువులు చేస్తూవుంటాం మానవులం.

    ఆ యా క్రతువుల యొక్క ఫలితములన్నీ దానము, ధర్మము, యజ్ఞము, తీర్థయాత్ర, సాత్విక కర్మాచరణ.... ఇవన్నీ కూడా పుణ్యఫలములన్నమాట. 

ఈ పుణ్యఫలములు అనుభవించేటప్పడు, నీకు ఆ ఐశ్వర్యం సమకూరినట్లు, సుఖభోగాలను అనుభవించినట్లు స్థూలంలో నీకు కనబడుతూ వుంటుంది. ఇంకేమిటి అంటే... అప్పుడు ఆ పుణ్యం ఖర్చు అయిపోతూ వుంటుందన్నమాట. 

అట్లాగే, నీకు దుఃఖ కాలం, కష్టకాలం వచ్చినప్పుడు పాపం అనేటటువంటి కర్మ ఖర్చు అయిపోతూ వుంటుంది. కాబట్టి, తన సుఖమే పుణ్యము, తన దుఃఖమే పాపము. ఇంకా వేరే ఏమీ లేదు. పాపాయ పరపీడనం. వేరే ఏమీ లేదు. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం.

    ఇతరులకు ఉపకారమొనర్చడానికి నువ్వు చేసినటువంటి శ్రమ, శ్రద్ధ, ఇచ్ఛ ఏదైతే వుంటుందో అదంతా పుణ్యఫలంగా మారుతుంది. 

ఇతరులకు నిరసించినటువంటిది, నిందించినటువంటిది, ఆపత్కాలంలో సహాయం చేయనటువంటి ఇతరత్రా సమస్యలు ఏవైతే వుంటాయో, చేయగలిగి వుండి చేయలేనటువంటి ధర్మరీత్యా భంగం ఏదైతే వుంటుందో అదంతా కూడా, ఆ ధర్మలోపం అంతా కూడా అధర్మాచరణగా, పాపంగా పరిగణించబడుతుంది. దాని ఫలమేమిటి? అనంటే, ప్రకృతి దాని ఫలాన్ని నీకు ఏదో కష్టం రూపంలో అందించేస్తుంది. ఆరకంగా రెండూ ఖర్చు అయిపోతూనే వుంటాయి.

    కానీ సాధకుడు ఎలా వుండాలయ్యా? అనంటే ఈ పుణ్యపాపములను రెండింటినీ సాక్షిగా చూడగలిగేటటువంటి స్థితిలోకి ఎదగాలి. అలా ఎదిగినవాడు మాత్రమే, ద్వంద్వాతీతము... సుఖదుఃఖాలకు, పుణ్యపాపములకు, రాత్రి పగలుకు అనేక రకములైన ద్వంద్వాలున్నాయి. 

ఇట్లాగ... ఈ రెండు రెండు జ్ఞాన అజ్ఞానములు, వీటన్నిటికీ అతీతంగా వుండేటటువంటి సాక్షిత్వ చైతన్య స్థితిలోకి మానవుడు ఎదగాలి. అలా ఎదగాలి అంటే, క్రతువుల వలన కలిగేటటువంటి, ఇహమందు రాజ్యాధిపత్యము, పరమందు హిరణ్యగర్భ పదవి... ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 28🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟 *3. మణిపూరక చక్రం: 🌻*

ఇది పసుపు రంగు, క్వాలిటీ - రూపం, అగ్ని - తత్వం, గుణం-రూపం ను కలిగి ఉంటుంది. ఇది బాహ్యం ద్వారా అంతరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శరీర అవయవాలలో... కాలేయం, పాంక్రియాస్ గ్రంధితో, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, అపెండిసైటిస్, పొట్ట భాగంతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ కోశంలో బ్లాక్స్ (శక్తి నిరోధకాలు) ఉంటే వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి.

💫. ఈ చక్రం *"అవమాన భారం"* అనే ఫీలింగ్ ద్వారా బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రంలో ఉన్న శక్తి.. సంకల్పశక్తి ! *"విన్నింగ్ యాటిట్యూడ్"* అంటే గెలవాలి అనే తపన మరి దృఢనిశ్చయం కలిగి ఉంటుంది.

🌷. *లాభాలు:-* 
ఈ చక్రం ద్వారా గౌరవం, చిత్తశుద్ధి మరి మూలశక్తి అయిన సంకల్పశక్తి ఓపెన్ చేయబడతాయి. మన యొక్క శక్తి మనకు తెలుస్తుంది. మనపై మనకు కంట్రోలింగ్ వస్తుంది. ఆత్మగౌరవం పెంపొందించబడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శక్తి మెరుగుపడుతుంది.

🌀. *అండర్ యాక్టివ్ అయితే:-* ధైర్యం లేకపోవడం, వ్యతిరేక భావనలు కలిగి ఉండడం.

🔹. *ఓవర్ యాక్టివ్ అయితే:-* కోపం మరి అహంకారానికి దారి తీస్తుంది.
*"నేను సువర్లోకంతో కనెక్ట్ అయి ఋషిగా ఎదుగుతున్నాను. ప్యాంక్రియాస్ గ్రంధి ద్వారా నేను 3వ స్ట్రాండ్ DNA తో కనెక్ట్ చేయబడి ఉన్నాను."*

*"దీని ద్వారా నేను ఏదైతే మూలం నుండి ఫీల్ అవుతున్నానో(నా వాస్తవానికి నేనే సృష్టికర్తను)దానిని అనుభూతి చెందుతూ మనకు అవసరమైన భౌతిక, ఆధ్యాత్మిక ప్రగతులను సృష్టిస్తున్నాను."*

💠. *సాధన సంకల్పం 1:* 

*"నా మణిపూరక చక్రంలో ఉన్న సరికాని శక్తులు అన్నీ క్లీన్ చేయబడాలి. నాలో అంతర్గతంగా దాగి ఉన్న అవమాన భారం అనే ఫీలింగ్ ని వదిలి వేస్తున్నాను. నేను ఇతరులను అవమానించి ఉంటే అందుకు క్షమాపణ అడుగుతున్నాను. దీనికి సంబంధించిన కర్మల ముద్రలు మూలాలతో సహా నా చైతన్యం నుండి తొలగించబడాలి."*

*సంకల్పం -2:* 

*" 'నా వాస్తవానికి నేనే సృష్టికర్తను' అని మనఃపూర్వకంగా నమ్ముతున్నాను. నేను భౌతికంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానంలో ఉండాలని సంకల్పిస్తున్నాను."*

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 8 / Vishnu Sahasranama Contemplation - 8 🌹* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*8. భూతాత్మా, भूतात्मा, Bhūtātmā*

*ఓం భూతాత్మనే నమః | ॐ भूतात्मने नमः | OM Bhūtātmanē namaḥ*

గదిలో ఉన్న మఠాకాశం కానీ కుండలో ఉన్న ఘఠాకాశము కానీ - వివిధమైన వస్తువులచే పరివేష్టించబడ్డది సర్వవ్యాపకమైన ఆకాశము మాత్రమే. అదే విధముగా అన్ని భూతములలో ఉన్న తేజము కూడా ఆ పరమాత్మయే.

పురుషః స పరః పార్థా భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ॥

ఎవనియందీ ప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో, అట్టి పరమపురుషుడు (పరమాత్మ) అనన్యమగు భక్తిచేతనే పొందబడగలడని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జుననకు అక్షర పరబ్రహ్మయోగములో తెలిపియున్నదానిలో ఈ విషయమే తెలుస్తున్నది.

భగవద్గీతలోని 13వ అధ్యాయమయిన క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమునందు కూడా 'సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరం' - సమస్త ప్రాణులలో సమముగనున్నట్టి పరమేశ్వరుని ఎవడు చూడగలడో వాడే నిజముగ చూచువాడని గీతాచార్యుడు తెలిపిన దానిలో కూడా అన్ని భూతములయందు సమముగా ఉన్న ఆ 'భూతాత్మ' యొక్క వివరణ దొరుకుతుంది.

భూతానాం ఆత్మాః; భూతములకు అంతర్యామి రూపమున ఆత్మగా నుండువాడు; 'ఏష త ఆత్మాంఽతర్యామ్యమృతః' (బృహ - 3.7.3.22) 'ఈతడే నీకు ఆత్మయు అంతర్యామియు అమృత తత్వమును' అను శ్రుతి ఇందులకు పమాణము. ఆయా ప్రాణులయందు తాను ఉండి వానిని తన ఆజ్ఞచే ఆయా వ్యాపారములయందు ప్రవర్తిల్లజేయువాడు; అంతః యమయతి ఇతి అంతర్యామి.


The essence of all beings. He is the in-dweller, Aṃtaryāmin, of all objects individually and collectively. 'Eṣa ta ātm'āntaryāmyamr̥taḥ' - this Thy Ātmā (Soul) is the inner pervader and immortal (Brihadaranyaka Upanishad - 3.7.3.22).

He is the Ātmā of all the beings: The very 'Be' in all the living beings. Just as the same universal space that is present in all rooms as the room-space (Ṃaṭhākāśa), or in all the pots as pot-space (Ghaṭhākāśa), so the infinite life playing through any given vehicle is called the Ātmā of the vehicle. It is well known that space everywhere is one and the same; so too, the one reality sports as though different Ātmās. This One Universal Soul is called the Supreme Brahman (Para Brahman) in Vedanta. In the Bhāgavata, the Lord is addressed as "You are the One Self in all living creatures ever illumining all their experiences."

As per Kathopanishad 'Eko vaśī sarvabhūtāntarātmā rūpaṃ rūpaṃ pratirupo bahiśca' - 'The One enchanting truth that revels in every form manifesting in plurality.'

Samaṃ sarvēṣu bhūtēṣu tiṣṭhantaṃ paramēśvaraṃ,
Vinaśyatsvavinaśyantaṃ yaḥ paśyati sa paśyati.

The 28th stanza of 13th chapter in Bhagavad Gitā also helps understand the divine name 'Bhūtātmā' as 'He sees who sees the supreme Lord as existing equally in all beings and as Imperishable among the perishable.'

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka : 

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥
Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasra Namavali - 10 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - కృత్తిక నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*10. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |*
*అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖*

85) సురేశ: - 
దేవతలకు ప్రభువైనవాడు.  

86) శరణ: - 
దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.  

87) శర్మ - 
పరమానంద స్వరూపుడు.  

88) విశ్వరేతా: - 
సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.  

89) ప్రజాభవ: - 
ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.  

90) అహ: - 
పగలువలె ప్రకాశించు వాడు.  

91) సంవత్సర: -
 కాలస్వరూపుడైనవాడు.  

92) వ్యాళ: - 
పామువలె పట్టశక్యము గానివాడు.  

93) ప్రత్యయ: -
 ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.  

94) సర్వదర్శన: - 
సమస్తమును దర్శించగలవాడు.  

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 10 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*10. sureśaḥ śaraṇaṁ śarma viśvaretāḥ prajābhavaḥ |*
*ahaḥ saṁvatsarō vyālaḥ pratyayassarvadarśanaḥ || 10 ||*

85) Suresha – 
The One Who is the Lord of All Gods

86) Sharanam – 
The Refuge

87) Sharma – 
The Lord Who is Himself Infinite Bliss

88) Vishwareta – 
The Lord Who is the Seed of This Universe

89) Prajhabhava – 
The Lord Who is the Reason for Existence of Human Beings

90) Aha – 
The Lord Who is as Bright as the Day

91) Samvatsara – 
The Lord Who is Personification of the Year

92) Vyala – 
The Lord Who Cannot be Caught Like the Great Serpent

93) Pratyaya – 
The Lord Who is Personification of Knowledge

94) Sarvadarshana – 
The Lord Who Sees (Knows) Everything

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment