🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పిప్పలాద మహర్షి - 10 🌻
59. ఆర్యమతంలో ఈ విషయంలో అందరూ మహర్షులే, అందరూ జ్ఞానులే, అందరూ ముక్తులే కావచ్చుకాని వాళ్ళ బోధలుమాత్రం అనేక రకాలుగా ఉన్నాయి.
60. అందుకనే చిట్టచివరకు హిందూమతంలోని హిందూ ధర్మం అంతాకూడా భాగవతమతం అనేటటువంటి ఒక పెద్దసముద్రంలో చేరింది. సముద్రం ఎటూ ప్రవహించదు. నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరతాయి. కానీ సముద్రం ఎక్కడికి ప్రవహిస్తుంది? అందులోనే అన్ని నదులూ లయిస్తాయి.
61. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, యోగము, సాంఖ్యము అన్నీకూడా భాగవతమతంలో లయించక తప్పదు. చివరకు అదే మనకు గమ్యస్థానమైపోయింది. ఇక్కడినుంచి మళ్ళీ వెనక్కుపోవటం అనేది లేదు.
62. మళ్ళీ సాంఖ్య మతంలోకి వెళ్ళిపోతాము, యోగంలోగి వెళ్ళిపోతాము, మళ్ళి పూర్వమీమాంసకులము అయిపోతాము అని కలలు కనకూడదు. అలా జరగదు. భాగవతమతమే చిట్టచివరి దశ. ఇదే తుదిమెట్టు. మనందరికీ కూడా అదే శరణ్యం. అందులోనే మనం అన్నిటినీ అన్వయించుకోవాలి.
63. అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా, ద్వైతమైనా, ఏదైనాసరే భాగవతమతంలో అన్వయించుకోవచ్చు. నేడు అనేకమంది అదే చేస్తున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
11.Sep.2020
No comments:
Post a Comment