🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 1 🌻
బోధనలు/గ్రంధాలు: నారదభక్తి సూత్రాలు, నారద పురాణం, నారదస్మృతి, జ్యోతిర్నారదము, చతుర్వింశతి, బృహన్నారదము, లఘునారదము
🌻. జ్ఞానం:
1. నారదుడి యొక్క చరిత్రలేని కథకాని, పురాణంకాని, ఆయన పాత్రలేనటువంటి గాథకాని లేదు మనకు. ఈ మహర్షులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు. భౌతికమయిన జగత్తుకు కారణములు మాత్రమే సృష్టించాడు బ్రహ్మ; అంటే పంచభూతములను మాత్రమే సృష్టించాడు.
2. దానిలోని మూలపదార్థాలు అనదగిన అహంకారము, బుద్ధి, మనస్సు, చిత్తము, ఇంద్రియములు (సాంఖ్యములో చెప్పబడినటువంటి పంచభూతములు, మనసు, బుద్ధి, చిత్తము, స్థూలమైన ఇంద్రియములు) – ఇట్లాంటివన్నీ సృష్టించాడు. ‘అహం’ అనే వస్తువుకూడా ఆయన సృష్టించాడు .
3. వాటికి కారణభూతమైనటువంటి, అవి తాము కాని మహర్షులను కూడా ఆయన సృష్టించాడు. వాళ్ళను బ్రహ్మర్షులు అంటారు. మానవమాత్రులే జ్ఞానం చేత బ్రహ్మర్షిపదం పొందవచ్చు. అలాకాక, బ్రహ్మ నుంచీ సహజంగా పుట్టిన బ్రహ్మర్షులు వీరు.
4. ఈ విధంగా సృష్టియొక్క కార్యక్రమాన్ని నడిపించడం కోసమని మౌలికమైన పదార్థములను సృష్టించిన బ్రహ్మకు ‘కార్యబ్రహ్మ’ అని పేరు.
5. సృష్టికార్యానికి మౌలికమయిన తత్త్వమును-పదార్హమును-మాత్రం సృష్టించటంచేత, మరి ఆ తర్వాత-జీవకోటి ఎట్లాఉండాలి? ఏరూపంలో ఉండాలి? వాళ్ళ మనోబుద్ధులు ఎట్లా పనిచెయ్యాలి? వాళ్ళకు కర్మమార్గము, జ్ఞానమార్గము ఏ విధములుగా ఉండాలి? అట్టి జీవుల సృష్టికోసం పుట్టిన వారు ‘ప్రజాపతులు’.
6. మహర్షులు ఆ ప్రకారంగా బ్రహ్మచేత సృష్టించబడ్డారు. అదికూడా సృష్టి ప్రారంభమైన తరువాత, ఆ జీవకోటికి సత్యాసత్య విధానాలన్నీ బోధించడానికి వారు సృష్టిచేయబడ్డారు.
7. కేవలం కర్మాధీనులుగా జీవులను అంధకార్మలో వదిలేస్తే, వాళ్ళకు ముక్తిమార్గం ఎవరు చూపించాలి? వాళ్ళు కర్మాధీనులై ఉంటారు. బుద్ధి మళ్ళీ కర్మాధీనమై ఉంటుంది. ఈ అనంతమైనటువంటి బుద్ధికర్మల యొక్క ఈ ఆటలో వాళ్ళు తగులుకుంటే, వాళ్ళు ఏనాటికి ముక్తి పొందుతారు? ఆ కారణాలవల్ల మహర్షులను సృష్టించాడు బ్రహ్మదేవుడు.
8. పంచబ్రహ్మ సిద్ధాంతమని ఇకటుంది. నిర్గుణమయిన ఒక పదార్థము, ఒక వస్తువు-సదాశివతత్త్వమనిగాని, నిర్గుణబ్రహ్మవస్తువనిగాని అనుకోవచ్చు దాన్ని. అది ఒకటే ఉంది. దాని నుంచి మొట్టమొడటిసారిగా రెండు పుట్టాయి.
9. ప్రకృతి-పురుషుల యొక్క రెండు తత్త్వములు పుట్టాయి. ఆ ప్రకృతి-పురుషుల తత్త్వమందు కామము – కోరిక – అనేది పుట్టింది. కామము అంటే సృష్టి అన్నమాట. సృష్టిస్తాననే కోరికే సంకల్పం; అది పుట్టింది. ఆ కోరికకు కారణం – పూర్వసృష్టి ఒకటి ఉండేది;
10. ఇప్పుడు అది నశించి సూక్ష్మరూపంలో బ్రహ్మయందు లయించి ఉన్నది. దాని యొక్క పునరుత్పత్తికి (వర్తమానసృష్టికి) ఈ రెండు వస్తువులూ (ప్రకృతి-పురుషుడు) హేతువులు. ఈ మిధునాన్ని రెండవబ్రహ్మగా చెప్పుతున్నారు. కామేశ్వరి-కామేశ్వర మిధునం అని దానికి పేరు. రెండూ కలిపి రెండవబ్రహ్మ.
11. దానినుంచి, హేతువైనటువంటి సంకల్పం, పూర్వసృష్టి యొక్క విజ్ఞానం అంతా కలిగిన వాడు – తన సృష్టిరూప జ్ఞానమేదో తెలుసుకున్నాడు – బ్రహ్మ యొక్క పరిజ్ఞానమంతా తెలిసినవాడు – భవిష్యత్కాలాన్ని శాసించ గలిగలిగిన వాడు – ఇన్ని విశేషములు (షడైశ్వర్యములని ఈశ్వరునియందు చెప్పబడియున్నవన్నీ) అన్నీ కలిగిన వాడైన విష్ణువు మూడవబ్రహ్మగా అవతరించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
05 Oct 2020
No comments:
Post a Comment