🌹. శివగీత - 83 / The Siva-Gita - 83 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
దశమాధ్యాయము
🌻. జీవ స్వరూప నిరూపణము - 9 🌻
కర్మోద్భా విత సంస్కార - స్తత్ర స్వప్నరిరంసయా |
అవస్థాంచ ప్రయాత్యన్యాం - మాయావీ వాత్మమాయయా 41
ఘటాది విషయాన్సర్వా - న్బుద్ద్యా దికరణానిచ |
భూతాని కర్మవశతో - వాసనామాత్ర సంస్థితాన్ 42
ఏతాన్పశ్య న్స్వయం జ్యోతి - స్సాక్ష్యాత్మా వ్యవ తిష్ఠతే |
ఆత్రంతః కరదీనాం వాసనాద్వా సనాత్మతా 43
వాసనామాత్ర సాక్షిత్వం - తేన తత్ర పరాత్మనః |
వాసనాభిః ప్రపంచోత్ర - దృశ్యతే కర్మచోదితః 44
జాగ్రద్భూమౌ యథా తద్వ - త్కర్త్ర కర్మ క్రియాత్మకః
నిశ్మేష బుద్ధి సాక్ష్యాత్మా - స్వయమేవ ప్రకాశతే |
వాసనామాత్ర సాక్షిత్వం - సాక్షిణ స్స్వా ఉచ్యతే 45
జీవునకు జాగ్రదవస్థలో (సుఖ) భోగములనను భవించు కర్మ నశించినందుకు స్థూలదేహమును బాహ్యేంద్రి య వృత్తి నుండి వెనుదిరిగి స్వప్నావ స్థబొంది పూర్వకర్మ సంస్కారములతో స్వప్న భోగములు ననుభవించ వలెన నెడి కోరికతో మాయావి తన మాయ చేత అనేక రపములను ధరించునట్టు ఒక అవస్థ నుండి మరో అవస్థను బొందును.
జీవుడు వాసనా (బలము) మాత్రూపముతో నన్ను ఘటాది సమస్త విషయములను, బుద్ధి మొదలగు కరణములను, పృథ్వీ వ్యాది భూత పంచకములను జూచి స్వయంజ్యోతి స్వరూపంబైన ఈ యత్మ సాక్షి మాత్రముగనే యుండును. ఇందులో అంతః కరణాదుల యొక్క వాసన వలన జీవునకు శాసనాత్మకత సిద్ధించును. అంతః కారణాదులందు
వాసనలుండుట వలన వాటి సాక్షిత్వము పరమాత్మలో సిద్ధించును. వాసనల ప్రభావముచే తనే కర్మ ప్రేరితమైన ప్రపంచము కర్త - కర్మ క్రియాత్మకముగానే అగుపడును.
సమస్త బుద్ధి కృత వ్యాపారములకు ఆత్మ సాక్షి భూతమై స్వయముగానే ప్రకాశించును. సమస్త వాసనలకు సాక్షిగా నుండుట వలన స్వాపమని యందురు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 83 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam - 9 🌻
For the Jiva, in the wakeful state when the enjoyments of Karmas decline, moving away from the gross body and outside indiriyas (organs), it reaches the swapnavastha (dream state) and with desire of enjoying the karmas in dreams, as like as a magician assumes various forms, this Jiva transitions from one state to another.
Jiva remains entangled with Vasanas (desires), but the selfilluminating Atman always remains untouched with them.
Due to the Vasanas of the Antahkarana, Jiva becomes bound. Due to the existence of Vasanas of the Antahkarana the Paramatma remains as their witnesser.
Because of the existence of Vasanas, this entire universe which is supported (and originates) on the basis of Karmas gets projected.
Like the wakeful state, in the dream state also this universe which is of the form of Vasanas appears as the doertaskaction.
Atman remains as the witness of all the actions performed by the mind and remains as self illuminating power.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
05 Oct 2020
No comments:
Post a Comment