శ్రీ విష్ణు సహస్ర నామములు - 29 / Sri Vishnu Sahasra Namavali - 29


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 29 / Sri Vishnu Sahasra Namavali - 29 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి - పుష్యమి నక్షత్రం 1వ పాద శ్లోకం

🌻 29. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ‖ 29 ‖

🍀. సుభుజః ---
అందమైన భుజములు గలవాడు; జగద్రక్షకుడు, భక్త వరదుడు. (ఇందరికి నభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి)

🍀. దుర్ధరః ---
ఎవరిచేతను ఆపబడజాలని భుజబలము కలవాడు (ఎదురు లేనివాడు) ; తెలిసికొనుటకు అందనివాడు (తెలియరాని వాడు) ; మనసులో నిలుపుకొనుటకు కష్టమైనవాడు (నిలువరాని వాడు) ; మరి దేనిచేతను ధరింపజాలనివాడు (భరింపరానివాడు)

🍀. వాగ్మీ ---
మధురమైన, ప్రియమైన, స్తుతింపదగిన వాక్కుగలవాడు; శక్తిపూరితమైన వాక్కు గలవాడు; వేదములు ఆయన వాక్కునుండి ఉద్భవించెను.

🍀. మహేంద్రః ---
మహత్తరమగు, అనన్యమగు ఈశ్వర్యము గలవాడు, సిరిగలవాడు; ఇంద్రునకును, దేవతలకును దేవుడు; అన్ని వెలుగులకు మూలము.

🍀. వసుదః ---
సంపదల నిచ్చువాడు; భక్తుల అవసరములకు సకాలములో షడ్గుణైశ్వర్య సంపదలనే ధనము నిచ్చువాడు.

🍀. వసుః ---
తాను ఇచ్చు ధనము కూడా తానే ఐనవాడు; జ్ఞానులైనవారు కాంక్షించు సంపద వాసుదేవుడే (ముంగిట నల్లదివో మూలనున్న ధనము).

🍀. నైకరూపః ---
అనేక రూపములతో వెలయు విశ్వరూపుడు; ఒక రూపము అనికాక అనేక అవతారములు గలవాడు; (అన్ని రూపములు నీ రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు).

🍀. బృహద్రూపః ---
మహాద్భుతమైన పెద్ద రూపము గలవాడు; వరాహ, నారసింహ, త్రివిక్రమ వంటి బ్రహ్మాండ స్వరూపములు గలవాడు.

🍀. శిపివిష్టః ---
కిరణముల స్వరూపమున అంతటా వ్యాపించియున్నవాడు; యజ్ఞపశువునందు ఆవహించియున్నవాడు.

🍀. ప్రకాశనః ---
తన విశ్వ రూపమును దర్శించు భాగ్యము భక్తులకు ప్రసాదించువాడు; సమస్తమును ప్రకాశింప జేయువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Vishnu Sahasra Namavali - 29   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Karkataka Rasi, Pushyami 1st Padam

🌻 29. subhujō durdharō vāgmī mahendrō vasudō vasuḥ |
naikarūpō bṛhadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ || 29 ||

🌷 Subhujaḥ:
One possessing excellent arms that protect the worlds.

🌷 Durdharaḥ:
One who holds up the universe – a work which none else can do.

🌷 Vāgmi:
One from whom the words constituting the Veda come out.

🌷 Mahendraḥ:
The great Lord, that is, the Supreme Being, who is the God of all gods.

🌷 Vasudaḥ:
One who bestows riches.

🌷 Vasuḥ:
One who is himself the Vasu.

🌷 Naikarūpaḥ:
One who is without an exclusive form.

🌷 Bṛhadrūpaḥ:
One who has adopted mysterious forms like that of a Boar.

🌷 Śipiviṣṭaḥ:
Shipi means cow. One who resides in cows as Yajna.

🌷 Prakāśanaḥ:
One who illumines everthing.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



05 Oct 2020


No comments:

Post a Comment