శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 19, 20 / Sri Lalitha Chaitanya Vijnanam - 19 and 20

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 13 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 19, 20 / Sri Lalitha Chaitanya Vijnanam - 19 and 20 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

7. నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత

తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర

🌻 19. 'నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా' 🌻

చంపక పుష్పమనగా సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికతో అమ్మవారు విరాజిల్లుతూ యున్నది అని భావము.

అది కూడా నవచంపక మగుటచే అనగా అప్పుడే వికసించిన సంపెంగ పువ్వని విశేషార్థము. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు ఎట్లుండును? అను విషయముపైన భక్తుడు లోతుగ భావన చేయవలెను. అట్టి పువ్వు అత్యంత మృదువుగ నుండును. కాంతివంతముగ నుండును. అద్భుతమైన పరిమళములను వెదజల్లుతూ యుండును.

పరిమళము నామ్రాణించు ఇంద్రియము నాసిక. అమ్మ నాసిక పరిమళ స్వరూపమేయని తెలియవలెను. అంతియే కాదు, పరిమళ పూరితమగు సంపెంగ పువ్వును చూచినప్పుడు నిజమైన భక్తునకు అమ్మ నాసిక దర్శనమీయ వలెను.

అమ్మ నాసికను చూచుటకు వెట్టి ఆవేశమును పొందుటకన్నా- సంపెంగ పువ్వును చూసినపుడు అమ్మ నాసికను దర్శించుట సత్వగుణ భక్తి.

ఈ భావముచే ఋషి మనకు నాసికా దర్శనము చేయించు చున్నాడు. అట్టి భావన ప్రాతిపదికగా సంపెంగపువ్వు పరిమళమును ఆమ్రా ణించు భక్తునకు తాదాత్మ్య స్థితి అప్రయత్నముగ కలుగును.

సృష్టియందలి సుగంధమును ఆస్వాదించు స్వభావము గల జీవుని నాసిక యందు కూడ అమ్మయే ప్రతిష్ఠితయై యున్నది అని కూడ భావన చేయవచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 19 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 19. Navacampaka- puṣpābha- nāsadaṇḍa- virājitā नवचम्पक-पुष्पाभ-नासदण्ड-विराजिता (19) 🌻

Her nose resembles like a newly blossomed champaka flower.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀 🍀 🍀 🍀 🍀



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 20 / Sri Lalitha Chaitanya Vijnanam - 20 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 😘

7. నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత

తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర

🌻 20. 'తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా' 🌻

తారల కాంతినికూడా తిరస్కరించ గలిగిన ప్రభగల ముక్కుపుడక కలిగినది అని భావము.

తారలకు కాంతి నందించెడిది. అమ్మయే కదా! సమస్త

సృష్టియందు గోచరించు వెలుగు అమ్మయే. ఆమె ధరించిన బులాకీ కాంతిని ఈ నామమున ప్రశంస చేయుట జరుగుచున్నది. అత్యంత కాంతివంతమైన నాసికాభరణమును వర్ణించుటలో సాధకుని దృష్టి కాంతిపుంజములపై ప్రసరించును.

కనులు మూసుకొని ధగధ్ధగాయ మానమైన ఒక 'రవ్వ'ను ధ్యానింపుడు. అది మీ భ్రూమధ్యమున మెఱపు వలె ప్రకాశించి మిమ్ముల నుద్ధరింపజేయును. శ్రద్ధాభక్తులతో నామము నారాధించు భక్తునకు యిట్టి దర్శనము సహజము.

కాంతి, ప్రకాశవంతమైన ఒక బిందువు వలె గోచరించి అంతవరకూ చర్మ చక్షువులతో దర్శించిన తారాకాంతులను ధిక్కరించగల దర్శనము జరుగగలదు. బిందుకళా దర్శన మిట్లే యగును. అది తెలిసినవారే యిట్టి నామములను కూర్పగలరు. ధ్యానమున, అమ్మ నాసికాభరణ మిట్టి దర్శన భాగ్యము కలిగించగలదు.

'తారా' యనగా మంగళుడు, శుక్రుడు అను దేవతలు. లేక కుజ, శుక్ర నక్షత్రములు. ఈ నక్షత్రముల కాంతిని కూడా తిరస్కరింపజేయు ప్రభావము కలది అమ్మ నాసికాభరణము.

అనగా భక్తుని యందు ఒకవేళ కుజ, శుక్ర దోషములున్ననూ, తత్ప్రభావమును నిర్వీర్యము చేయగల శక్తి ఈ నామమును మంత్రముగ జపించినవారి కేర్పడును.

అమ్మను శ్రద్ధాభక్తులతో పూజించువారిని ఏ గ్రహ దోషమూ అంటదు.

అందు కుజ, శుక్ర దోషములు యిచట ప్రత్యేకముగా తెలుపబడు చున్నవని కూడ అర్థము చేసుకొనవలెను. భారతీయ వాజ్మయమున యిట్టి క్షేమమును, రక్షణమునూ ఋషు లేర్పరచినారు. అట్టి ఋషుల ఋణము ఎప్పటికినీ తీర్చలేము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 20  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 20. Tārākānti- tiraskāri- nāsabharaṇa- bhāsurā ताराकान्ति-तिरस्कारि-नासभरण-भासुरा (20) 🌻

She is wearing a nose stud that outshines the stars. Her nose stud is made up of rubies and pearls. Tārā means stars Tārā also means two goddesses Maṅgalā and Śuklā.

Śuklā has later come to be known as Śukrā. Possibly these Maṅgalā and Śukrā could mean the two planets Mars and Venus. Each planet governs certain precious stones.

Planet Mars rules ruby that is red in colour and Venus rules diamond (Mani Mālā II.79). It can also be said that these two planets adorn Her nose.

This also indicates that worshipping Her wards off the evil effects of planets.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020


No comments:

Post a Comment