18-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 153🌹  
11) 🌹. శివ మహా పురాణము - 351🌹 
12) 🌹 Light On The Path - 104🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236🌹 
14) 🌹 Seeds Of Consciousness - 300🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 175 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 31 / Lalitha Sahasra Namavali - 31🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasranama - 31🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -153 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 5

*🍀 5 - 1. ఆత్మోద్ధరణ - తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును. తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు. మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు. 🍀*

ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5

తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును. 

తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు.

మొదటిది మనయందలి దైవము. ఆ ప్రజ్ఞ మనయందు త్రిగుణములను దాటి యుండును. రెండవది మనిషి తానొకడు వేరుగ నున్నాడని భావించుట. 

గోధుమపిండియే చపాతీగ యున్నట్లు ఈ స్థితిని భావించవచ్చును. అనగా రెండవ స్థితి మొత్తము నుండి ప్రత్యేకముగ ఏర్పడిన స్థితి. ఇది త్రిగుణముల కీవలయుండును. 

మొదటి ప్రజ్ఞ మనయందలి దైవము కాగ, రెండవ ప్రజ్ఞ “మనము” అని మనను గూర్చి మనము భావించుచున్న తెలివి, మొత్తము నుండి త్రిగుణముల ద్వారా ప్రత్యేకముగ నేర్పడినవి. అందువలన ఈ రెండవ స్థితిని “ప్రత్యగాత్మ” అని కూడ అందురు. 

మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు. 

మొదటి ప్రజ్ఞ మంచి నీరువలె భావించినచో, రెండవ ప్రజ్ఞ అందు తేలుచున్న మంచుగడ్డ యని భావింపవచ్చును. మంచినీరే మంచుగడ్డ అయినది. పరమాత్మయే ప్రత్యగాత్మ అయినది. ఈ మార్పు త్రిగుణముల ద్వారా జరుగుట వలన జీవాత్మపై త్రిగుణముల ప్రభావముండును. 

నీరే మంచుగడ్డ అయినప్పటికిని, మంచుగడ్డకు కొన్ని క్రొత్త గుణములు వచ్చును. అమితమగు శీతలత్వము, పగిలిపోవుట, గట్టిపడుట, ఎవరి పైనను విసిరినచో వారికి కొద్దిగ దెబ్బతగులుట యుండును. మంచి నీటికి లేని గుణములు మంచుగడ్డకు ఏర్పడినవి. అట్లే దైవమునకు లేని గుణములు జీవున కేర్పడినవి. ఒక నూతన స్వభావ మేర్పడును. 

గుణముల సమ్మిశ్రమమును బట్టి అనేకములగు స్వభావములు గోచరించు చుండును. తన స్వభావము కన్న తాను వేరుగ బుద్ధిమంతు డగువాడు చూచుకొనవచ్చును. తాను, తన స్వభావముగ తనని తాను విడమర్చుకొన వచ్చును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 352 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
90. అధ్యాయము - 02

*🌻. సనత్కుమారుని శాపము - 2 🌻*

సనత్కుమారుడిట్లు పలికెను

మీరు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు మూర్ఖులు. మీలో యోగ్యమగు జ్ఞానము లేదు. మీరు పితృదేవతల కుమర్తెలే అయినా, మీకు వేదతాత్పర్యము ఎరుక లేదనుట నిశ్చయము(20) మీరు గర్వముచే లేచి నిలబడలేదు. మాకు నమస్కరించలేదు. కావున, మోహితులైన మీరు మానవ శరీరమును పొంది స్వర్గమునకు దూరమగుదురు గాక!(21) జ్ఞానమునుండి వంచితులైన మీరు ముగ్గురు కూడ మానవస్త్రీలై జన్మించెదరు గాక! మీరు చేసుకొన్న కర్మయొక్క ప్రభావము వలననే మీకిట్టి ఫలము లభించుచున్నది(22)

బ్రహ్మ ఇట్లు పలికెను-

జ్ఞానమునుండి వంచితులైన వారు, మిక్కిలి భయపడినవారు, తలవంచుకున్న వారు అగు ఆ ముగ్గురు ఈ మాటలను విని, ఆయన పాదములపై బడి ఇట్లు పలికిరి(23)

పితృదేవతలు ఇట్లు పలికిరి

ఓ మహర్షీ! నీవు దయా సముద్రుడవు. నీవిపుడు ప్రసన్నుడవు కమ్ము. మూర్ఖులమగు మేము నీకు నమస్కరించకపోతిమి. దానికి కారమణము అనాదర భావన కాదు (24) హే విప్రా! మా తప్పునకు ఫలమును మేము పొందితిమి. ఓ మహర్షీ! దీనియందు నీ దోషము లేదు కాని మేము మరల స్వర్గ నివాసమును పొందునట్లు మమ్ములను అనుగ్రహించుము(25)

బ్రహ్మ ఇట్లు పలికెను

వత్సా! అపుడా మహర్షీ ఆ మాటను విని ప్రసన్నుమగు అంతఃకరణము గలవాడై, శివుని మాయచే ప్రేరేపింపబడి శాపము నుండి ఉద్ధారమును ఇట్లు చెప్పెను(26)

సనత్కుమారుడిట్లు పలికెను

పితృదేవతల ముగ్గురు కుమర్తెలారా| వినుడు మనస్సులో ప్రీతిని చెందుడు. నా మాట మీకు సర్వదా శోకములను పోగొట్టి సుఖముల నీయగలదు(27) మీలో జ్యేష్ఠురాలు విష్ణువు యొక్క అంశ##మైన హిమవత్పర్వతుని బార్యయగు గాక| వారికి పార్వతియను కన్య ఉదయించగలదు(28). 

మీలో రెండవది, యోగ సంపన్నురాలు అగు ధన్య జనకునకు ప్రియురాలు కాగలదు. వారికి సీత యను పేర మహాలక్ష్మి కుమార్తె కాగలదు(29) కనిష్ఠురాలగు వృషభానుడగు వైశ్యునకు పత్ని కాగలదు. ద్వాపర యుగాంతమునందు వారికి రాధయను కుమార్తె కలుగును(30)

యోగిని యగు మేనక పార్వతి యొక్కక వరముచే భర్తతో గూడి ఆ దేహముతో పరమపదమగు కైలాసమును పొందగలదు(31) జనక వంశములో పుట్టినవాడు,జీవన్ముక్తుడు, మహాయోగి అగు సీరధ్వజుడు మరియు ఆతని పత్ని యగు ధన్య సీతాదేవితో గూడి వైకుంఠమును పొందగలరు(32). 

వృషభానుని వివాహమాడిన కలావతి జీవన్ముక్తురాలై తమ కుమార్తెయగు రాధతో గూడి గోలోకమును పొందగలదనుటలో సంశయము లేదు(33). కష్టములను పడని వారికి ఎవ్వరికైననూ ఎక్కడనైనూ అభ్యున్నతి లేదు. పుణ్యమును చేయు వారికి దుఃఖము దూరముకాగానే దుర్లభమగు సుఖము లభించును(34).

పితృదేవతల కుమార్తెలగు మీరు ముగ్గురు స్వర్గము యొక్క విలాసము గలవారు. విష్ణువును దర్శించుట వలన మీకు కర్మక్షయమైనది(35) ఇట్లు పలికి తొలగిన క్రోథము గల ఆ మహర్షి జ్ఞానమును, భుక్తిని, ముక్తిని ఇచ్చే శివుని మనస్సులో స్మరించి ఇంకనూ ఇట్లు పలికెను(36) 

నేను సదా సుఖమును ఇచ్చే మరియొక మాటను చెప్పెదను. ప్రీతితో వినుడు శివుని ప్రీతికి పాత్రులగు మీరు ధన్యులు, ఆదరణీయులు, మరియు అత్యంత పూజనీయులు(37) మేన యొక్క కుమార్తెయగు పార్వతీ దేవి దుష్కరమగు తపస్సును చేసి, శివుని ప్రియురాలైన జగన్మాత కాగలదు(38)

ధన్య యొక్క కుమార్తె సీతయను పేర రామునకు భార్యయై, లోకాచారముననుసరించి రామునితో గూడి విహరించగలదు(39). కలావతి యొక్క కుమార్తెయగు రాధ కృష్ణుని యందు రహస్య ప్రేమ పూర్ణమగు జీవితమమును గడిపి గోలోకమును పొంది కృష్ణపత్ని కాగలదు(40) 

బ్రహ్మ ఇట్లు పలికెను-

పరమ పూజనీయుడు, సోదరుడుతో గూడి సర్వులచే స్తుతింపబడు వాడునగు, సనత్కుమార మహర్షి ఇట్లు పలికి అచటనే అంతర్థానమయ్యెను (41). వత్సా! పితృదేవతల మానస పుత్రికలగు ఆ ముగ్గురు సోదరీమణులు తొలగిన దుఃఖమనే పాపము గలవారై సుఖమును పొంది వెనువెంటనే తమ ధామమును పొందిరి(42)

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతి ఖండలో పూర్వగతి వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది(2)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 104 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 15th RULE
*🌻 17. Seek out the way - 6 🌻*

400. Whenever a higher level of consciousness is reached, our view of the world is so much widened that it becomes an entirely new thing to us. When we reach Adeptship we shall have an immeasurably wider horizon. 

We shall understand exactly what we are doing because we shall be able to see the solar system as does its Maker, from above, instead of from below: we shall seethe pattern that is being woven, and what it all means. 

Every additional step, every extension of consciousness brings us nearer to seeing the meaning of everything, so as we go on we become less and less likely to make mistakes and to misunderstand, but the perfect knowledge can only be that of the Adept, whose consciousness has become one with that of the Logos of the system, even though it be only as yet in one of His lower manifestations.

401. In any case, that choice is in the hands of the Monad, so we certainly need not trouble ourselves about it now. There is always a possibility that the Monad may have decided all that even now, and when such a choice is made the lower representatives or parts of him will .imply fall into their place when the time comes, whatever ideas they may previously have been forming. All that is important for us to put before the personality now with regard to such choice is the idea of service. 

It we can get it to understand that idea of always watching to serve it will very readily become a perfect channel for the ego and that will influence the individuality in turn to be a perfect channel or instrument for the Monad. Service is the highest ideal in life; did not the Christ Himself say: “Whosoever will be chief among you, let him be your servant.”?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దేవలమహర్షి - 7 🌻*

36. ఆ రెండు ఫలాలనూ మాత్రమే కోరినట్లయితే, మోహంలేని సంసారయాత్ర చేయవచ్చు. నిజానికి ఏ వస్తువులో మాత్రం ఏమి దోషముంది? మోహమనే దోషం మన బుద్ధిలోనే ఉంది. భార్యలోనో, సంతానంలోనో ఏమి దోషముంది? 

37. మనను పీడిస్తున్నది మన బుద్ధిలోని దోషమే. అది వారి యందలి మోహమే. మనమేలా ఉండాలో అలా ఉండ గలిగితే, సంసారబంధాలు మనకు ఉపకారమే చేస్తాయి. సేవ చేస్తాయి, వెళ్ళిపోతాయి. మనం కూడా చివరకు బంధనం లేకుండా వెళ్ళిపోతాము.

38. నారదమహర్షి దేవలుదికి అనేక ధర్మాలు చెప్పాడు. “జీవుడు ఎవ్వరి వాడూ కాదు. నాది అనే వస్తువు ఏదీ ఈ ప్రపంచంలో జీవుడికి లేదు. 

39. ఇతర జీవులు కాని, ఇతర పదార్థములు కాని తనవి కావు. తనకు ఏ సంబంధమూ లేదు.ఒక్కడే ఉంటాడు. తన దేహంద్వారా సుఖదుఃఖాలను తానే సృష్టించుకుంటూ, పునర్జన్మకై తానే కర్మచేసుకుంటూ ఉంటాడు. 

40. అనేక పుణ్యపాప కర్మల వలన వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించటంతో నశించి, తాను బ్రహ్మమయుడై పోతున్నాడు. దానినే మోక్షం అంటారు. 

41. పుణ్యపాపకర్మల వినాసనమునకు జ్ఞానమే కారణమౌతోంది. జ్ఞానమనే కుఠారంతో(గొడ్డలితో) పుణ్యపాపకర్మలచే నిర్మితమైన సంసారమనే వృక్షాన్ని ఛేదించు. ఇదే సాంఖ్యమతం. 

42. పుణ్యపాప కర్మల మూలాన్ని ఛేదిస్తే, జీవుడు బ్రహ్మీభావం పొందడమనేది సహజంగా జరిగిపోతుంది. దానిని ఎవరూ ప్రత్యేకంగా కోరుకోనవసంలేదు. విజ్ఞానులు దీనిని ఇలా అర్థంచేసుకుంటున్నారూ అని నారదమహర్షి బోధించాడు.

43. మహర్షులు ఆత్మజ్ఞానులు, ఆప్తకాములు. మోక్షం పొందినవారు. శరీరం ఉన్నతరువాత ఏంచేసినా కర్మ ఏర్పడి, కర్మలోంచి ఫలంపుట్టి, దాని ఫలితంగా మరొకజన్మ ఎత్తవలసి వస్తుంది కనుక; అలా కాక, శరీరానికి తపస్సు తప్ప మరొక కర్తవ్యం ఏదీ లేకుండా వారు ఉంటారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 300 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 149. You must fulfill the vow that I am not the body but the indwelling principle 'I am' only. 🌻*

In order to understand the true import of whatever has been said so far you must have the certitude that I am not the body but the knowledge 'I am' only. In order to have this certitude, you have to meditate on the knowledge 'I am' for a reasonable amount of time. 

Doing away with the awareness of the body and getting completely engulfed by the knowledge 'I am' is the first and the last thing to be done, the only vow to be fulfilled. You can say it is the practice of being in the 'Turiya' or the fourth state at all times.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 175 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 13 🌻*

667. ఒక మానవుని తనవలెనే పరిపూర్ణుని చేయుటయే సద్గురువు చేయు ఘనమైన లీల.

668. ఏకకాలమందే, ఆత్మ చైతన్యమును + సృష్టి చైతన్యమును కలవాడై, సచ్చిదానంద స్థితిని ఎఱుకతో అనుభవించుటయే గాక దానిని పరులకై వినియోగించును. ఇది సద్గురువు లేక, అవతారపురుషుని స్థితి.
లిప్తకాలములో భౌతిక చైతన్యముగల సామాన్య మానవుని, ఆత్మచైతన్యముగల భగవంతుని చేయగల సర్వ సమర్దుడతను. 

669. ప్రతియుంగమందును ఎల్లకాలమూలందును ఉన్నట్టి పంచ సద్గురువులు అఖిల విశ్వమును పాలింతురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 31 / Sri Lalita Sahasranamavali - Meaning -31 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 31. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |*
*భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ‖ 31 ‖ 🍀*

78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - 
మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.

79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - 
రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 31 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 31. mahāgaṇeśa-nirbhinna-vighnayantra-praharṣitā |*
*bhaṇḍāsurendra-nirmukta-śastra-pratyastra-varṣiṇī || 31 || 🌻*

78 ) Mahaganesha nirbhinna vignayanthra praharshitha -   
She who became happy at seeing Lord Ganesha destroy the Vigna Yanthra (contraption meant to delay ) created by Vishuka

79 ) Banda surendra nirmuktha sashtra prathyasthra varshani -   
She who rained arrows and replied with arrows against Bandasura

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasra Namavali - 31 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి - పుష్యమి నక్షత్ర 3 పాద శ్లోకం*

*🌻 31. అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |*
*ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ‖ 31 ‖ 🌻*

🍀 283. అమృతాంశూద్భవః --- 
అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు. 

🍀 284. భానుః --- 
ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు. 

🍀 285. శశబిందుః --- 
దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు. 

🍀 286. సురేశ్వరః --- 
దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ. 

🍀 287. ఔషధం --- 
భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!) 

🍀 288. జగతస్సేతుః --- 
మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు.. 

🍀 289. సత్యధర్మపరాక్రమః 
సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 31 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Karkataka Rasi, Pushyami 3rd Padam*

*🌻 13. amṛtāṁśūdbhavō bhānuḥ śaśabinduḥ sureśvaraḥ |*
*auṣadhaṁ jagataḥ setuḥ satyadharmaparākramaḥ || 31 ||*

🌻 283. Amṛtāṁśūdbhavaḥ: 
The Paramatman from whom Amrutamshu or the Moon originated at the time of the churning of the Milk-ocean.

🌻 284. Bhānuḥ: 
One who shines.

🌻 285. Śaśabinduḥ:
 The word means one who has the mark of the hare, that is the Moon.

🌻 286. Sureśvaraḥ: 
One who is the Lord of all Devas and those who do good.

🌻 287. Auṣadham: 
One who is the Aushadha or medicine for the great disease of Samsara.

🌻 288. Jagataḥ setuḥ: 
One who is the aid to go across the ocean of Samsara.

🌻 289. Satya-dharma-parākramaḥ: 
One whose excellences like righteousness, omniscience, puissance, etc. are all true.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


No comments:

Post a Comment