శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 213 / Sri Lalitha Chaitanya Vijnanam - 213


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 213 / Sri Lalitha Chaitanya Vijnanam - 213 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖


🌻 213. 'మహాపూజ్యా' 🌻

విస్తారముగ పూజింపబడునది కనుక మహాపూజ్యా అను నామము కలిగినది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుబేరుడు, విశ్వేదేవతలు, వాయువు, వసువు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, రాక్షసులు, పిశాచములు సైతము శ్రీమాతను నిత్యము పూజింతురు.

శ్రీమాత అనుగ్రహముననే లోకపాలకులు శక్తిమంతులై వారి వారి కార్యములను చక్కబెట్టుచున్నారు. సృష్టి చైతన్యము ఆమెయే గనుక ఆమెను పూజించుట వలననే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు వృద్ధి చెందగలవు. పూజించదగిన పూజ్యులందరూ కూడ శ్రీమాతను పూజింతురు గనుక ఆమె మహా పూజ్య.

శ్రీమాతను యంత్ర రూపమున, శిలా రూపమున, ఇంద్రనీల రూపమున, బంగారు రూపమున, వెండి రూపమున, ఇత్తడి రూపమున, కంచు రూపమున, లోహ రూపమున, సీసము రూపమున, స్ఫటిక రూపమున, మాణిక్య రూపమున, వజ్ర రూపమున, వైడూర్య రూపమున నేర్పరుచుకొని పూజించదగునని దేవీ భాగవతము తెలుపుచున్నది. ప్రతిమ ఏ పదార్థముతో చేయబడిన దైనను భక్తి ప్రధానమని తెలియవలెను. భక్తికే ఆమె వశ మగునని ముందు నామములలో తెలుపబడినది కదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 213 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Mahāpūjyā महापूज्या (213) 🌻

She is worshipped by great souls like saints and sages. Saints and sages have more knowledge than most of the demigods and goddesses. They will not worship anybody unless they are worthy of worship. There are interpretations saying that Brahma, Viṣṇu, Śiva worship Her. This means that Gods who have been assigned various duties, worship Her. This is yet another affirmation regarding Her supremacy.

There are references to gods, goddesses and others who worship Her using mantra-s, metals and gems.

1.Śiva - mantra, 2. Brahmā – stone, 3. Viṣṇu - blue stone, 4. Kubera – gold, 5. Viśvedevās - silver,

6. Vāyu – copper, 7. Vasu - brass, 8. Varuna – crystal, 9. Agni – gems, 10. Śakra – pearls,

11. Sūrya – coral, 12. Soma – lapis, 13. Planets – lazuli, 14. Demons – tin, 15. Piśācas - adamantine, 16. Mātṛgaṇa-s – iron.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

No comments:

Post a Comment