దేవాపి మహర్షి బోధనలు - 36
🌹. దేవాపి మహర్షి బోధనలు - 36 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 26. జ్ఞానయోగము - కర్మయోగము - 2 🌻
సృష్టి యందు యేర్పడు పాపమును, తనయందు ఏర్పడు పాపమును నిత్యము తొలగించు కొనుచుండ వలెను. ఇట్లు తొలగించు కొనుటయే పవిత్రీకరణము లేక సంస్కరణము అనబడును.
లోకమున మంచి పనులు, చెడు పనులు అని లేవు. మానవుని ఉద్దేశ్యమునుబట్టి అవి ఏర్పడును. వ్యక్తిగత ఉద్దేశ్యములు లేని కార్యము ఏదైననూ, సత్కర్మాచరణమే. కావున నీ స్వభావమున యేర్పడిన ధర్మమును ఫలాపేక్ష లేక నిర్వర్తించుట వలన బంధము తొలగును. అట్లు చేయుటలో శ్రద్ధ, సమర్పణము వుండవలెను.
వ్యామోహము, కలవరపాటు, అహంకారము ఉండరాదు. పై చెప్పిన ప్రకారము కర్మలాచరించుట వలన మనస్సు, యింద్రియములు, దేహమునకు సమన్వయమేర్పడి జ్ఞానము పొందుటకు అవకాశమేర్పడును.
అనగా తనయందు ప్రేరేపింపబడిన సృష్టి ప్రణాళికను బుద్ధియోగమున గమనించి, మనస్సు, యింద్రియములు, దేహము ద్వారా ఆచరింపజేయుట జరుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment