శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 253 / Sri Lalitha Chaitanya Vijnanam - 253


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 253 / Sri Lalitha Chaitanya Vijnanam - 253 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀


🌻 253. 'విజ్ఞానఘనరూపిణీ' 🌻

చైతన్యరసమే ఘనీభవించిన రూపము గలది శ్రీమాత అని అర్థము. విజ్ఞాన మను పదమునకు జీవుడను అర్థమున్నది. జీవుల రూపముగ శ్రీమాత చైతన్యమే ఘనీభవించి యుండును. రూపము నిచ్చున దామెయే. దైవాంశగ దిగివచ్చు జీవునికి తన వెలుగును ప్రసాదించి చైతన్యవంతుని గావించి త్రిగుణముల రూపమున ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల నొసగి, పంచతత్త్వములతో కూడిన శరీర మిచ్చి, అందు పంచ ప్రాణములను నిలిపి జీవుని ఘనరూపుని జేసి ఆనందము, అనుభూతి, పరిణామము పొందుటకై నక్షత్ర, గ్రహ గోళాది సృష్టిగ యేర్పడినది. శ్రీమాత. ఆమె ఘనరూపమే. సృష్టి, జీవుల ఘన రూపము గూడ ఆమెయే.

సహజముగ చైతన్య రస స్వరూపిణి అయి వుండియు జీవుల కొఱుకు తానే ఘన రూపము దాల్చినది. జీవుల రూపము, సృష్టి రూపముగ నిలచినది. జీవుల యందు విజ్ఞానముగ గూడ యేర్పడి యున్నది. కావుననే జీవులు పరిణామము చెందుట కవకాశ మేర్పడినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 253 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Vijñānaghana-rūpiṇī विज्ञानघन-रूपिणी (253) 🌻


She is the essence of pure consciousness. Essence means the subtle form of consciousness. Ānanda or supreme happiness is the gross form of consciousness.

This is beautifully explained in Bṛhadāraṇayaka Upaniṣad (II.iv.12) says, “Pure and subtle form of consciousness is like dropping a pinch of salt in water. It gets dissolved and cannot be removed from the water. A pinch of salt (subtle) makes the whole pot of water (gross) taste salty. In the same way, the Self comes out as a separate entity (separate entity means me and mine or ego) is destroyed. Then what remains is the Supreme Self alone. Once this state of oneness is attained, there is no question of even the consciousness. But how is this pure consciousness?” This Upaniṣad further says (III.iv.2) “This is your Self that is within all. Everything else (the gross body) is perishable.”

There is another interpretation. Vijñāna means soul or jīva and vijñānaghana means the total sum of souls. Such sum of souls is called the hiraṇyagarbha or the golden egg (please refer nāma 232). Vijñāna can be defined as ‘the absolute freedom revealing itself in the three actions of the Brahman – creation, sustenance and dissolution. The entire manifestation consisting of subject and object is a reflection of vijñāna.”

This interpretation is elaborated in Praśna Upaniṣad (V.2), which says, “sa etasmājjīvaghanāt parātparaṁ” which means He (Brahman) is superior even to hiraṇyagarbha, the sum total of all beings.”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2021

No comments:

Post a Comment