నిర్మల ధ్యానాలు - ఓషో - 5


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 5 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


నువ్వు 'దేవుడు' అన్న మాట అన్న క్షణంలోనే అదేదో చాలా దూరంగా వున్న విషయం అన్న స్పృహ కలుగుతుంది. శతాబ్దాల నించే, యుగాల నించీ తరతరాల నుంచీ అందరూ చెబుతున్నది అదే. ఎక్కడో దేవుడు పైన వుంటాడని, ఆకాశంలో మనకందనంత ఎత్తులో వుంటాడని. అదే నువ్వు ప్రేమ' అన్న మాట అంటే అది హృదయానికి చాలా దగ్గర్లో వుంటుంది.

నువ్వు 'దేవుడు' అన్న పదాన్ని వుపయోగించిన క్షణం అది నీకు ఒక వ్యక్తికి సంబంధించిన స్పృహ కలిగిస్తుంది. దేవుడికి పరిమితులు ఏర్పడతాయి. దేవుణ్ణి ఫలానా అని వివరించే వీలు ఏర్పడుతుంది.

కానీ ప్రేమ అన్నది వ్యక్తి కాదు. అదొక గుణం, అదొక సామీప్యం, ఒక పరిమళం, దానికి పరిమితి లేదు. హద్దుల్లేవు అది అనంతం. నువ్వు దేవుడు అన్న మాట అంటే నువ్వు నిస్పృహకు లోనవుతావు ఏం చెయ్యాలి అని ? అదే అక్కడ ప్రేమ వుంటే నువ్వు ఏమయినా చెయ్యగలవు.

ప్రేమించడమన్నది నీ లోలోతుల లక్షణం. నీ లోపలి లక్షణం. అందుకనే నా బోధనలన్నీ ప్రేమ అన్న పదం చుట్టూ తిరుగుతాయి. అందరూ దేవుడు అంటే ప్రేమ అన్నారు. నేను! ప్రేమ అంటే దేవుడు అంటాను.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2021

No comments:

Post a Comment