వివేక చూడామణి - 55 / Viveka Chudamani - 55
🌹. వివేక చూడామణి - 55 / Viveka Chudamani - 55 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 17. విముక్తి - 2 🍀
196. ఆత్మ జీవత్వమునకు సాక్షిగా ఏ విధమైన లక్షణాలు, కర్మలు అంటనట్టి తన జ్ఞానము ద్వారా అర్ధము చేసుకొనగలదు. బుద్ధి, మాయలో చిక్కుకొని నిజము కాని ఈ శరీరమును ఆత్మగా భావించును. ఎపుడైతే మాయ తొలగిపోతుందో అపుడు తన భావన సరైనది కాదని గ్రహిస్తుంది.
197. మాయ ఉన్నంత వరకు ఈ శరీరమును ఆత్మగా భావించి, తరువాత భ్రమ తొలగిన తరువాత ఆత్మ వ్యక్తమవుతుంది. తాడును పాముగా భ్రమించి, తరువాత ఆ భ్రమ తొలగిపోయినపుడు పాము మాయమవుతుంది.
198, 199. అవిధ్య ప్రభావము వలన దాని ఫలితములు తెలియకున్నవి. అయితే జ్ఞానము పొందిన తరువాత అవిధ్య ఫలితములన్నియూ గ్రహించి వాటికి మొదలు లేనప్పటికి అవి మాయతో సహ మాయమైయిపోతాయని తెలుస్తుంది. ఎలానంటే కలలు, మెలుకువ తరువాత మాయమైనట్లు. అందువలన ఈ విశ్వము, దానికి మొదలు లేనప్పటికి అది శాశ్వతము కాదు. అది లేనిదే అవుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 55 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Liberation - 2 🌻
196. The Jivahood of the Atman, the Witness, which is beyond qualities and beyond activity, and which is realised within as Knowledge and Bliss Absolute – has been superimposed by the delusion of the Buddhi, and is not real. And because it is by nature an unreality, it ceases to exist when the delusion is gone.
197. It exists only so long as the delusion lasts, being caused by indiscrimination due to an illusion. The rope is supposed to be the snake only so long as the mistake lasts, and there is no more snake when the illusion has vanished. Similar is the case here.
198-199. Avidya or Nescience and its effects are likewise considered as beginningless. But with the rise of Vidya or realisation, the entire effects of Avidya, even though beginningless, are destroyed together with their root – like dreams on waking up from sleep. It is clear that the phenomenal universe, even though without beginning, is not eternal – like previous non-existence.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
03 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment