దేవాపి మహర్షి బోధనలు - 66
🌹. దేవాపి మహర్షి బోధనలు - 66 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻47. కపటి 🌻
పరమగురువులను గూర్చిన సంభాషణము అత్యంత బాధ్యతా యుతమైనది. వారిని గూర్చి ఎంత తక్కువ సంభాషించిన అంత మేలు. కారణమేమన వారిని గూర్చిన అవగాహన కలవారు వాణ్నియమము కలవారగుటచే మాట్లాడరు. వారిని గూర్చి తెలియని వారు గాలి కబుర్లుగ నియమముల నుల్లంఘించి మాట్లాడుదురు.
వారు చెప్పు విషయములు వారికే తెలియనివి. తనకు తెలియని విషయములు తెలిసినట్లుగ చెప్పువాడు కపటి. తమ గుర్తింపు కొరకై పరమ గురువులను గూర్చి తెలిసినట్లుగ పలుకుచూ, ఇతరులను తనకు లోబడునట్లు చేసుకొను చుండును. సద్గురువులను గూర్చి చర్చించుటకన్న శ్రద్ధాభక్తులతో సత్కార్యముల నాచరించుట శ్రేయోదాయకము.
వేల సంవత్సరముల తరువాత నా ఉనికిని ఈ మధ్య కాలమున కొందరికి తెలియ జేయుట వలన మానవ జాతి యందు చాల అలజడి జరిగినది. రభస జరిగినది. వారు రచ్చ కెక్కుటయే కాక మమ్ములను కూడ రొచ్చులో దింప జూచినారు. ఇది అంతయు భక్తులమనుకొను ఆవేశపరుల కారణముగ వెదజల్లబడిన బురద. మాటిమాటికిని గురునామమును ఉదహరించు వ్యక్తి అపాయకరమని గుర్తింపుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment