వివేక చూడామణి - 107 / Viveka Chudamani - 107
🌹. వివేక చూడామణి - 107 / Viveka Chudamani - 107🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 24. సమాధి స్థితి - 3 🍀
359. కీటకము తన యొక్క ఇతర కర్మలన్నింటిని వదలి, కేవలము భ్రమర నాదము వింటూ దానిని గూర్చే ఆలోచించుట వలన ఆ కీటకము భ్రమరముగా మారుతుంది. అలానే యోగి ధ్యాన స్థితిలో సదా పరమాత్మనే ధ్యానించుచుండిన, తన ఏకాగ్రత ఫలితముగా తాను పరమాత్మగా మారగలడు.
360. పరమాత్మ యొక్క సత్యము సూక్ష్మాతి సూక్ష్మము. అట్టి స్థితిని చేరుటకు మనస్సు తన యొక్క ఆలోచనలతో ఈ బాహ్య ప్రపంచము మొత్తమును గమనించిన అది బ్రహ్మమును దర్శించలేదు. పరమాత్మ స్థితిని అందుకోవాలంటే ఉన్నతమైన ఆత్మలు, స్వచ్ఛమైన మనస్సుతో సమాధి స్థితిని చేరినపుడు, మనస్సు తన అసాధారణమైన సూక్ష్మ స్థితిలో పరమాత్మను దర్శించగలదు.
361. బంగారమును ఏవిధముగా అగ్నిలో కాల్చిన తనలోని వ్యర్ధములు తొలగి పూర్తిగా స్వచ్ఛతను పొందగలదో, అలానే మనస్సు కూడా ధ్యానము ద్వారా ఏకాగ్రతను సాధించిన, అది తనలోని మలినములను తొలగించుకొని అనగా సత్వ, రజో, తమో గుణములను తొలగించుకొని సత్యమైన బ్రహ్మమును పొందగలదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 107 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 24. Samadhi State - 3 🌻
359. Just as the cockroach, giving up the attachment to all other actions, thinks intently on the Bhramara and becomes transformed into that worm, exactly in the same manner the Yogi, meditating on the truth of the Paramatman, attains to It through his onepointed devotion to that.
360. The truth of the Paramatman is extremely subtle, and cannot be reached by the gross outgoing tendency of the mind. It is only accessible to noble souls with perfectly pure minds, by means of Samadhi brought on by an extraordinary fineness of the mental state.
361. As gold purified by thorough heating on the fire gives up its impurities and attains to its own lustre, so the mind, through meditation, gives up its impurities of Sattva, Rajas and Tamas, and attains to the reality of Brahman.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment