24-JULY-2021 MESSAGES

గురు పౌర్ణమి శుభాకాంక్షలు 
1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 231 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 432🌹 
3) 🌹 వివేక చూడామణి - 107 / Viveka Chudamani - 107🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -59🌹  
5) 🌹 Osho Daily Meditations - 48🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Lalitha Sahasra Namavali - 108🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 108 / Sri Vishnu Sahasranama - 108🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹*
*🙏. ప్రసాద్‌ భరద్వాజ*

*గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః* *గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః*

*గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:* 
*అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:*

*ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.*

🙏 🌹 🙏 🌹 🙏 🌹🙏 🌹 🙏 🌹

*విశ్వగురువు, అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదారవిందములకు.......*  
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -231 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 15

*🍀 14. పరమపదము - పరమపదము చేరినవారు సర్వ విధముల పూర్ణత్వము చెందుటవలన పునర్జన్మలకు కారణ ముండదు. దుఃఖము లనుభవించుటకు కారణ మసలే యుండదు. అక్షరము, పరము, బ్రహ్మము అయిన స్థితిని పొందినవారిని బ్రహ్మర్షులని పిలుతురు. వారు లోకములందు జనించుటకు వ్యక్తిగతముగ కారణము లేకున్నను దివ్య సంకల్పము ననుసరించి దేహములను ధరింతురు. 🍀*

మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మావ స్పంసిద్ధిం పరమాం గతాః || 15

తాత్పర్యము : 'నన్ను' పై విధముగ పొందిన మహాత్ములు పరమపదము చేరి శాశ్వత సిద్ధియందుందురు. వారు శాశ్వతము, దుఃఖము గల జన్మలను మరల పొందరు.

వివరణము : పరమపదము చేరిన వారికి పూర్ణజ్ఞానము, పూర్ణానందము సిద్ధించి యుండును. కనుక వారు మరల మరల పరిపూర్ణత కొరకై దేహములు ధరించ పనియుండదు. ఇతరులు అపరిపూర్ణులగుట వలన పరిపూర్ణతకై జన్మలెత్తుదురు. వారు జన్మ లెత్తుటకు కారణమున్నది. పరమపదము చేరినవారు సర్వ విధముల పూర్ణత్వము చెందుటవలన పునర్జన్మలకు కారణ ముండదు. దుఃఖము లనుభవించుటకు కారణ మసలే యుండదు.

అక్షరము, పరము, బ్రహ్మము అయిన స్థితిని పొందినవారిని బ్రహ్మర్షులని పిలుతురు. వారు లోకములందు జనించుటకు వ్యక్తిగతముగ కారణము లేకున్నను దివ్య సంకల్పము ననుసరించి దేహములను ధరింతురు. అట్లు ధరించినను వారి నిజస్థితి మరువరు. బ్రహ్మమునందే ప్రజ్ఞ స్థిరపడి యుండును గనుక, దేహధారణము వలన శాశ్వతత్త్వము కోల్పోవుట, దుఃఖములు చెందుట యుండదు. 

బ్రహ్మర్షులగు వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు వంటి వారు దివ్య కారణములకై దేహములందున్నారు. ప్రజాపతులు కూడ బ్రహ్మము నెరిగినవారే అయ్యున్నను, దేహములు ధరించి సృష్టికార్యమున సహకరించుచున్నారు. మనువులు కూడ అట్టివారే. దుఃఖముల నిలయమగు జన్మలుకాక, దివ్య సంకల్పమున జన్మలెత్తుట యొకటి సృష్టిలో గలదు. అట్టివారన్ని గోళముల యందు ఉన్నారు. భూమిపై కూడ గలరు. 

ఈ భూమి పై పరబ్రహ్మ పదమును పొందిన సిద్ధులు ఇరువది నాలుగు (24) మంది భౌగోళికముగ వ్యాప్తి చెంది మానవజాతి నుద్ధరించుటకై కృషి సలుపు చున్నారని ఆర్యోక్తి. అట్టివా రెప్పుడును సహజ సమాధి యందే యుందురు. బ్రహ్మానుభూతియందే యుందురు. వారిని దుఃఖము లంటవు. శరీరములు మార్చుకొనుచున్నను, వారి నిజస్థితికి అవస్థితి యుండదు. అట్టివారు దేహములందున్నను ముక్తులే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 431🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 26

*🌻. బ్రహ్మచారి రాక - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మునులు తమ లోకమునుకు వెళ్లగానే సృష్టికారణడగు శంకర ప్రభుడు పార్వతీ దేవియొక్క తపస్సును స్వయముగా పరిక్షింపగోరెను.(1).శంభుడు పరీక్షయను నెపముతో ఆమెను చూడగోరి, సంతోషముతో గూడిన మనస్సు గలవాడై, జటాధారియగు విప్రుని రూపమును ధరించి పార్వతి తపస్సు చేయుచున్న వనమునకు వెళ్ళెను.(2). సంతసముతో నిండిన మనస్సుగల ఆ శివుడు తన తేజస్సుచే ప్రకాశించువాడు, కర్రను గొడుగును పట్టుకున్నవాడు, మిక్కిలి ముదుసలి యగు బ్రహ్మణుని వేషమును ధరించి యుండెను(3). ఆయన సఖురాండ్రచే చుట్టువార బడి, తపోవిదికపై స్వచ్ఛమగు చంద్రకళవలె ప్రకాశించుచున్న ఆ పార్వతీదేవిని చూచెను.(4)

భక్తవత్సలుడగు ఆ శంభుడు బ్రహ్మచారి రూపమును ధరించినవాడై ఆ దేవిని చూచి, అపుడు ప్రేమతో సమీపమునకు వెళ్లెను.(5) అద్భుతమగు తేజస్సుతో ప్రకాశిస్తూ అచటకు విచ్చేసిన బ్రహ్మణుని చూచి అపుడా పార్వతీదేవి ఆయనను సర్వోపచారములతో మరియు బహుమానములతో పూజించెను(6). పార్వతీదేవి పరమానందముతో యరియుఏ చక్కగా అమర్చబడిన పూజా ద్రవ్యములతో ఆ బ్రాహ్మణుని పూజించి ఆదరముతో ప్రేమతో కుశలము అడిగెను(7).

పార్వతి ఇట్లు పలికెను: వేదవేత్తలలో శ్రేష్ఠమైనవాడా! బ్రహ్మచారి రూపములో నున్న నీవు ఎవరివి? ఈ వనము నీచే ప్రకాశించుచున్నది చెప్పుము (8)

ఆ బ్రాహ్మణుడిట్లు పలికెను

నేను ఇచ్చవచ్చిన చోట సంచరించే వృద్ధ బ్రాహ్మణుడను,విద్వాంసుడను, తపశ్శాలిని. నేను ఇతరులకు ఉపకారమును చేసి సుఖమును కలిగించెద ననుటలో సందియము లేదు.(9) నీ వెవరు? ఎవరి కుమార్తెవు? నిర్జనమగు ఈ వనములో నిలబడి తపస్సును చేయు మునులు కూడ చేయ శక్యము కాని తపస్సును ఎందులకు చేయుచున్నావు? (10). నీవు చిన్న పిల్లవు కాదు. వృద్ధురాలవు కాదు నీవుఅందమగు యువతివి యని స్పష్టమగు చున్నది భర్త తోడు లేకుండగా ఈవనములో ఉగ్రమగు తపస్సును ఏల చేయుచున్నావు? (11) ఓ మంగళస్వరూపులారా! తపస్సును చేయుచున్న నీవు ఎవని భార్యవు ? ఆ అభాగ్యుడు నిన్ను పోషించుటలేదు. ఓ దేవీ! అతడు నిన్ను వీడి మరియోక చోటకు వెళ్ళినాడా యేమి?(12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 107 / Viveka Chudamani - 107🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 24. సమాధి స్థితి - 3 🍀*

359. కీటకము తన యొక్క ఇతర కర్మలన్నింటిని వదలి, కేవలము భ్రమర నాదము వింటూ దానిని గూర్చే ఆలోచించుట వలన ఆ కీటకము భ్రమరముగా మారుతుంది. అలానే యోగి ధ్యాన స్థితిలో సదా పరమాత్మనే ధ్యానించుచుండిన, తన ఏకాగ్రత ఫలితముగా తాను పరమాత్మగా మారగలడు. 

360. పరమాత్మ యొక్క సత్యము సూక్ష్మాతి సూక్ష్మము. అట్టి స్థితిని చేరుటకు మనస్సు తన యొక్క ఆలోచనలతో ఈ బాహ్య ప్రపంచము మొత్తమును గమనించిన అది బ్రహ్మమును దర్శించలేదు. పరమాత్మ స్థితిని అందుకోవాలంటే ఉన్నతమైన ఆత్మలు, స్వచ్ఛమైన మనస్సుతో సమాధి స్థితిని చేరినపుడు, మనస్సు తన అసాధారణమైన సూక్ష్మ స్థితిలో పరమాత్మను దర్శించగలదు. 

361. బంగారమును ఏవిధముగా అగ్నిలో కాల్చిన తనలోని వ్యర్ధములు తొలగి పూర్తిగా స్వచ్ఛతను పొందగలదో, అలానే మనస్సు కూడా ధ్యానము ద్వారా ఏకాగ్రతను సాధించిన, అది తనలోని మలినములను తొలగించుకొని అనగా సత్వ, రజో, తమో గుణములను తొలగించుకొని సత్యమైన బ్రహ్మమును పొందగలదు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 107 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 24. Samadhi State - 3 🌻*

359. Just as the cockroach, giving up the attachment to all other actions, thinks intently on the Bhramara and becomes transformed into that worm, exactly in the same manner the Yogi, meditating on the truth of the Paramatman, attains to It through his onepointed devotion to that.

360. The truth of the Paramatman is extremely subtle, and cannot be reached by the gross outgoing tendency of the mind. It is only accessible to noble souls with perfectly pure minds, by means of Samadhi brought on by an extraordinary fineness of the mental state.

361. As gold purified by thorough heating on the fire gives up its impurities and attains to its own lustre, so the mind, through meditation, gives up its impurities of Sattva, Rajas and Tamas, and attains to the reality of Brahman.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 59 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మంచి - చెడు 🌻

ఒకరిని చెడుగా అభివర్ణించే ముందు తను ఎంత‌వరకు మంచివాడు అన్న విషయం తెలుసుకొనుట ముఖ్యం. 

రోగ గ్రహస్తుడైన మనిషికి‌ తగిన‌ సమయంలో సేవ చేసిన మనిషి ఉత్తమ సంఘ సేవకుడు.

ఒకరిని పూర్తిగా అర్థం చేసుకొనకుండా మొదట నమ్మి, పిదప దూషించడం మూర్ఖ లక్షణం.

తనకు ప్రపంచములో తెలియని‌ విషయము లేదని డాబులు పలికెటంతటి మూర్ఖుడు మరొకడుండడు.  

జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవతుల్యులు.‌‌ వారిని‌ ఆదరించి తగిన‌ సేవను చేయుట‌ ముక్తికి‌ మార్గము.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 48 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 FORGIVING YOUR PARENTS 🍀*

*🕉 To forgive one's parents is one of the most difficult things, because they have given birth to you - how can you forgive them? 🕉*

Unless you start loving yourself, unless you come to a state in which you are thrilled by your being-how can you thank your parents? It is impossible. You will be angry-they have given birth to you, and they didn't even ask you first. They have created this horrible person. Why should you suffer because they decided to give birth to a child? You were not a party to it. Why have you been dragged into the world? Hence the rage.

If you come to a point where you can love yourself, where you feel really ecstatic that you are, where your gratefulness knows no limitation, then suddenly you, feel great love arising for your parents. They have been the doors for you to enter into existence. Without them this ecstasy would not have been possible-they have made it possible.

If you can celebrate your being-and that is the whole purpose of my work, to help you to celebrate your being-then suddenly you can feel gratitude for your parents, for their compassion, their love. You can not only feel grateful, you also forgive them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Sri Lalita Sahasranamavali - Meaning - 108 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |*
*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ‖ 108 ‖ 🍀*

🍀 524. మజ్జా సంస్థా - 
మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.

🍀 525. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా - 
హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.

🍀 526. హరిద్రాన్నైక రసికా - 
పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.

🍀 527. హాకినీ రూపధారిణీ - 
హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 108 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 108. majjāsaṁsthā haṁsavatī-mukhya-śakti-samanvitā |*
*haridrānnaika-rasikā hākinī-rūpa-dhāriṇī || 108 || 🌻*

🌻 524 ) Majja samstha -   
She who is in the fat surrounding the body

🌻 525 ) Hamsavathi mukhya shakthi samanvitha -  
 She who is surrounded by shakthis called Hamsavathi

🌻 526 ) Hardrannaika rasika -   
She who likes rice mixed with turmeric powder

🌻 527 ) Hakini roopa dharini -   
She who has the name “Hakini”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 108 / Sri Vishnu Sahasra Namavali - 108 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*రేవతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |*

*🍀 108. వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ |*
*శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ‖ 108 ‖ 🍀*
*శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి |*

సర్వవిధ ఆయుధములు కలవాడు, ప్రకృతిని మాలగా ధరించిన, శంఖం, గద, కత్తి మరియు చక్రం కలిగి మహా విష్ణు, వాసుదేవ అని పిలువబడే నారాయణ మహా ప్రభు, మమ్ము రక్షించు ... 

సమాప్తము .... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 108 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Revathi 4th Padam*

*🌻 108. vanamālī gadī śārṅgī śaṅkhī cakrī ca nandakī |*
*śrīmān nārāyaṇō viṣṇurvāsudevōbhirakṣatu || 108 🌻*

 ||(Chant this shloka 3 times)

Protect us Oh Lord Narayana, 
Who wears the forest garland, 
Who has the mace, conch, sword and the wheel. And who is called Vishnu and the Vasudeva.

Completed... The End.
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment