Greetings on Guru Pournami


🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹

🙏. ప్రసాద్‌ భరద్వాజ


గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:

ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.

🙏 🌹 🙏 🌹 🙏 🌹🙏 🌹 🙏 🌹


విశ్వగురువు, అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదారవిందములకు.......

🌹 🌹 🌹 🌹 🌹


24 Jul 2021

No comments:

Post a Comment