వివేక చూడామణి - 143 / Viveka Chudamani - 143


🌹. వివేక చూడామణి - 143 / Viveka Chudamani - 143🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -1 🍀


471. ఉన్నతాత్మలైన సన్యాసులు, వారు అన్ని బంధనాల నుండి విముక్తిని పొంది; జ్ఞానేంద్రియ, వస్తువుల అనుభవములను వదలివేసి పవిత్రులై పూర్తి స్థిత ప్రజ్ఞత్వమును పొంది, ఉన్నతమైన బ్రహ్మమును తెలుసుకొన్నవారై, చివరకు ఆత్మను పొంది బ్రహ్మానంద స్థితిలో ఉంటారు.

472. గురువు శిష్యునికి ఇలా చెబుతున్నాడు: నీవు కూడా ఉన్నతమైన ఆత్మను తెలుసుకొని, ఆత్మ యొక్క నిజతత్వమును గ్రహించి, అది అత్యున్నత ఆనంద స్థితి అని, అది దేనిలోనూ కలవదని, తన మనస్సులో సృష్టించిన మాయలను జయించి స్వేచ్ఛను పొంది, ద్వంద్వ ప్రపంచ భావన నుండి మేల్కొని నీ జీవితము యొక్క ముగింపును చేరుకొనుము.

473. సమాధి ద్వారా అందులో మనస్సు పూర్తిగా స్థిరపడినపుడు సత్యాన్ని దర్శించుము. ఆత్మను పొందుము. శ్వాస సంబంధమైన అర్థము తెలుసుకొన్నపుడు గురువు ఖచ్చితముగా అనుమానము లేకుండా సమాధి స్థితిలో తెలుసుకొనబడతాడు. అందుకు ఏవిధమైన అనుమానము లేదు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 143 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 30. To Achieve Brahmam - 1 🌻


471. High-souled Sannyasins who have got rid of all attachment and discarded all senseenjoyments, and who are serene and perfectly restrained, realise this Supreme Truth and at the end attain the Supreme Bliss through their Self-realisation.

472. Thou, too, discriminate this Supreme Truth, the real nature of the Self, which is Bliss undiluted, and shaking off thy delusion created by thy own mind, be free and illumined, and attain the consummation of thy life.

473. Through the Samadhi in which the mind has been perfectly stilled, visualise the Truth of the Self with the eye of clear realisation. If the meaning of the (Scriptural) words heard from the Guru is perfectly and indubitably discerned, then it can lead to no more doubt.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2021

No comments:

Post a Comment