మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 95
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 95 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 11 🌻
భగవద్గీతలో "క్షుద్రం హృదయదౌర్బల్యం త్వక్త్వోత్త్విష్ఠ పరంతప" క్షద్రమైన హృదయ దౌర్బల్యమును వదిలి పెట్టి మళ్ళీ నీ కర్తవ్యాన్ని స్వీకరించు అని చెప్పబడిన ఉపదేశాన్ని (ఆదేశంగా) తీసికో.
ఉత్తిష్ఠ అన్న మాటకు ఎప్పుడయినా అర్థం ఇదే. "మేల్కాంచు, మేల్కాంచు" నిద్ర నుండే కాదు ఏవైతే మనకు ఉండకూడని లక్షణాలు ఉన్నాయో మనం వాటి నుండి మేల్కాంచవలెను. ఈ పదమునే "నిద్ర" అనుదానిగా మనం స్వీకరించవలెను. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునకు చేసిన ప్రబోధం ఇదే.
ఎవరికి ఇది కావాలో వారందూ స్వీకరించినట్లయితే వారితో జాతి మళ్ళీ ప్రారంభమవుతుంది. జాతిలో జనాభా లెక్కలలోనికి వచ్చేవాళ్ళం అందరం భారతీయులం అని అనలేం. భారతజాతి నిర్మాణమునకు ఎవరెవరమయితే పూనుకుంటామో, వాళ్ళమంతా భారతీయులం క్రిందకు వస్తాము. మిగతవాళ్ళమంతా తిండిపోతురాయుళ్ళ క్రిందకు వస్తాము. పెద్దలయిన పరమగురువుల పరమోపదేశం ఏమనగా తన కర్తవ్యం ఎవరితే ఆచరిస్తున్నారో వారే నిజమయిన భారతీయులము.
మన డిస్పెన్సరీలలో కూడా మన వాళ్ళు ఇదే PRINCIPLE పెట్టుకున్నారు. ఎవరయితే కేవలం మందులు పుచ్చుకోవటమే కాకుండా, మందులు ఇవ్వటం కోసం, హృదయంలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తారో వాళ్ళకు ఎల్లప్పుడు ఉపదేశం (మోక్షదాయకమైన) జరుగుతూనే ఉంటుంది.
మనమెవ్వరమూ చేయనక్కరలేదు పరమాత్మయే చేస్తూ ఉంటాడు, కేవలం మందులు పుచ్చుకొనుట కొరకు ఆ టైముకి వచ్చి వెళ్ళే వాళ్ళు పరీక్షించుటకు వచ్చే పరమాత్మ స్వరూపులు. వాళ్ళ సేవ చేసే వీళ్ళు దీక్షా కంకణ బద్ధులుగా చెప్పబడుదురు..
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
27 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment