27-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 27, సోమవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 267 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 466🌹 
4) 🌹 వివేక చూడామణి - 143 / Viveka Chudamani - 143🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -95🌹  
6) 🌹 Osho Daily Meditations - 84 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 143 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 143🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*27, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ గణాధీశ స్తోత్రం - 4 🍀*

మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంబాయ నమో నమః |
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమో నమః || 6

విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోఽస్తు తే |
త్వదీయభక్తియోగేన యోగీశాః శాంతిమాగతాః || 7

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ షష్టి 10:51:42 వరకు తదుపరి కృష్ణ సప్తమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: ఆర్ద్ర 07:09:37 వరకు తదుపరి పునర్వసు
యోగం: సిధ్ధ 26:09:30 వరకు తదుపరి సద్య
 కరణం: వణిజ 10:48:42 వరకు
వర్జ్యం: 20:25:30 - 22:11:42
దుర్ముహూర్తం: 11:36:39 - 12:22:56
రాహు కాలం: 11:59:47 - 13:26:36
గుళిక కాలం: 10:33:00 - 11:59:48
యమ గండం: 07:39:23 - 09:06:12
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: -
పండుగలు : లేదు
సూర్యోదయం: 06:12:35, సూర్యాస్తమయం: 17:47:05
వైదిక సూర్యోదయం: 06:16:13
వైదిక సూర్యాస్తమయం: 17:43:20
చంద్రోదయం: 22:54:55, చంద్రాస్తమయం: 11:40:49
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: జెమిని
ఆనందాదియోగం: ముసల యోగం - దుఃఖం 07:09:37 
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -267 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 8-2
 
*🍀 8. ప్రకృతి మాయ -2 - తామే చేయుచున్నామను మెర మెరయే గాని ఏ జీవునిచే ఎప్పుడు ఏమి చేయించవలెనో, వానిచే అట్లు చేయించునది ప్రకృతి. తన ఊహ కతీతముగ తమయందలి ప్రకృతి తమను అనేక విధములుగ ప్రోత్సహించి పనిచేయించును. నిజమునకు జీవుల స్వామిత్వ మేమియు లేదు. కనుక పరమాత్మతో కూడి ప్రకృతి మాయను దర్శించుచు యుండుట యోగ్యము. అపుడపుడు తాము కూడ మాయలో పడవచ్చునని తెలిసి యుండుట ముఖ్యము.🍀*

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ || 8

*తాత్పర్యము : ప్రాణి సముదాయ మంతయు స్వతహ ప్రకృతిచే నియమింపబడువారు అగుటచే నిశ్చయముగ అవశులు. అనగ తమ వశమున తాముండలేరు. ప్రకృతి ఎట్లాడించిన, అట్లాడుదురు.*

వివరణము : తామే చేయుచున్నామను మెర మెరయే గాని ఏ జీవునిచే ఎప్పుడు ఏమి చేయించవలెనో, వానిచే అట్లు చేయించునది ప్రకృతి. వేద ద్రష్ట, వేదమునకు స్వర మేర్పరచిన వాడు, మహా జ్ఞానియగు రావణుని ద్వారా అనూహ్యమగు కార్యములు జరిగినవి. పరమప్రీతి ఎల్లప్పుడు రాముని ఎడలగల కైకేయిచే రాముని వనవాసమున కంపినది. దిక్పాలకు లందరికి అధి నాయకుడగు ఇంద్రునికి అహల్యపై మోహము కలిగించినది. 

తన ఊహ కతీతముగ తమయందలి ప్రకృతి తమను అనేక విధములుగ ప్రోత్సహించి పనిచేయించును. నిజమునకు జీవుల స్వామిత్వ మేమియు లేదు. ఎవరిని అందల మెక్కించునో, ఎవరిని అధోలోకములకు తొక్కునో ఎవ్వరునూ చెప్పలేరు. తెలివితక్కువ వాడు తెలివిగలవాని పై అధికారియగును. చిత్ర అతివిచిత్రముగ జీవుల కథ నడుపుచుండును. కవి చేతిలోని కథా పాత్రలవలె ప్రకృతి చేతిలో జీవుల కథలు నడుచు చుండును. 

ఇది ఇట్లు జరుగునని ఎవ్వరును చెప్పలేరు. ఈ మొత్తము సృష్టి వ్యాపారమును దర్శించిన ఋషులు ప్రకృతికి రెండక్షరముల పేరు పెట్టిరి. అదియే “మాయ”. ఆ మాయకు తాము లోబడుట కూడ వారు దర్శించుటచే వారు నిజముగ ఋషులైరి. అట్టి మాయా రూపమగు ప్రకృతి తన నుండే వెలువడి, తన లోనికే జొరబడి, హృదయమున నివాసముండునని పరమాత్మ తెలుపు చున్నాడు. 

కనుక పరమాత్మతో కూడి ప్రకృతి మాయను దర్శించుచు యుండుట యోగ్యము. అపుడపుడు తాము కూడ మాయలో పడవచ్చునని తెలిసియుండుట ముఖ్యము. మాయని పడని జీవుడు లేడు. సనకసనందనాదులు, దేవర్షియగు నారదుడు మాయనుబడిన సందర్భములుండగ మాయను దాటితిమని ఎవరు చెప్పగలరు?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 466 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 33

*🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻*

ఓ పర్వత రాజా! నీతి శాస్త్రము ఇట్టి మూడు రకముల వచనములను నిరూపించి యున్నది. వీటి మధ్యలో ఎట్టి వచనమును నేను చెప్పవలయునని నీవు కోరుచున్నావు? (34) దేవదేవుడు అగు శంకరుడు బాహ్యసంపదలు లేనివాడే అయినా, తత్త్వజ్ఞానమనే సముద్రము నందు ఆయన మనస్సు మునకలు వేయుచుండును (35). జ్ఞానఘనుడు, ఆనందఘనుడు అగు శివునకు బాహ్యవస్తువుల యందు కోరిక ఎట్లు ఉండును? గృహస్థుడు తన కుమార్తెను రాజ్యము, సంపదలు గలవానికి ఇచ్చును (36).

దుఃఖితునకు తన కుమార్తెను ఇచ్చిన తండ్రి ఆ కన్యను సంహరించినట్లే యగును. కాని శంకరుడు దుఃఖియని ఎవనికి తెలియును? ఆయనకు కుబేరుడు కింకరుడు (37). నిర్గుణుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, ప్రకృతికి అతీతుడు అగు ఆయన కనుబొమల కదలికచే మాత్రమే సృష్టిస్థితిలయములను చేయ సమర్థుడు (38). 

సృష్ఠి కార్యమును నిర్వహించే శివుని మూడు రకముల మూర్తులు సృష్టి స్థితిలయములను చేయును. ఆ మూర్తులకు బ్రహ్మవిష్ణురుద్రులని పేరు (39). బ్రహ్మ లోకమునందుండే బ్రహ్మ, క్షీర సముద్రమునందుండే విష్ణువు, కైలాసమునందు నివసించే రుద్రుడు అను ముగ్గురు శివుని విభూతులు మాత్రమే (40)

శివుని నుండి పుట్టిన ప్రకృతి కూడ అనేక రూపములుగా వ్యక్తమైననూ, సృష్టి కార్యమునందు తన లీలచే మూడు విధముల మూర్తులను తన అంశచే ధరించి యున్నది (41). ముఖము నుండి పుట్టినది, వాక్కునకు అధిష్ఠాన దేవత అయినది అగు సరస్వతి ఒకమూర్తి. వక్ష స్థలము నుండి పుట్టినది, సర్వ సంపత్స్వరూపురాలు అగు లక్ష్మి రెండవది (42). మూడవది యగు ఉమ దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది. ఆమె రాక్షసుల నందరినీ సంహరించి దేవతలకు సంపదలను ఒసంగినది (43). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 143 / Viveka Chudamani - 143🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ* 

*🍀. 30. బ్రహ్మమును పొందాలంటే -1 🍀*

*471. ఉన్నతాత్మలైన సన్యాసులు, వారు అన్ని బంధనాల నుండి విముక్తిని పొంది; జ్ఞానేంద్రియ, వస్తువుల అనుభవములను వదలివేసి పవిత్రులై పూర్తి స్థిత ప్రజ్ఞత్వమును పొంది, ఉన్నతమైన బ్రహ్మమును తెలుసుకొన్నవారై, చివరకు ఆత్మను పొంది బ్రహ్మానంద స్థితిలో ఉంటారు.* 

*472. గురువు శిష్యునికి ఇలా చెబుతున్నాడు: నీవు కూడా ఉన్నతమైన ఆత్మను తెలుసుకొని, ఆత్మ యొక్క నిజతత్వమును గ్రహించి, అది అత్యున్నత ఆనంద స్థితి అని, అది దేనిలోనూ కలవదని, తన మనస్సులో సృష్టించిన మాయలను జయించి స్వేచ్ఛను పొంది, ద్వంద్వ ప్రపంచ భావన నుండి మేల్కొని నీ జీవితము యొక్క ముగింపును చేరుకొనుము.* 

*473. సమాధి ద్వారా అందులో మనస్సు పూర్తిగా స్థిరపడినపుడు సత్యాన్ని దర్శించుము. ఆత్మను పొందుము. శ్వాస సంబంధమైన అర్థము తెలుసుకొన్నపుడు గురువు ఖచ్చితముగా అనుమానము లేకుండా సమాధి స్థితిలో తెలుసుకొనబడతాడు. అందుకు ఏవిధమైన అనుమానము లేదు.* 

 *సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 143 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 30. To Achieve Brahmam - 1 🌻*

*471. High-souled Sannyasins who have got rid of all attachment and discarded all senseenjoyments, and who are serene and perfectly restrained, realise this Supreme Truth and at the end attain the Supreme Bliss through their Self-realisation.*

*472. Thou, too, discriminate this Supreme Truth, the real nature of the Self, which is Bliss undiluted, and shaking off thy delusion created by thy own mind, be free and illumined, and attain the consummation of thy life.*

*473. Through the Samadhi in which the mind has been perfectly stilled, visualise the Truth of the Self with the eye of clear realisation. If the meaning of the (Scriptural) words heard from the Guru is perfectly and indubitably discerned, then it can lead to no more doubt.*
 
*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 143 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 30. To Achieve Brahmam - 1 🌻*

471. High-souled Sannyasins who have got rid of all attachment and discarded all senseenjoyments, and who are serene and perfectly restrained, realise this Supreme Truth and at the end attain the Supreme Bliss through their Self-realisation.

472. Thou, too, discriminate this Supreme Truth, the real nature of the Self, which is Bliss undiluted, and shaking off thy delusion created by thy own mind, be free and illumined, and attain the consummation of thy life.

473. Through the Samadhi in which the mind has been perfectly stilled, visualise the Truth of the Self with the eye of clear realisation. If the meaning of the (Scriptural) words heard from the Guru is perfectly and indubitably discerned, then it can lead to no more doubt.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 95 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు* 
*సంకలనము : వేణుమాధవ్* 
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. చేయవలసినది- చేయదలచినది - 11 🌻*

*భగవద్గీతలో "క్షుద్రం హృదయదౌర్బల్యం త్వక్త్వోత్త్విష్ఠ పరంతప" క్షద్రమైన హృదయ దౌర్బల్యమును వదిలి పెట్టి మళ్ళీ నీ కర్తవ్యాన్ని స్వీకరించు అని చెప్పబడిన ఉపదేశాన్ని (ఆదేశంగా) తీసికో.* 

*ఉత్తిష్ఠ అన్న మాటకు ఎప్పుడయినా అర్థం ఇదే. "మేల్కాంచు, మేల్కాంచు" నిద్ర నుండే కాదు ఏవైతే మనకు ఉండకూడని లక్షణాలు ఉన్నాయో మనం వాటి నుండి మేల్కాంచవలెను. ఈ పదమునే "నిద్ర" అనుదానిగా మనం స్వీకరించవలెను. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునకు చేసిన ప్రబోధం ఇదే.* 

*ఎవరికి ఇది కావాలో వారందూ స్వీకరించినట్లయితే వారితో జాతి మళ్ళీ ప్రారంభమవుతుంది. జాతిలో జనాభా లెక్కలలోనికి వచ్చేవాళ్ళం అందరం భారతీయులం అని అనలేం. భారతజాతి నిర్మాణమునకు ఎవరెవరమయితే పూనుకుంటామో, వాళ్ళమంతా భారతీయులం క్రిందకు వస్తాము. మిగతవాళ్ళమంతా తిండిపోతురాయుళ్ళ క్రిందకు వస్తాము. పెద్దలయిన పరమగురువుల పరమోపదేశం ఏమనగా తన‌ కర్తవ్యం ఎవరితే ఆచరిస్తున్నారో వారే నిజమయిన భారతీయులము.* 

*మన డిస్పెన్సరీలలో కూడా మన వాళ్ళు ఇదే PRINCIPLE పెట్టుకున్నారు. ఎవరయితే కేవలం మందులు పుచ్చుకోవటమే ‌కాకుండా, మందులు ఇవ్వటం కోసం, హృదయంలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తారో వాళ్ళకు ఎల్లప్పుడు ఉపదేశం (మోక్షదాయకమైన) జరుగుతూనే ఉంటుంది.* 

*మనమెవ్వరమూ చేయనక్కరలేదు పరమాత్మయే చేస్తూ ఉంటాడు, కేవలం మందులు పుచ్చుకొనుట కొరకు ఆ టైముకి వచ్చి వెళ్ళే వాళ్ళు పరీక్షించుటకు వచ్చే పరమాత్మ స్వరూపులు. వాళ్ళ సేవ చేసే వీళ్ళు దీక్షా కంకణ బద్ధులుగా చెప్పబడుదురు..*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 84 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 84. PERHAPS 🍀*

*🕉 Hesitate more. Use the words maybe and perhaps more, and allow others the freedom to decide on their own. 🕉*

Watch every word that you speak. Our language is such, our ways of speaking are such, that knowingly and unknowingly, 'we make absolute statements. Never do that. Say "perhaps" more. Hesitate more. Say "maybe" more, and allow others the freedom to decide on their own. 

Try it for one month. You will have to be very alert, because speaking in absolutes is a deep-rooted habit, but if one is watchful, this habit can be dropped. Then you will see that arguments will drop and there will be no need to defend.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 143 / Sri Lalita Sahasranamavali - Meaning - 143 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 143. భవదావసుధావృష్టి: పాపారణ్య దవానలా*
*దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా ॥ 143 ॥ 🍀*
 
🍀 741. భవదావసుధావృష్టి: : 
జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
 
🍀 742. పాపారణ్యదవానలా :
 పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది 

🍀 743. దౌర్భాగ్యతూలవాతూలా :
 దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది 

🍀 744. జరాధ్వాంతరవిప్రభా :
 ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 143 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 143. Bhava dhava sudha vrusthih paparanya davanala*
*Daorbhagya tula vatula jaradhvanta raviprabha ॥ 143 ॥ 🌻*

🌻 741 ) Bhava dhava sudha vrishti -   
She who douses the forest fire of the sad life of mortals with a rain of nectar.

🌻 742 ) Paparanya dhavanala -   
She who is the forest fire that destroys the forest of sin

🌻743 ) Daurbhagya thoolavathoola -   
She who is the cyclone that blows away the cotton of bad luck.

🌻 744 ) Jaradwanthara viprabha -   
She who is the suns rays that swallows the darkness of old age

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment