10 - APRIL - 2022 ఆదివారం, శ్రీ రామ నవమి MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 10, ఆదివారం, ఏప్రిల్ 2022 బృహస్పతి వాసరే 🌹
🌹. శ్రీరామ నవమి శుభాకాంక్షలు, విశిష్టత 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 32-3 - 349 - తత్వదర్శనులు🌹 
3) 🌹. శివ మహా పురాణము - 547 / Siva Maha Purana - 547 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -177🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 166 / Osho Daily Meditations - 166 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మరియు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 10, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీ రామ నవమి, Sri Rama Navami 🌻*

*🍀. శ్రీ సీతారామ స్తోత్రమ్ 🍀*

*ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం!*
*వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!!*

*అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!*
*అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !*
*తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సరైన కప్పులేని ఇంట్లోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా జప ధ్యాన సాధనలు చేయనివాడి చిత్తంలోకి కామ క్రోధాలు, రాగ ద్వేషాలు, అహంకార మమకారాలు ప్రవేశిస్తాయి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్‌ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శుక్ల-నవమి 27:17:30 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: పుష్యమి 30:51:29 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: సుకర్మ 12:03:20 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 14:21:01 వరకు
వర్జ్యం: 13:17:40 - 15:03:00
దుర్ముహూర్తం: 16:51:28 - 17:41:16
రాహు కాలం: 16:57:41 - 18:31:05
గుళిక కాలం: 15:24:18 - 16:57:41
యమ గండం: 12:17:33 - 13:50:56
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 23:49:40 - 25:35:00
మరియు 30:52:04 - 32:35:00
సూర్యోదయం: 06:04:00
సూర్యాస్తమయం: 18:31:05
చంద్రోదయం: 12:50:02
చంద్రాస్తమయం: 01:33:45
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
శ్రీవత్స యోగం - ధన లాభం ,
సర్వ సౌఖ్యం 30:51:29 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*

*🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ.*

*🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏*
- పండిత శ్రీరామశర్మ ఆచార్య

*🌻. ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం!*
*వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!! 🌻*

*🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀*

*దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.*

*శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.*

*ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.*

*అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.*

*రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.*

*నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*

*శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -349 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚*
 
*🍀 32-3. తత్వదర్శనులు - పై ఆవరణ లెట్లున్నను లోపల జీవుడు దైవముయొక్క దివ్య ప్రతి బింబమే. బాహ్య ఆవరణములు లోపలి జీవునికి అంతరాయము కలుగ నేర్చవు. అగ్ని జ్యోతనము జరిగినపుడు అవరణలు అవరోధములు కానేరవు. అనన్యభక్తి సాధనమున అగ్నిజ్యోతనము సులభముగ జరుగును. అట్టి వానికి దైవానుగ్రహము శీఘ్రముగ లభించును. 🍀*

*32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥*

*తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.*

*వివరణము : జీవుడు లోపల జ్యోతిర్లింగము వలె వెలుగుచునే యుండును. దేవాలయము ఆవరణ లెట్లుండినను లోనగల జ్యోతిర్లింగము ఆరాధనీయము. అట్లే పై ఆవరణ లెట్లున్నను లోపల జీవుడు దైవముయొక్క దివ్య ప్రతి బింబమే. జీవులుగ అందరును దేవుని సంతానమే. ఆవరణలు ఆడంబరముగ నుండవచ్చును లేదా అతి సామాన్యముగ నుండ వచ్చును. శిథిలమైపోయి గూడ యుండవచ్చును. కాని లోపలి జీవుడు ఎప్పటికిని తేజోవంతుడే. బాహ్యావరణములు లోపలి జీవునికి అంతరాయము కలుగ నేర్చవు.*

*అగ్ని స్వరూపుడగు జీవుని చుట్టును గల ఆవరణలు అగ్ని ప్రజ్వలనము కాకున్నప్పుడే ఆవరణలుగ యుండును. అగ్ని జ్యోతనము జరిగినపుడు అవరణలు అవరోధములు కానేరవు. అనన్యభక్తి సాధనమున అగ్నిజ్యోతనము సులభముగ జరుగును. అట్టి వానికి దైవానుగ్రహము శీఘ్రముగ లభించును. అగ్ని స్వరూపుడగు జీవుడు స్త్రీయు కాదు, పురుషుడు కాదు. వైశ్యుడు కాదు. శూద్రుడు కాదు. అవియన్నియు ఆవరణములు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 547 / Sri Siva Maha Purana - 547 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴*

*🌻. పరిహాసములు - 2 🌻*

సర్వత్ర అనేక మంగళధ్వనులు, గానములు ఆరంభమయ్యెను. సర్వులకు ఆనందమును పెంపొందించే రమ్యమగు వాద్యధ్వని చెలరేగెను (11). విష్ణువు, నేను, దేవతలు, ముననులు ఇతరులు అందరు హిమవంతుని అనుమతిని పొంది మహానందముతో వెంటనే వారి వారి స్థానములకు వెళ్లితిమి (12).

అపుడు హిమవంతుని రాజధానిలో స్త్రీలు మహానందముతో పార్వతీ పరమేశ్వరులను దోడ్కొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి (13). ఆ స్త్రీలు సాదరముగా లోకాచారములను నిర్వర్తింపజేసిరి. అంతటా ఆనందదాయకమగు మహోత్సాహము వెల్లివిరిసెనున (14). అపుడు వారు జనులకు కల్యాణమును చేసే ఆది దంపతులగు పార్వతీ పరమేశ్వరులను మహాదివ్యమగు వాసగృహమునకు దోడ్కొని వెళ్లి ఆనందముతో లోకాచారములను నెరపిరి (15). అపుడు హిమవంతుని రాజధానిలోని స్త్రీలు వారి దగ్గరకు వచ్చి మంగళకర్మలను చేయించి దంపతులను వాసగృహములో ప్రవేశపెట్టిరి (16).

ఆ స్త్రీలు పులకించిన దేహములు గలవారై చిరునవ్వతో ఒకరి నొకరు చూసుకొనుచూ జయధ్వనిని చేసి వధూవరుల వస్త్రముల ముడిని విప్పుడట మొదలగు పనులను పూర్తి చేసిరి (17). ఆ ఉత్తమ స్త్రీలు వాసగృహమును ప్రవేశించి దాని శోభకు మోహమును పొందిరి. వారు పరమేశ్వరుని చూస్తూ తమ భాగ్యములను ప్రశంసించుకొనిరి (18). 

గొప్ప అందమైన రూపము వేషము గలవాడు, సొగసులన్నిటితో కూడి యున్నవాడు, నూతన వనము నందున్నవాడు, స్త్రీల చిత్తమును మోహింపజేయువాడు (19). చిరునవన్వతో ప్రసన్నమగు ముఖము గలవాడు, సుందరమగు చూపులు గలవాడు, విలువైన వస్త్రమును ధరించినవాడు, అనేక రత్నాభరణములను అలంకరించు కున్నవాడు అగు శివుని జూచిరి (20). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 547 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴*

*🌻 Description of fun and frolic - 2 🌻*

11. Auspicious sounds of music were heard everywhere. The sound of the musical instruments was pleasing and increased the joy of everyone.

12. Viṣṇu accompanied by me, all the gods and sages took leave of the mountain and returned to their abodes.

13. The ladies in the city of the mountain then took Śiva and Pārvatī to the abode of Kubera.

14. There several social customs and conventions were gone through by the ladies. All round, there was great jubilation.

15. Then the couple, benefactors of the people, were led near the bed chamber. It was exquisitely decorated according to convention.

16. The ladies of the city of Himavat approached them and performed the customary auspicious rites.

17. Shouting cries of victory they untied the knot.[8] They were smiling and ogling at one another with hairs standing on their ends due to pleasure.

18-20. Entering the bedchamber and gazing at lord Śiva, the beautiful damsels were much fascinated and they praised their good luck. He was gorgeously dressed in fine clothes. He was bedecked in gemset ornaments. He appeared to be in the prime of youth. He fascinated the ladies with charming loveliness. He was smiling gently and glancing at everyone lovingly.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 177 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. సగుణము - నిర్గుణము 🌻* 

*దైవసాధనలో పరిశుద్ధమయిన పరబ్రహ్మము నిర్గుణమనియు, దానిని సాధించువారు గుణముల నుండి విముఖత చెందవలెననియు నొక మతము. నిర్గుణ స్థితియే ఆనందమనియు , తద్భిన్నములు ఆనందేతర స్థితులనియు వీరి వాదము.*

*పరబ్రహ్మము నిర్గుణమను మాట నిజమే కాని, అది గుణములను చూచి భయపడునది కాదు. దాని యందు గుణములు అంగాంగీ భావముతో నుండి జీవప్రజ్ఞనుండి, ఈశ్వర ప్రజ్ఞ వరకు సోపాన క్రమముగ నేర్పడును.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 166 / Osho Daily Meditations - 166 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 166. నిజమైన బలము 🍀*

*🕉 ఒక ఆశ్రయం లేదా రక్షణను కలిగి ఉండటంతో చాలా అనుబంధం ఏర్పడవచ్చు, కానీ అది మీకు బలాన్ని ఇవ్వదు. మీరు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా బలం వస్తుంది. 🕉*
 
పాత రోజుల్లో ప్రజలు మఠాలకు లేదా హిమాలయాల వంటి సుదూర గుహలకు వెళ్లేవారు. వారు అక్కడ కొంత శాంతిని పొందేవారు. కానీ ఆ శాంతి చవకైనది. ఎందుకంటే ఈ వ్యక్తులు ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడల్లా, వారి శాంతి చాలా పెళుసుగా ఉంది కనుక అది వెంటనే పగిలి పోతుంది. వారు ప్రపంచానికి భయపడతారు. కాబట్టి వారి ఒంటరితనం ఒక రకమైన తప్పించుకునే ధోరణి మాత్రమే. పెరుగుదల కాదు.

ఒంటరిగా ఉండటం నేర్చుకోండి, కానీ కేవలం మీ ఒంటరితనంతో మాత్రమే ఎప్పుడూ ముడిపడి ఉండకండి. ఇతరులతో సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండండి. ధ్యానం చేయడం నేర్చుకోండి, కానీ మీరు ప్రేమకు అసమర్థులుగా మారేంత వరకు వెళ్లకండి. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండండి, కానీ ఈ నిశ్చలత్వంతో మరీ ఎక్కువగా నిమగ్నమై పోకండి. లేదంటే మీరు సమాజాన్ని ఎదుర్కోలేరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం సులభం. ప్రజలతో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కష్టం. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని ఒకసారి మీరు ప్రజలలో ఉన్నప్పుడు మౌనంగా ఉండగలిగితే, దాన్ని మీరు సాధించినట్టు. ఇప్పుడు ఆ శాంతిని ఏదీ నాశనం చేయలేదు.
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 166 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 166. TRUE STRENGTH 🍀*

*🕉 One can become too attached to having a shelter or protection, but that will not give you strength. Strength always comes when you face situations that are hard. 🕉*
 
*In the old days people used to move to monasteries and to the Himalayas and to the faraway caves, and they attained to a certain peace there. But that peace was cheap, because whenever these people would come back to the world, it would immediately be shattered. Their peace was so fragile, they would become afraid of the world. So their isolation was a kind of escape, not growth.*

*Learn to be alone, but never get too attached to your aloneness. Remain capable of relating with others. Learn to meditate, but don't move so far to an extreme that you become incapable of love. Be silent, peaceful, still, but don't get obsessed by this stillness, or you will not be able to face the marketplace. It is easy to be silent when you are alone. It is difficult to be silent when you are with people, but that difficulty has to he faced. Once you are able to be silent with people, you have attained; now nothing can destroy it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 362-2. 'చితిః' 🌻* 

*అట్లే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అను నాలుగు స్థితులలో వసించు పురుషునిగ తెలుపుదురు. ఈ నాలుగు అంశముల ఆధారముగనే జీవుడు దేహమున వసించుట, వర్తించుట యున్నది. కేవలము మనస్సున వసించుట ఒక పాదము వసించుటగనే తెలియవలెను. బుద్ధికి చేరినచో రెండు పాదముల నాక్రమించినట్లు. అహంకారమును దాటినచో నాలుగు పాదములు వసించును. అహంకారము దాటనిదే స్వతంత్రత లేదు.*

*మనస్సు, బుద్ధి, అహంకారము దాటుట త్రివిక్రమత్వము. అట్టివాడు శుద్ధ చైతన్యుడై వెలుగొందును. అతడు అపుడు శ్రీదేవితో ఐక్యము చెంది యుండును. మానవుని యందు ఈ నాలుగు స్థితులు సామ్యము చెందినచో అతడు సిద్ధుడగును. సిద్దుడే స్వతంత్రుడు కూడ. అట్టి సిద్ది శ్రీమాత అనుగ్రహము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 362-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini*
*Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 362-2. Citiḥ चितिः 🌻*

*{Further reading on cit: Brahman is the essence of sat (eternity), cit (pure or foundational consciousness) and ānanda (the bliss). Cit is also known as spiritual conscience, which is also known as citātma. When citātma is reflected in universal nescience, it assumes the role of God.*

*When citātma is reflected in individual nescience the role assumed as the individual souls. Both God and souls are nothing but mere reflections of purest form of consciousness of the Brahman. But there is a distinction between God and soul. God is the Lord of prakṛti and soul becomes liable to the bondages of prakṛti.}*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment