🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 177 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సగుణము - నిర్గుణము 🌻 దైవసాధనలో పరిశుద్ధమయిన పరబ్రహ్మము నిర్గుణమనియు, దానిని సాధించువారు గుణముల నుండి విముఖత చెందవలెననియు నొక మతము. నిర్గుణ స్థితియే ఆనందమనియు , తద్భిన్నములు ఆనందేతర స్థితులనియు వీరి వాదము.
పరబ్రహ్మము నిర్గుణమను మాట నిజమే కాని, అది గుణములను చూచి భయపడునది కాదు. దాని యందు గుణములు అంగాంగీ భావముతో నుండి జీవప్రజ్ఞనుండి, ఈశ్వర ప్రజ్ఞ వరకు సోపాన క్రమముగ నేర్పడును.
...✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
10 Apr 2022
No comments:
Post a Comment