శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🌻 362-2. 'చితిః' 🌻

అట్లే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అను నాలుగు స్థితులలో వసించు పురుషునిగ తెలుపుదురు. ఈ నాలుగు అంశముల ఆధారముగనే జీవుడు దేహమున వసించుట, వర్తించుట యున్నది. కేవలము మనస్సున వసించుట ఒక పాదము వసించుటగనే తెలియవలెను. బుద్ధికి చేరినచో రెండు పాదముల నాక్రమించినట్లు. అహంకారమును దాటినచో నాలుగు పాదములు వసించును. అహంకారము దాటనిదే స్వతంత్రత లేదు.

మనస్సు, బుద్ధి, అహంకారము దాటుట త్రివిక్రమత్వము. అట్టివాడు శుద్ధ చైతన్యుడై వెలుగొందును. అతడు అపుడు శ్రీదేవితో ఐక్యము చెంది యుండును. మానవుని యందు ఈ నాలుగు స్థితులు సామ్యము చెందినచో అతడు సిద్ధుడగును. సిద్దుడే స్వతంత్రుడు కూడ. అట్టి సిద్ది శ్రీమాత అనుగ్రహము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 362-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 362-2. Citiḥ चितिः 🌻


{Further reading on cit: Brahman is the essence of sat (eternity), cit (pure or foundational consciousness) and ānanda (the bliss). Cit is also known as spiritual conscience, which is also known as citātma. When citātma is reflected in universal nescience, it assumes the role of God.

When citātma is reflected in individual nescience the role assumed as the individual souls. Both God and souls are nothing but mere reflections of purest form of consciousness of the Brahman. But there is a distinction between God and soul. God is the Lord of prakṛti and soul becomes liable to the bondages of prakṛti.}


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2022

No comments:

Post a Comment