శ్రీ శివ మహా పురాణము - 547 / Sri Siva Maha Purana - 547
🌹 . శ్రీ శివ మహా పురాణము - 547 / Sri Siva Maha Purana - 547 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴
🌻. పరిహాసములు - 2 🌻
సర్వత్ర అనేక మంగళధ్వనులు, గానములు ఆరంభమయ్యెను. సర్వులకు ఆనందమును పెంపొందించే రమ్యమగు వాద్యధ్వని చెలరేగెను (11). విష్ణువు, నేను, దేవతలు, ముననులు ఇతరులు అందరు హిమవంతుని అనుమతిని పొంది మహానందముతో వెంటనే వారి వారి స్థానములకు వెళ్లితిమి (12).
అపుడు హిమవంతుని రాజధానిలో స్త్రీలు మహానందముతో పార్వతీ పరమేశ్వరులను దోడ్కొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి (13). ఆ స్త్రీలు సాదరముగా లోకాచారములను నిర్వర్తింపజేసిరి. అంతటా ఆనందదాయకమగు మహోత్సాహము వెల్లివిరిసెనున (14). అపుడు వారు జనులకు కల్యాణమును చేసే ఆది దంపతులగు పార్వతీ పరమేశ్వరులను మహాదివ్యమగు వాసగృహమునకు దోడ్కొని వెళ్లి ఆనందముతో లోకాచారములను నెరపిరి (15). అపుడు హిమవంతుని రాజధానిలోని స్త్రీలు వారి దగ్గరకు వచ్చి మంగళకర్మలను చేయించి దంపతులను వాసగృహములో ప్రవేశపెట్టిరి (16).
ఆ స్త్రీలు పులకించిన దేహములు గలవారై చిరునవ్వతో ఒకరి నొకరు చూసుకొనుచూ జయధ్వనిని చేసి వధూవరుల వస్త్రముల ముడిని విప్పుడట మొదలగు పనులను పూర్తి చేసిరి (17). ఆ ఉత్తమ స్త్రీలు వాసగృహమును ప్రవేశించి దాని శోభకు మోహమును పొందిరి. వారు పరమేశ్వరుని చూస్తూ తమ భాగ్యములను ప్రశంసించుకొనిరి (18).
గొప్ప అందమైన రూపము వేషము గలవాడు, సొగసులన్నిటితో కూడి యున్నవాడు, నూతన వనము నందున్నవాడు, స్త్రీల చిత్తమును మోహింపజేయువాడు (19). చిరునవన్వతో ప్రసన్నమగు ముఖము గలవాడు, సుందరమగు చూపులు గలవాడు, విలువైన వస్త్రమును ధరించినవాడు, అనేక రత్నాభరణములను అలంకరించు కున్నవాడు అగు శివుని జూచిరి (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 547 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴
🌻 Description of fun and frolic - 2 🌻
11. Auspicious sounds of music were heard everywhere. The sound of the musical instruments was pleasing and increased the joy of everyone.
12. Viṣṇu accompanied by me, all the gods and sages took leave of the mountain and returned to their abodes.
13. The ladies in the city of the mountain then took Śiva and Pārvatī to the abode of Kubera.
14. There several social customs and conventions were gone through by the ladies. All round, there was great jubilation.
15. Then the couple, benefactors of the people, were led near the bed chamber. It was exquisitely decorated according to convention.
16. The ladies of the city of Himavat approached them and performed the customary auspicious rites.
17. Shouting cries of victory they untied the knot.[8] They were smiling and ogling at one another with hairs standing on their ends due to pleasure.
18-20. Entering the bedchamber and gazing at lord Śiva, the beautiful damsels were much fascinated and they praised their good luck. He was gorgeously dressed in fine clothes. He was bedecked in gemset ornaments. He appeared to be in the prime of youth. He fascinated the ladies with charming loveliness. He was smiling gently and glancing at everyone lovingly.
Continues....
🌹🌹🌹🌹🌹
10 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment