ఓషో రోజువారీ ధ్యానాలు - 166. నిజమైన బలము / Osho Daily Meditations - 166. TRUE STRENGTH


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 166 / Osho Daily Meditations - 166 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 166. నిజమైన బలము 🍀


🕉 ఒక ఆశ్రయం లేదా రక్షణను కలిగి ఉండటంతో చాలా అనుబంధం ఏర్పడవచ్చు, కానీ అది మీకు బలాన్ని ఇవ్వదు. మీరు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా బలం వస్తుంది. 🕉

పాత రోజుల్లో ప్రజలు మఠాలకు లేదా హిమాలయాల వంటి సుదూర గుహలకు వెళ్లేవారు. వారు అక్కడ కొంత శాంతిని పొందేవారు. కానీ ఆ శాంతి చవకైనది. ఎందుకంటే ఈ వ్యక్తులు ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడల్లా, వారి శాంతి చాలా పెళుసుగా ఉంది కనుక అది వెంటనే పగిలి పోతుంది. వారు ప్రపంచానికి భయపడతారు. కాబట్టి వారి ఒంటరితనం ఒక రకమైన తప్పించుకునే ధోరణి మాత్రమే. పెరుగుదల కాదు.

ఒంటరిగా ఉండటం నేర్చుకోండి, కానీ కేవలం మీ ఒంటరితనంతో మాత్రమే ఎప్పుడూ ముడిపడి ఉండకండి. ఇతరులతో సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండండి. ధ్యానం చేయడం నేర్చుకోండి, కానీ మీరు ప్రేమకు అసమర్థులుగా మారేంత వరకు వెళ్లకండి. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండండి, కానీ ఈ నిశ్చలత్వంతో మరీ ఎక్కువగా నిమగ్నమై పోకండి. లేదంటే మీరు సమాజాన్ని ఎదుర్కోలేరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం సులభం. ప్రజలతో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కష్టం. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని ఒకసారి మీరు ప్రజలలో ఉన్నప్పుడు మౌనంగా ఉండగలిగితే, దాన్ని మీరు సాధించినట్టు. ఇప్పుడు ఆ శాంతిని ఏదీ నాశనం చేయలేదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 166 🌹

📚. Prasad Bharadwaj

🍀 166. TRUE STRENGTH 🍀

🕉 One can become too attached to having a shelter or protection, but that will not give you strength. Strength always comes when you face situations that are hard. 🕉


In the old days people used to move to monasteries and to the Himalayas and to the faraway caves, and they attained to a certain peace there. But that peace was cheap, because whenever these people would come back to the world, it would immediately be shattered. Their peace was so fragile, they would become afraid of the world. So their isolation was a kind of escape, not growth.

Learn to be alone, but never get too attached to your aloneness. Remain capable of relating with others. Learn to meditate, but don't move so far to an extreme that you become incapable of love. Be silent, peaceful, still, but don't get obsessed by this stillness, or you will not be able to face the marketplace. It is easy to be silent when you are alone. It is difficult to be silent when you are with people, but that difficulty has to he faced. Once you are able to be silent with people, you have attained; now nothing can destroy it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2022

No comments:

Post a Comment