శ్రీ శివ మహా పురాణము - 756 / Sri Siva Maha Purana - 756
🌹 . శ్రీ శివ మహా పురాణము - 756 / Sri Siva Maha Purana - 756 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 5 🌻
ఆ బుద్ధి మంతుడగు దూత అపుడు ఇంద్రుడు పలికిని వచనములనన్నింటినీ రాక్షరాజునకు నివేదించెను (37). ఆ మాటలను వినిన పిదప కోపముతో వణుకు చున్న క్రింది పెదవిగల ఆ రాక్షసుడు దేవతలనందరినీ జయించవలెనను కోరికతో వెంటనే సైన్య మును సన్నద్ధము చుసెను (38). రాక్షసేంద్రుని ఆ సైన్యసన్నాహము లోనికి అన్ని దిక్కులనుండియు, మరియు పాతాళములనుండియు రాక్షసులు కోట్ల సంఖ్యలో వచ్చి చేరిరి (39). ప్రతాపశాలి, మహావీరుడు, సముద్రపుత్రుడునగు జలంధరుడు అపుడు శుంభ నిశుంభాదిరాక్షసులతో, కోట్లాది సైన్యముతో, సేనానాయకులతో గూడి బయలుదేరెను (40). ఆ సముద్రపుత్రుడు సైన్యములన్నింటితో గూడి శీఘ్రమే స్వర్గమునుచురి శంఖము నూదగా, వీరులు అంతటా సింహనాదములను చుసిరి (41).
ఆ రాక్షసుడు స్వర్గమును చేరి నందనవనములో విడిది చేసి మహాసైన్యముతో చుట్టు వారబడి యున్నవాడై సింహనాదమును చుసెను (42). అమరావతీనగరమును ముట్టడించిన ఆ మహాసైన్యమును గాంచిన దేవతలు కవచములను ధరించి యుద్ధము కొరకై నగరమునుండి బయలుదేరిరి (43). అపుడు దేవసైన్యము, రాక్షస సైన్యముల మధ్య జరిగెను. దానిలో వారు రోకళ్లను, పరిఘలను, బాణములను, గదలను, గొడ్డళ్లను, శక్తి ఆయుధములను వాడిరి (44). ఆ రెండు సైన్యములు ఒక దానిపై నొకటి దండయాత్ర చేసినవి. సైనికులు ఒకరినొకరు సంహరింప మొదలిడిరి. క్షణములో ఆ రెండు సేనలలో రక్షము ప్రవహింపజొచ్చెను (45).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 756🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 5 🌻
37. All the words thus spoken by Indra were narrated to the king of Asuras by the intelligent emissary.
38. On hearing it, the lips of the Asura throbbed with anger. Desirous of conquering the gods he exerted himself immediately.
39. In that enterprise of the lord of the Asuras, countless Asuras from all the quarters and the nether region took part and helped him.
40. Then the extremely heroic and valorous son of the ocean set forth with countless generals, Śumbha, Niśumbha and others.
41. Very soon, he reached the heaven along with his force. He blew his conch. All the heroic soldiers roared.
42. After going to heaven he stationed himself in Nandana. In the midst of all his forces he roared like a lion.
43. On seeing a vast army surrounding the city, the gods came out of Amarāvatī fully equipped with armour for the battle.
44-45. Then a battle between the armies of the gods and Asuras ensued. They rushed against one another with iron clubs, arrows, maces, axes and spears. They hit one another. Within a short time both the armies began to wade through streams of blood.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment