🌹 10, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 10, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 10, JULY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 396 / Bhagavad-Gita - 396 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 24 / Chapter 10 - Vibhuti Yoga - 24 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 242 / Agni Maha Purana - 242 🌹 
🌻. సూర్య పూజా విధి వర్ణనము - 2 / Mode of worshipping the Sun - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 108 / DAILY WISDOM - 108 🌹 
🌻 17. మనిషి యొక్క స్వీయ-చైతన్యం / 17. The Self-consciousness of Man 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 374 🌹*
6) 🌹. శివ సూత్రములు - 110 / Siva Sutras - 110 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 13 / 2-07. Mātrkā chakra sambodhah   - 13 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 10, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 38 🍀*

*77. బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ | కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః*
*78. సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాంపతిః | దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వ రత్నవిత్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అనుగ్రహాపేక్ష - ఈశ్వరానుగ్రహం నీవు అపేక్షింప రాదని నేననడం లేదు. యోగసాధన చెయ్యడం ఆ అనుగ్రహం పొందడానికే గదా. అది వెంటనే గాని, త్వరలోగాని రావాలని కోరరాదని మాత్రమే అంటున్నాను. అంతరంగంలో ఆకాంక్ష వుండి, దానిని వదలకుండ వుంటే అనుగ్రహం త్వరగానో, ఆలస్యంగానో వచ్చి తీరుకుంది. ఆకాంక్షలో చిత్తశుద్ధితోపాటు నిశ్చలత్వం కూడా ఉండడం అవసరం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ అష్టమి 18:45:29 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: రేవతి 19:00:39 వరకు
తదుపరి అశ్విని
యోగం: అతిగంధ్ 12:33:27 వరకు
తదుపరి సుకర్మ
కరణం: బాలవ 07:18:56 వరకు
వర్జ్యం: 27:39:00 - 41:29:24
దుర్ముహూర్తం: 12:47:33 - 13:40:00
మరియు 15:24:53 - 16:17:19
రాహు కాలం: 07:26:21 - 09:04:41
గుళిక కాలం: 13:59:40 - 15:37:59
యమ గండం: 10:43:00 - 12:21:20
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 23:58:12 - 37:48:36
సూర్యోదయం: 05:48:01
సూర్యాస్తమయం: 18:54:38
చంద్రోదయం: 00:31:36
చంద్రాస్తమయం: 12:30:00 
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు : మతంగ యోగం - అశ్వ
లాభం 19:00:39 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 396 / Bhagavad-Gita - 396 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 24 🌴*

*24. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |*
*సేనానీనామహం స్కన్ద: సరసామస్మి సాగర: ||*

🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను.*

🌷. భాష్యము :
*స్వర్గలోకదేవతలలో ఇంద్రుడు ముఖ్యదేవత. అతడే స్వర్గాధిపతియనియు తెలియబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము మరియు బృహస్పతి అతని పురోహితుడు. ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుట వలన బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యెను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనానాయకులలో ప్రధానుడు. అదే విధముగ జలనిధులలో సముద్రము ఘనమైనది. ఈ ప్రాతినిధ్యములన్నియును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే ఒసగును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 396 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 24 🌴*

*24. purodhasāṁ ca mukhyaṁ māṁ viddhi pārtha bṛhaspatim*
*senānīnām ahaṁ skandaḥ sarasām asmi sāgaraḥ*

🌷 Translation : 
*Of priests, O Arjuna, know Me to be the chief, Bṛhaspati. Of generals I am Kārttikeya, and of bodies of water I am the ocean.*

🌹 Purport 
*Indra is the chief demigod of the heavenly planets and is known as the king of the heavens. The planet on which he reigns is called Indraloka. Bṛhaspati is Indra’s priest, and since Indra is the chief of all kings, Bṛhaspati is the chief of all priests. And as Indra is the chief of all kings, similarly Skanda, or Kārttikeya, the son of Pārvatī and Lord Śiva, is the chief of all military commanders. And of all bodies of water, the ocean is the greatest. These representations of Kṛṣṇa only give hints of His greatness.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 243 / Agni Maha Purana - 243 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 73*

*🌻. సూర్య పూజా విధి వర్ణనము - 2 🌻*

*పిమ్మట ''ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయ సౌరాయ యోగపీఠాత్మనే నమః'' అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట ''ఖఖోల్కాయ నమః'' అను షడక్షర మంత్రమునకు ప్రారంభము 'ఓం హం ఖం' అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల ''ఓం హం ఖం ఖఖోల్కాయ నమః'' అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావామనము చేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో నున్న ఉదకమును లలాటసమీపమునకు తీసికొనివెళ్ళి రక్త వర్ణుడైన సూర్యుని ధ్యానించి, ఆ సూర్యడు తన ఎదుట నున్నట్లు భావన చేయవలెను. పిదప ''హ్రాం హ్రీం సః సూర్యాయ నమః'' అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య వీయవలెను.*

*పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుపచారములు సమర్పింప వలెను. పిదప సూర్యుని ప్రీతికొరకై గంధాదికము సమర్పింపవలెను. ఆగ్నేయమునందు ''ఓం అం హృదయాయ నమః'' అను మంత్రముచే హృదయమును, నైరృతిదిక్కునందు ''ఓం భూః అర్కాయ శిరసే స్వాహా'' అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున ''ఓం భువః సురేశాయ శిఖాయై వషట్‌'' అను మంత్రముచే శిఖన, ఈశాన్యమునందు ''ఓం స్వః కవచాయ హుం'' అను మంత్రముచే కవచమును, ఇష్టదేవతకును ఉపాసకునకును మధ్య ''ఓం హాం నేత్ర త్రయాయ వౌషట్‌'' అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమభాగమునందు'' వః అస్త్రాయ ఫట్‌'' అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిమ్మట పూర్వాదిదిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 243 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 73*
*🌻 Mode of worshipping the Sun - 2 🌻*

9. One should invoke the god (with the mantra) hrāṃ hrīṃ sa and salutations to the sun-god [sūrya], showing the mudrā. One should offer him perfume etc. and show the bimbamudrā[1].

10. One should show the padmamudrā[2] and the bilvamudrā[3] (to the god) in all directions commencing with the southeast. Oṃ aṃ salutations to the heart. (Salutations) to sun on the head.

11. Bhūrbhuvaḥ svaḥ! Obeisance to the lord of celestials in the tuft of hair in the south-west, huṃ to the armour in the north-west, hāṃ to the eyes at the centre.

12. Va! (salutations) to the weapons in the east etc. Then one should show mudrās. Dhenumudrā (fingers folded in the shape of a cow) to the heart etc., The Goviṣāṇa mudrā[4] should be shown to the eyes.


Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 108 / DAILY WISDOM - 108 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 17. మనిషి యొక్క స్వీయ-చైతన్యం 🌻*

*మనిషి యొక్క స్వీయ-చైతన్యం అనేది అహం మరియు వ్యక్తిత్వం యొక్క సమాగమం. మానవుని స్థాయికి దిగువన ఉన్న జీవులకు మనుషులకు ఉన్నంత తీవ్రతతో స్వీయ చైతన్యం ప్రకటితమవ్వదని మనస్తత్వశాస్త్రంలో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందువల్లనే మానవుని కంటే దిగువ ఉన్న జంతుజాతులు తమ రోజువారీ వ్యవహారాల్లో కారణాకారణాలు, గతాన్ని గుర్తుంచుకుని, దాని ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేసే తార్కిక సమర్ధతను కలిగి ఉండవు. కానీ, ఈ ప్రత్యేకతే మనిషిని మానవాతీత స్థాయి కంటే పైకి ఎదగడం, ఇతర వ్యక్తులతో సామరస్యపూర్వక జీవితాన్ని గడపడానికి తీవ్రమైన అడ్డంకిగా పనిచేస్తుంది.*

*ఎందుకంటే, స్వీయచైతన్యం తరచుగా ఒక నిరంకుశ స్వభావమైన అహంభావంతో కలిసి ఉంటుంది. ఇది చుట్టుపక్కల వ్యక్తులకు తగిన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇతరులపై తనకి ఉన్న ఆధిపత్యాన్ని ఆనందిస్తుంది. అహంభావం అనేది వ్యక్తిత్వం మరియు స్వీయచైతన్యం యొక్క కలియక వల్ల పుట్టిన ఒక విషయం అని ఆదిభౌతికవాదులు వివరిస్తారు. ఇది ఒకవైపు చైతన్యం యొక్క తిరుగులేని ఆధిపత్యాన్ని ధృవీకరిస్తూ, మరోవైపు వ్యక్తిత్వం యొక్క వేర్పాటువాద ధోరణికి కారణం అయింది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 108 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 17. The Self-consciousness of Man 🌻*

*The self-consciousness of man is the principle of the ego and individuality. Researches in psychology have revealed that living beings below the human level lack self-consciousness in the intensity in which it blossoms in man. It is this specific reason which explains the incapacity of the subhuman species to conduct logical processes of induction and deduction in daily affairs, or remember the past and anticipate the future in a mathematical and logical form, as man does. But, this special endowment raising man above the subhuman level, also at the same time, acts as a serious obstacle to leading a harmonious life with other people, especially.*

*For, self-consciousness is often blended with egoism of an autocratic nature, which refuses to give due credit to people around and delights in affirming its supremacy over others. Metaphysicians explain that egoism is an unfortunate product of a mutual superimposition between consciousness and the principle of individuality, which on the one side lifts up the banner of the indisputable supremacy of consciousness, and the separatist tendency of individuality on the other.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 374 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుస లాడతాడు. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. 🍀*

*మనం వినకపోయినా ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. అది నిశ్చలమైన చిన్ని స్వరం. అది దేవుడి స్వరం. కానీ మన తలలో కావలసినన్ని ఇతర స్వరాలు బోలెడు వున్నాయి. కనుక మనం ఆ చిన్ని నిర్మల స్వరాన్ని వినలేం. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుసలాడతాడు. ప్రేమ ఎప్పుడూ గుసగుస లాడుతుంది. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. ప్రేమ ఆశతో వుండడం తెలుసు. దేవునికయినా అంతే. ఈ రోజు కాకుంటే రేపు. ఒకరోజు నువ్వు వింటావు. కాబట్టి మరింత మరింత నిశ్శబ్దంగా వుండు. నీలో దేవుడి గుసగుసలు వింటావు. అది కొత్త జీవితానికి ఆరంభం. ఆ జీవితమే శాశ్వత జీవితం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 110 / Siva Sutras - 110 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 13 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*ఈ షడ్భుజిని షట్కణము అంటారు. దీని నుండి షట్కోణ శక్తి అభివ్యక్తి అవడం ప్రారంభమవుతుంది. ఈ దశ వరకు ఉన్న ప్రక్రియను మొదటి పద్నాలుగు అచ్చులు సూచిస్తాయి, రెండు అచ్చులు మాత్రమే మిగిలి ఉన్నాయి, అం మరియు అః (अं మరియు अः). ఈ రెండు అచ్చులను అనుస్వార (ధ్వని తర్వాత, రేఖపై చుక్కతో గుర్తించబడిన నాసికా శబ్దం, మరియు ఇది ఎల్లప్పుడూ ముందున్న అచ్చుకు చెందినది) మరియు విసర్గ (అక్షరం తర్వాత అక్షరం ద్వారా గుర్తించబడిన అంశం) అని పిలుస్తారు. అనుస్వార అంటే సాధారణంగా బిందు లేదా చుక్క అని అర్థం. ఈ బిందువు విశ్వం యొక్క రూపంలో విస్తరించిన శివుని నిజమైన వైభవాన్ని సూచిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 110 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 13 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*This hexagon is known as ṣaṭkoṇa. From this ṣaṭkoṇa manifestation begins to unfold. The process up to this stage was represented by the first fourteen vowels, leaving only the two vowels, aṁ and aḥ (अं and अः). These two vowels are known as anusvāra (after sound, the nasal sound which is marked by a dot above the line, and which always belongs to a preceding vowel) and visarga (letting go factor, marked by a : after letter).  Anusvāra typically means a bindu or a dot. This bindu represents the true glory of Śiva, expanded in the form of the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment