భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 110



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 110   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 2 🌻

7. ఇలాగ భేదంతో ఉండేటటువంటి ఈ జగత్తంతా దేనియందు అధిష్ఠానంగా, దేని యందు విశ్రమిస్తుందో, దేనిని ఆధారంగా చేసుకోని ఈ జగత్తు పెరుగుతోందో అనేది తెలుస్కోవడాన్నే పరవిద్య అంటారు. ఈ మిగతా విద్యలన్నీ ఎందుకూ పనికిరావు.

8. పరమాత్మ వస్తువు తనకుతాను జగత్తుగా పరిణామం పొందాలి అనుకుని సంకల్పించినప్పుడు, మొట్టమొదట అగ్ని పుట్టింది. అగ్ని ఆయన తేజస్వరూపమే! ఆ తరువాత ఉదకము పుట్టింది. ఆ తేజము, ఉదకములయొక్క సంయోగముచేత అన్నం పుట్టింది.(అన్నము అంటే ద్రవ్యము అని అర్థం. అక్క తినేదికాదు అన్నము అంటే. అది ద్రవ్యమునకే పేరు.)

9. ఈ తేజము, జలము, అన్నము – మూడుకలిసి త్రివ్రృత్కరణమంది సృష్టి నిర్వహించింది.(త్రివ్రృత్కరణము అని వేదాంతంలో చెప్తారు.

10. త్రివ్రృత్కరణమంటే, తేజంలోని సగభాగాన్ని తీసి జలం లోను, అన్నంలోను కలపటం; అన్నంలోని అర్థభాగంతీసి తేజములో, జలములో కలపటం – అంటే వీటిని ఆయా ప్రమాణాలలో ఒకదానితో ఒకటి కలపటం అనే పంచీకరణం ఎలా ఉంటుందో, త్రివ్రృత్కరణం అలా ఉంటుంది.)

11. అలా అగ్ని అంటే తేజము, ఉదకము; ద్రవ్యము అంటే అన్నము ఇవన్నీ కలిసి జీవులయ్యాయి. ఈ జీవులకు వాటిలో అనేకరకములైన జన్మలు – అండజము, స్వేదజము, ఉద్భిజము మొదలైనవి పుట్టాయి. ఈ ప్రపంచమంతటికీకూడా మూలపదార్థములు మూడే ఉన్నాయి.

12. అంటే, జలముంది, అగ్ని ఉన్నాడు, ద్రవ్యముఉంది, అంతే! ఇంత వివిధంగా ఇన్ని ఏమీలేవు. ఉన్నవన్నీ కలిసి మూడే ఉన్నవి. వాటి వెనుక కాల పరబ్రహ్మవస్తువున్నది. సృష్టిని ఒక్కొక్క్ మహర్షి ఒక్కొక్కరకంగా బోధించాడు. “ఆ విధంగా ఒక్కొక్క రకంగా ఉన్నా, అవి మూడే ద్రవ్యములుగా ఉన్నాయి.

13. ఆ బోధను జ్ఞాపకం పెట్టుకుంటే, అలాగే తపస్సు చేయగాచేయగా జగత్తంతా వట్టి జలమే కనబడుతుంది, అగ్నిమాత్రమే కనబడుతుంది, వట్టి ద్రవ్యంమాత్రమే కనబడుతుంది. ఈ ద్రవ్యమంతా ఒకేరాశిగా కనబడుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

14 Sep 2020

No comments:

Post a Comment