✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 65
🌻 65. తదర్పితాఖీలాచారః సన్ కామ క్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్ ॥ 🌻
భగవంతునికి అర్పణ అయిన భక్తుడు ఇంకనూ తనలో కామక్రోధాభిమానాలు మిగిలి ఉన్నాయని అతడికి తెలిస్తే అవేవో ఇతర జీవుల మీద చూపించకుండా భగవంతుని మీదే చూపిస్తే మంచిది.
ఇతరుల మీద చూపిస్తే బంధమవుతుంది. భగవంతుని మీద చూపిస్తే ఆయన నుండి ఏ ప్రమాదం ఉండదు. భక్తుడు అలా భగవంతుని మీద చూపినందుకు తరువాత బాధ పడతాడు, పశ్చాత్తాపపడతాడు. అందువల్ల అతడిలో భక్తి భావం మరింత పెరుగుతుంది. ఈ ప్రతిస్పందనల వలన కామ క్రోధాభిమానాలు క్రమంగా తగ్గిపోతాయి.
గొప్పు భక్తుడను అని భావించిన వారికి గర్వభంగం జరిగిన ఘటన లెన్నో ఉన్నాయి పురాణాలలో. భక్తురాలైన సత్యభామకు శ్రీకృష్ణ భగవానుడు కేవలం తన వాడనే అహంకారం కలుగగా కృష్ణ తులాభారంతో గర్వ భంగమైన కథ మనకు తెలుసు.
అహంకారంలేని రుక్కిణీ మాత భక్తికి భగవానుడు అధీనమైన సంగతీ తెలుసు. ఆ సత్యభామ తనలోనున్న భక్తి భావం వలన అహంకరించింది గాని, ఇతరులమీద కాదు. అందువలన భగవంతుడు ఆమె అహంకారాన్ని తొలగించి ఉపాయంతో ఆమెను అనుగ్రహించాడు.
కనుక కామక్రోధాభిమానాలను భగవంతుడిపై చూపితే గుణపాఠం జరిగి, మేలు జరుగవచ్చును గాని, అది బంధం కాదు. బంధమే అయినా అది భగవంతునితోనే గనుక ప్రమాదం లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
14 Sep 2020
No comments:
Post a Comment