🌹 30. గీతోపనిషత్తు - ఇందియ్రములు - సౌలభ్యము - ప్రమాదము - ఇంద్రియార్థములందు బాగుగ రుచిగొని జీవుడు బహిర్గతుడిగ వుండి పోయెను. ఆత్మసాధన మార్గమున జీవుడు ఇపుడు తిరోగమనము నేర్వవలెను. 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 60 📚
ఇంద్రియ నిర్మాణము సృష్టి నిర్మాణ మహా యజ్ఞమున అత్యంత ప్రాధాన్యము గలదు. సృష్టి నిర్మాణమున జీవులకు దేహము లేర్పరచి, ఆ దేహములందు జీవుని ప్రతిష్టాపన చేసి, దేహము ద్వారా సృష్టి వైభవమును అనుభవింపచేయుట సృష్టి సంకల్పములో నొక భాగము.
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60 ||
జీవుని దైవము నుండి ప్రత్యగాత్మక వ్యక్తము చేయుట ఒక మహత్తర ఘట్టము. ఏకము, అనేకమగుట
ఒక యజ్ఞముగ సాగినది. జీవులేర్పడిన వెనుక వారికి దేహము లేర్పరచుట మరియొక మహత్తర యజ్ఞము.
జీవులకు, దేహములకు పరస్పరత్వ మేర్పరచి జీవ చైతన్యమును ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రకింపచేయుట ఒక రసవత్తర ఘట్టము. ఇదియే భాగవతమున ప్రచేతసుల కథగా వివరింపబడినది. జీవుని బహిర్గతుని చేయుటకు బృహత్తర ప్రయత్నము జరిగినది.
అందులకు ఇంద్రియము లేర్పరచి, ఇంద్రియముల ద్వారా జీవుని ఆకర్షింపబడు విషయము లేర్పరచవలసి వచ్చెను. క్రమశః జీవుడు ఇంద్రియముల నుండి బహిర్గతుడగుట నేర్చెను.
ఇంద్రియార్థములందు బాగుగ రుచిగొని బహిర్గతుడిగ వుండి పోయెను. అందువలన భగవానుడు ఇంద్రియములు జీవుని బలాత్కారముగ లాగుచున్నవని తెలుపుచున్నాడు. ఇంద్రియ నిర్మాణము అందుకొరకే.
ఆత్మసాధన మార్గమున జీవుడు ఇపుడు తిరోగమనము నేర్వవలెను. తిరోగమనము మాత్రమే నేర్చిన చాలదు. తిరోగమనము తెలియకున్న సృష్టి వ్యూహమున చిక్కును. ఇదియే అభిమన్యుడు పద్మవ్యూహమున చిక్కుట. అట్లు చిక్కువాడు నశించును.
ఈ ఇంద్రియ వ్యాపారము నుండి బయల్పడుటకు కూడ మరల మహత్తర ప్రయత్నమే చేయవలెనని భగవానుని హెచ్చరిక.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
14 Sep 2020
No comments:
Post a Comment