భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 134


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 134 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 13 🌻


544. సంస్కారముల నుండి బయటపడిన ముక్త చైతన్యము = ఎఱుకతో కూడిన జ్ఞానము.

545. గమ్యమును చేరగనే, శివాత్మలందరు తమ స్వీయ స్వభావత్రయమైన అనంత సచ్చిదానందములను అనుభవించుచున్నప్పుడే, దివ్య వారసత్వమైన అనంతానందమును నిస్సంకోచముగా నిరంతరముగా ఎఱుకతో అనుభవింప సాగెదరు.

546. భగవంతుని దివ్య సుషుప్తిలో నిద్రాణమైన సంస్కారముల ద్వారా సచరాచర సమన్వితంబైన మాయ సృష్టంపబడి, భగవంతుని దివ్య స్వప్నములో (వర్తమానములో) పోషింపబడి, దివ్య జాగృతియైన భవిష్యత్తులో నాశనమగుచున్నది. అనగా - మానవరూపములో నున్న భగవంతుడు, దివ్యత్వసిద్ధిని పొందుటతో మాయా సృష్టి నాశనమగుచున్నది.

547. మిథ్యాహము నుండి నిస్సంగమును పొందినవాడు భగవంతుడగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Dec 2020

No comments:

Post a Comment